Monday, 10 November 2014

66.నాకెందుకిలా జరుగుతోంది?


ప్రశ్న :  నా వయస్సు 21 సంవత్సరాలు. నాకు 15 సంవత్సరాల నుండి హస్తప్రయోగం చేసుకునే అలవాటు ఉంది. హస్తప్రయోగం చెయ్యడం తప్పు, దీనివల్ల మర్మాయవవాలు కందినట్లు వుండి, లేపన శక్తి తగ్గుతుందని, ఆరోగ్య సమస్యలు వస్తాయని కొన్ని పుస్తకాలలో చదివాను. ఇది నిజమేనా? నాకు స్ఖలనం తొందరగా అవుతుంది. కనీసం ఒక నిమిషం కూడా ఆగట్లేదు. స్ఖలనానికి కనీసం 2 నుండి 3 నిముషాలైనా పడుతుందంటారు కదా. మరి నాకెందుకిలా జరుగుతోంది? హస్తప్రయోగాన్ని మానేయడం ఎలా? ఒకవేళ మానేయకపోతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

జవాబు :  లేపన శక్తి అనే మాటకు అర్థం లేదు. వారానికి 4-5 సార్లు హస్త ప్రయోగం చేసుకోవడం వల్ల ఏ రకమైన సెక్సు సమస్యా రాదు. హస్తప్రయోగం తప్పు, పాపం అన్న అభిప్రాయంతో, ఎవరైనా చూస్తారేమోనని తొందర తొందరగా, భయంతో ముగించడం వల్ల శీఘ్రస్ఖలనం అవుతుంది తప్ప, హస్త ప్రయోగంతో కాదు. ఇక నీ జననాంగాలు కమిలినట్లు అవడం ఏదైనా చర్మ సంబంధమైన ఇన్‌ఫెక్షన్స్ వల్ల తప్పితే హస్త ప్రయోగం వల్ల కాదు. విడిగా నీకు స్ఖలనం చాలా త్వరగా క్షణాలలో అయిపోతుంటే సెక్సాలజిస్ట్‌ని కలువు. అంగస్తంభన కాలాన్ని పెంచే శీఘ్రస్ఖలనాన్ని కంట్రోల్ చేసే పీసీ, ఐవీటీ, ఈవీటీ, డబ్ల్యూపీటీ టెక్నిక్స్ సెక్స్ థెరపీలో భాగంగా చెబుతారు. అలాగే, సెక్స్‌కు ముందు, చేసేటప్పుడు ఫర్‌ఫార్మెన్స్ ఆంైగ్జెటీ వల్ల కూడా శీఘ్ర స్ఖలనం అవుతుంది. వీటికి చికిత్స ఉంది. భయపడాల్సిన అవసరం లేదు. నువు వివాహానికి అర్హుడివే. అయితే, అతి హస్తప్రయోగం అంటే రోజుకి 2-4 సార్లు మంచిది కాదు. ఒకసారి సెక్సాలజిస్ట్‌ని కలిసి ప్రిమెరైటల్ కౌన్సెలింగ్ తీసుకో. నీ భయసందేహాలు తీరుతాయి.

1 comment:

  1. Naku adavalla podugu jadalani chuse jadato kottukovalanipistundi vallani gundu cheyalanipistundi EDI emana rogama EDI tagged ela cheppagalaru

    ReplyDelete