Thursday, 6 November 2014

62.నా గర్ల్ ఫ్రెండ్ నాకు దూరంగా వెళుతోంది... సెక్స్ చేస్తే బంధం అలాగే ఉంటుంది కదా...


ప్రశ్న :  నేను నా గర్ల్ ఫ్రెండ్ ముద్దులు, కౌగలింతలు, అంగ చూషణ, యోని చూషణలు చేసుకున్నాం. కానీ లైంగికంగా మాత్రం కలవలేదు. ఇప్పుడు ఆమెకు లండన్ లో ఉద్యోగం వచ్చింది. కనీసం రెండేళ్ల దాకా అక్కడే ఉంటుందట. నాకు అక్కడికి వెళ్లే అవకాశం లేదు. ఆమె లండన్ నుంచి తిరిగి వచ్చాక పెళ్లాడదామంటోంది.
 
కానీ అక్కడికెళ్లిపోయిన తర్వాత నన్ను మర్చిపోతుందేమోనని ఆందోళనగా ఉంది. ఆమె అలా చేస్తే నేను బతకను. అందుకని ఆమె లండన్ కు వెళ్లేలోపు సెక్స్ చేస్తే ఆ సెక్స్ తృప్తిని మర్చిపోకుండా ఉంటుందని అనుకుంటున్నా. ఇలా చేయడం కరెక్టే కదా...?
 
జవాబు :  సెక్స్ కంటే బలమైనది నమ్మకం. ఆమె మీ పట్ల, మీకు ఆమె పట్ల నమ్మకం లేనపుడు సెక్స్ చేసినా అది నిలువదు. ఎందుకంటే సెక్స్ చేసినంత మాత్రాన ఆమె మిమ్మల్ని మనస్పూర్తిగా ప్రేమించలేదంటే, ఎక్కడున్నా మీకు దగ్గర కాలేదు. అలాగే మీరు ఆమెను పూర్తిగా విశ్వసించడంలేదని తెలుస్తోంది.
 
పెళ్లికి ముందు సెక్స్ చేయడం వల్ల ఇద్దరికీ సమస్యలు ఎదురవుతాయి. ఆమె కెరీర్ ఇపుడిపుడే తారాస్థాయికి వెళుతున్నట్లు కనబడుతోంది. కనుక ఆమెను విశ్వసించండి. ఒకవేళ లండన్ కు మిమ్మల్ని మర్చిపోయి మిమ్మల్ని కాదనుకుంటే ఆమె ప్రేమ నిజం కాదని అనుకోవాల్సి వస్తుంది. అలా మిమ్మల్ని వదిలేస్తే మీరు చేయగలిగింది ఏముంటుంది. బలవంతంగా ఏ బంధాన్ని కూడా గట్టిగా పట్టిపెట్టి ఉంచలేము.

No comments:

Post a Comment