Monday, 10 November 2014

74.స్తనాల సైజులు పెద్దవిగా ఉంటే పెళ్లికి ముందే సెక్స్‌లో పాల్గొన్నట్టా?


ప్రశ్న :   స్తనాల సైజులు పెద్దవిగా ఉంటే పెళ్లికి ముందే సెక్స్‌లో పాల్గొన్నట్టా?


జవాబు :  చాలామంది యువతులకు వక్షోజాలు చాలా పెద్దవిగా ఉంటాయి. చూసేందుకు సన్నగా ఉన్నప్పటికీ.. వక్ష ద్వయం మాత్రం భారీగా ఉంటుంది. మరికొందరిలో మాత్రం లావుగా ఉన్నప్పటికీ.. ఈ సైజులు మాత్రం చిన్నవిగా ఉంటాయి. ముఖ్యంగా సన్నగా ఉండే యువతిలో వక్షోజాల సైజులు పెద్దవిగా ఉండటం వల్ల చూసేందుకు ఆకర్షణీయంగా ఉంటాయి.
 
అయితే వారికి పెళ్లి అయిన తర్వాత వచ్చే భర్తలు అనుమానం కలిగిన వాళ్లు అయితే లేనిపోని మాటలు పడాల్సి వస్తుంది. పెళ్లికి ముందే వక్షోజాలు పెద్దవిగా ఉంటే ఖచ్చితంగా వివాహానికి ముందే సెక్స్ అనుభవం ఉండి ఉంటుందనే ఆలోచనకు వచ్చి వేధిస్తుంటారు. ఈ ప్రశ్నకు సమాధానం కోసం వైద్య నిపుణులను సంప్రదిస్తే..
 
వక్షోజాల సైజు పెద్దగా ఉంటే పెళ్ళికి ముందు సెక్స్ అనుభవం ఉన్నట్లు ఎవరైనా చెప్పినట్టయితే ఆ మాటలు వారి అవివేకానికి నిదర్శనం. ఇటువంటి అనుమానాలతో సంసారాన్ని పాడుచేసుకోవడం మినహా మరొకటి లేదు. వక్షోజాల సైజులు కొందరిలో భారీగా ఉన్నట్లు కనబడటం సహజం. హార్మోన్లలో తేడా వల్ల ఇలా జరుగుతుంది. అంతేకానీ, ఈ సైజులు పెద్దవిగా ఉంటే పెళ్లికి ముందే సెక్స్ అనుభవం ఉన్నట్టు కాదని వారు చెపుతున్నారు.

No comments:

Post a Comment