Monday, 10 November 2014

72.శృంగారంలో ఇది వైఫల్యమేనా?


ప్రశ్న :   నా వయసు 32 సంవత్సరాలు. నాకు పదేళ్ళ క్రితం పెళ్ళయింది. నా భార్యతో సెక్స్‌లో పాల్గొన్న ప్రతీసారి ఒక నిముషంలోపే స్ఖలనం అయ్యింది. దీంతో నా భార్య అసంతృప్తికి లోనైంది. నాకూ అవమానంగా అనిపించింది. నాకున్న కోపంలో గొడవపడి విడిపోయాం. నాతో సెక్స్‌లో సంతృప్తి లేకనే విడిపోయిందని నాకు తర్వాత తెలిసింది. తర్వాత సెక్స్, నరాల, ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్‌లను సంప్రదించాను. వీరందరు రకరకాల టెస్టులు చేసి అన్నీ నార్మల్‌గానే ఉన్నాయని కొన్ని మందులు వాడితే శీఘ్రస్ఖలనం తగ్గుతుందని అన్నారు.

కానీ, ఏ మందులు వాడినా ఫలితం లేదు. తర్వాత ఇద్దరు ఆడవాళ్లతో సెక్స్‌లో పాల్గొన్నా ఒక్క నిముషంలోనే వీర్యం పడిపోయి అంగం మెత్తబడింది. నాకు కోపం, భయం, ఆలోచనా ఎక్కువ. నేను మామూలుగా ఉంటే దమ్ము రాదు. ఏదైనా పని చేస్తుంటే దమ్ము వస్తుంది. మా ఇంట్లో వాళ్ళందరూ మళ్లీ పెళ్ళి చేసుకోమంటున్నారు. కానీ, నా సమస్య వారికి తెలియదు. నేనేం చేయాలో అర్థం కావడం లేదు. ఇక నాకు చావే దిక్కా. దయచేసి నా సమస్యను మీరే పరిష్కరించగలరు? :


జవాబు :   మీకున్న సెక్స్ సమస్యను శీఘ్రస్ఖలనం అంటారు. అనుకున్న సమయానికంటే ముందే వీర్యం స్ఖలనం అవుతుంది. ఒక రెండు నిముషాలలోపే స్ఖలనం అయితే దాన్ని శీఘ్రస్ఖలనం అంటారు. దీనికి ప్రోస్టేట్ గ్రంథి సమస్య, మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు, పీ.సీ. కండరాల బలహీనత లాంటి వాటికి వాడే మందులు (బీపీకి వాడేవి), శారీరక కారణాలతో పాటుగా సెక్స్‌కు ముందు తీవ్రమైన మానసిక ఆందోళన, భయం, నిన్నటిలా ఇప్పుడూ క్షణాల్లో స్ఖలనం అవుతుందన్న ముందస్తు ఆలోచన, ఎక్కువ సేపు ఉండి తీరాలన్న స్వీయ డిమాండ్, భార్య తిరస్కారం, ఆమె ఆందోళనతో సహకరించకపోవడం, అవమానించడం వంటి వాటన్నింటితోపాటు ముఖ్యంగా అంగప్రవేశం తర్వాత ఆమె నిరాసక్త పూరిత బాడీ లాంగ్వేజ్, ఎక్కువ సేపు లేదా సరైనంత సమయం వరకూ శృంగారం జరగాలన్న ఆమె డిమాండ్ పరోక్షంగా భర్తను మానసికంగా తీవ్రమైన ఆందోళనకు గురిచేస్తాయి. దీంతోపాటు సెక్స్ లోపాల వల్ల కాకుండా వ్యక్తిత్వ లోపాల కారణంలో దంపతుల మధ్య తీవ్రమైన విద్వేషాలు, కలతలు, కలహాలు, ఘర్షణ వైరుధ్యాలు కూడా ఏర్పడి శీఘ్రస్ఖలనానికి దారితీస్తాయి.

పైగా మీకు ఆైంగ్జెటీ న్యూరోసిస్ అనే మానసిక సమస్య ఉంది. దీని లక్షణాలు ప్రతి దానికీ కోపం, ఆందోళన, భయాలకు లోనవడం, మానసిక ఒత్తిడికి గురికావడం, ఆత్మవిశ్వాస లోపం, ఆత్మనూన్యతలు. ఈ సమస్య వల్ల లక్ష్యాలు సాధించలేక జీవితంలో వైఫల్యాలను ఎదుర్కొంటారు. దీనివల్ల మళ్ళీ డిప్రెషన్‌కు గురవడం. ఈ వ్యక్తిత్వ లోప ప్రభావం మీ శృంగార జీవితంపైనా పడి శృంగార వైఫల్యానికి దారితీస్తుంది. తీవ్రమైప ఉద్రేక పూరిత మనస్తత్వానికి లోనయ్యే వారు శృంగారంలో అంగస్తంభన కాలాన్ని ఎక్కువ సేపు నిలిపి ఉంచుకోలేక శీఘ్రస్ఖలన సమస్యకు లోనవుతారు. తీవ్రమైన, ఆందోళన వల్ల మెదడు స్ఖలనానికి సంబంధించిన నరాల్ని ముందుగానే ప్రేరేపిస్తుంది.

దీంతో నిర్దేశిత సమయం కంటే ముందే వీర్యం విడుదలై పోయి అంగస్తంభన ముగిసిపోతుంది. కాబట్టి, ముందు మీరు మీ తొలి వైవాహిక జీవితంలోని వైఫల్యాల నుంచి పాఠం నేర్చుకోవాలి. మీ భార్య కేవలం సెక్స్‌లో అసంతృప్తి వల్ల మాత్రమే మిమ్మల్ని తిరస్కరించిందని నేననుకోను. ఎందుకంటే, మీరే చెప్పినట్లు మీ వ్యక్తిత్వంలోని కోపం, ఆవేశం లాంటి ప్రవర్తనల లోపాలవల్ల కూడా ఆమె విసిగిపోయి ఉండవచ్చు. కాబట్టి, రెండవసారి జీవితాన్ని సరిగ్గా ప్లాన్ చేస్కోండి. శీఘ్రస్ఖలనం తగ్గని సమస్యేమీ కాదు. ముందు మీరు మీలోని ఆవేశం, కోపం, ఉద్రేకం లాంటి నెగెటివ్ ప్రవర్తనాంశాల్ని తగ్గించుకోవడానికి కౌన్సెలింగ్ సైకోథెరపీ తీసుకోండి.

దాంపత్య బంధం నిలవడానికి భార్యపై ఆధిపత్యం, పెత్తనం నెరపే భర్తలా కాకుండా స్త్రీని విలువలున్న మనిషిగా, తన హక్కులతోపాటు భార్య హక్కుల్నీ గుర్తించి గౌరవించే మానవీయమైన మనిషిగా తీర్చిదిద్దే ఫీమేల్ ఓరియంటెడ్ కౌన్సెలింగ్ చాలా అవసరం. దంపతుల మధ్య అధికారిక సంబంధం ఎప్పుడూ పరస్పర గౌరవాన్ని, ప్రేమనూ, నమ్మకాన్ని నిలిపి ఉంచవు. దాంపత్య వైరుధ్యాల్ని మిత్రపూరిత ధోరణిలో ఒత్తిడికి లోనవకుండా, ఆవేశం, కోపాలకు గురికాకుండా ప్రశాంతంగా పరిష్కరించుకోవడం ముఖ్యం.

అలాగే, శీఘ్రస్ఖలనాన్ని తగ్గించుకోవడానికి సెక్సాలజిస్ట్‌ను కలవండి. అంగస్తంభన కాలాన్ని పెంచుతూ శీఘ్రస్ఖలనాన్ని తగ్గించే టెక్నిక్స్ చెప్పడమే కాకుండా మీ వ్యక్తిత్వంలో ప్రధాన లోపంగా ఉన్న ఆందోళనా పూరిత మనస్తత్వాన్ని తగ్గించే సైకోథెరపీ కూడా ఇస్తారు. ఎందుకంటే, మానవ లైంగికత, మానవ దృక్పథాన్ని బట్టే లైంగిక సమస్యలు మారుతూ ఉంటాయి. మంచి చికిత్సతో కాబోయే వివాహాన్ని విజయవంతం చేస్కోండి.

No comments:

Post a Comment