Monday, 10 November 2014

69.ఆ భయంతో సెక్స్ అంటేనే విరక్తి పుడుతోంది....


ప్రశ్న :   మా పెళ్లయి 9 నెలలు అవుతోంది. మా వారి ప్రవర్తన చాలా వింతగా ఉంటోంది. ఎప్పుడూ బ్లూ ఫిల్మ్స్ చూస్తారు. పెళ్ళికి ముందే అలవాటు ఉందట. ఈ మధ్య ఆనల్ సెక్స్‌కి ఒప్పుకోమని ఒత్తిడి చేస్తున్నారు. ఒకసారి బలవంతంగా ప్రయత్నం చేస్తే, ప్రాణం పోయేంత నొప్పి అనిపించి రక్తస్రావం కూడా అయింది. 10 రోజులు మందులు వాడితే కానీ కోలుకోలేక పోయాను. ఆ భయంతో సెక్స్ అంటేనే విరక్తి పుడుతోంది. తనకు ఆ పద్ధతే ఇష్టమనీ, పైగా తగ్గింది కదా మళ్ళీ అలానే చేస్తానని వెంటబడి వేధిస్తున్నాడు. వద్దంటే నువ్వే ఉన్నావా అని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఏం చేయమంటారు?

జవాబు :  నువ్వు వెంటనే ఈ విషయాన్ని మీ అత్తకూ, అమ్మకూ చెప్పాలి. నీలో నువ్వే దాచుకుని కుమిలి పోనక్కర లేదు. శంగారం పేరుతో అతను నీ మీద చేస్తున్న హింసను నువ్వు దాచాల్సిన అవసరం లేదు. సెక్స్‌లో ఈ రకమైన అసహజమైన లైంగిక వేధింపులు కూడా గహహింస చట్టంలోకే వస్తాయి. ఈ రకమైన సెక్స్‌కి అస్సలు ఒప్పుకోవద్దు. వేధింపులు మానే వరకూ మామూలు శంగారానికి కూడా ఒప్పుకోవద్దు. కనీసం నీకు చికిత్స ఇచ్చిన గైనకాలజిస్ట్ అయినా నీ భర్తకి కౌన్సెలింగ్ ఇచ్చి ఉంటే బాగుండేది, బాధ్యతగా ఉండేది. ముందు ఆ బ్లూఫిల్మ్స్ అన్నీ తీసి ధ్వంసం చెయ్యి. నెట్ కనెక్షన్ తీసెయ్యి. ఆనల్ సెక్స్ అంటే దొడ్డికెళ్లే గుదమార్గం ద్వారా అంగప్రవేశం చేయడం. ఇది చాలా ప్రమాదకరం. తీవ్రమైన నొప్పి, రక్తస్రావం అవడంతో పాటు అది అలాగే కొనసాగిస్తే ముందే ఆ భాగంలో క్రిములు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇన్‌ఫెక్షన్, చీము, వాపు, నొప్పి, జ్వరం వస్తాయి. మెల్లగా ఆనల్ ఫిషర్- ఫిస్ట్యులా ఏర్పడుతుంది. అప్పటికీ ఆపకుండా అలానే ఆ సెక్స్ కొనసాగిస్తే అది కేన్సర్‌కి దారితీస్తుంది. భార్యాభర్తల మధ్య కాకుండా పెళ్లయిన లేదా ఇతర వ్యక్తుల మధ్య అక్రమ సంబంధాల్లో హోమోసెక్సువల్స్‌లో ఈ రకమైన (ఆనల్) సెక్స్ ద్వారా హెచ్‌ఐవి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆనల్ సెక్స్ ఒక అసహజమైన శంగార ప్రక్రియ. దీన్ని పెళ్ళి-దాంపత్యం పేరుతో భార్య మీద బలవంతంగా ప్రయోగించడం నేరం అవుతుంది. కేసు పెడితే అతనికి శిక్ష పడుతుంది. శంగారం భార్యాభర్తలు ఒకరిపట్ల ఒకరు ప్రేమను వ్యక్తపరచుకునే అందమైన దేహభాష మాత్రమే. విపరీతమైన నొప్పిని, భయాన్ని కలిగించే హింసాత్మక ప్రయోగం కాదు. సెక్స్‌వల్ల దంపతులు ఇరువురూ ఆనందం పొందాలి. భార్యకు నొప్పి, భర్తకు ఆనందం కాదు. సెక్స్ శాడిజంతో కొనసాగించే హింసా ప్రక్రియలను సభ్య సమాజమంతా, ముఖ్యంగా టీనేజర్స్ బహిష్కరించాలి. నీ భర్త శాడిజం, సెక్స్ పర్వర్షన్‌తో బాధపడ్తున్నాడు. అతనికి సైకోథెరపీతోపాటు పాజిటివ్ సెక్సువల్ ఓరియెంటేషన్ చాలా అవసరం. పురుషుడి వికతమైన సెక్స్ వాంఛలు తీర్చుకోవడానికి స్త్రీ ఒక ప్రయోగశాలలోని మూగ జంతువు కాదు. స్త్రీపై గౌరవం లేనివాడు మాత్రమే శంగారంలో ఇటువంటి వికత చేష్టలకు పూనుకొంటాడు. నువ్వు మంచి సెక్సాలజిస్ట్‌ని కలువు. ముందు నువ్వు, నీ భర్త హెచ్‌ఐవి ఇతర ఎస్‌టిడీ పరీక్షలు చేయించుకోండి. అతని ప్రవర్తన మారే దిశగా ఫిజికో సెక్సువల్ థెరపీ ఇప్పించు. మారేంత వరకూ అతనితో శంగారాన్ని ఖచ్చితంగా తిరస్కరించు. భయం, నొప్పి, హింస లేని దాంపత్య జీవితాన్ని అనుభవించడం స్త్రీకి ఉన్న ప్రత్యుత్పత్తి హక్కులలో ప్రధానమైంది.

No comments:

Post a Comment