Wednesday, 5 November 2014

57.నాకు పీరియడ్స్‌లోనే కోర్కెలు ఎక్కువ కలుగుతున్నాయి.. కానీ...!!


ప్రశ్న :  మాది విజయవాడ. నా వయస్సు 34 యేళ్లు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, ఈ మధ్యకాలంలో నాకు బహిష్టు (పీరియడ్స్) కాలంలోనే సెక్స్ కోరికలు ఎక్కువగా ఉంటున్నాయి. కానీ, నా భర్తకు అటువంటి సమయంలో కనీసం నన్ను తాకడానికి కూడా ఇష్టపడటం లేదు. పీరియడ్స్‌లో ఉండగా సంభోగం చేస్తే ఆరోగ్యానికి మంచిది కాదని చెపుతున్నారు. వైద్యశాస్త్రపరంగా ఆయన అభిప్రాయం సరైనదే కావొచ్చు. కానీ, ఆయన తిరస్కార సమాధానం నాకు తీవ్ర నిరాశ కలిగిస్తోంది. దీంతో ఒక్కోసారి స్వయంతృప్తి చర్యలతో ఆనందాన్ని పొందాల్సి వస్తోంది. కొన్ని సందర్భాల్లో పక్కదారిలో (వివాహేతర సంబంధం) వెళ్లి కోర్కెలు తీర్చుకుందామా అనేలా ఆలోచనలు వస్తున్నాయి. ఏం చేయాలి. నా కోర్కెలు ఎలా తీర్చుకోవాలో సలహా ఇవ్వండి.

జవాబు :  సాధారణంగా పీరియడ్స్ సమయంలో సెక్స్ హార్మన్లు చురుగ్గా పని చేస్తాయి. ఆ కారణంగా ఎక్కువ మంది మహిళల్లో కోర్కెలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ మీ విషయంలోనూ అదే జరుగుతోంది. అయితే, మీవారు తిరస్కార సమాధానాన్ని తప్పుపట్టలేం. బహిష్టు సమయంలో సంభోగిస్తే పురుషులకు కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం అధికంగా ఉంది.
 
అయితే, పీరియడ్స్‌లో సెక్స్ చేయకూడదన్న నియమనిబంధనేదీ లేదు. ఇలాంటి సమయంలో దంపతుల మధ్య ఏకాభిప్రాయం ఉంటే.. కండోమ్ ధరించి సెక్స్ చేసుకోవచ్చు. ఈ విషయాన్ని భర్తకు సావధానంగా వివరించి చెప్పి పరిష్కరించుకోవాలేగానీ, తప్పుడు మార్గాన్ని ఎంచుకోవడం ఏమాత్రం మంచిదికాదనే విషయాన్ని గ్రహించండి.

No comments:

Post a Comment