ప్రశ్న : దేవుడి దయ వల్ల నాకు అందమైన భార్య లభించింది. ఐతే ఆమెతో ఎక్కువసేపు దాంపత్య సుఖాన్ని పంచుకోవాలని ఉవ్విళ్లూరుతుంటాను. రోజుకు కనీసం 4 సార్లు సెక్స్ చేయనిదే ఉండలేను. ఇలా చేస్తున్నట్లు నా స్నేహితుడితో చెపితే... మరీ అన్నిసార్లు చేస్తే అంగం బలహీనపడిపోయి భవిష్యత్తులో సెక్స్ చేయలేకుండా అవుతావని అంటున్నాడు. దీనిపై నాకు ఆందోళనగా ఉంది. ఎక్కువసార్లు సెక్స్ చేయడం వల్ల అంగం పనికిరాకుండా పోతుందా...?
జవాబు : మీ స్నేహితుడు చెప్పిన మాట అవాస్తవం.. అది అపోహ. అతిగా సెక్స్‌లో పాల్గొనడం వల్ల లైంగిక అంగం బలహీనపడిపోతుందని కొందరు మగవారు అనుకుంటారు. ఈ భయంతోనే సెక్స్‌కు దూరమవుతారు. నిజానికి ఏ అంగం కూడా వాడనందుకు పాడవుతుందేమో కానీ వాడినందుకు కాదు. కనుక ఎలాంటి భయం అక్కర్లేదు. సెక్స్ చేయగలిగినంత సేపు చేయవచ్చు. శరీరం అలసిపోతే సెక్సుకు దానంతట అదే సహకరించదు. అంతేతప్ప బలహీనమైపోవడం అంటూ ఉండదు.

No comments:
Post a Comment