Monday, 3 November 2014

49.నా వక్షోజాలు చిన్నవిగా ఉన్నాయ్.. సర్జరీ చేయించుకోమని ఒత్తిడి.. ఏం చేయాలి?


ప్రశ్న :  నాకు వివాహమై నెల రోజులే అయింది. నా వక్షోజాలు చిన్నవిగా ఉన్నాయి. వాటిని చూసినప్పటికీ నుంచి నా భర్త.. సర్జరీ చేయించుకుని పెద్దవిగా వచ్చేలా చేయమని ఒత్తిడి చేస్తున్నాడు. ఏం చేయాలో నాకేం తెలియడం లేదు. ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదు. ఏం చేయమంటారు. సలహా ఇవ్వండి.

జవాబు :  చాలా మంది యువతుల్లో పాలిండ్ల విషయంలో కొందరు ఆడవారు చాలా అపోహలకు గురై ఆందోళన చెందుతుంటారు. ఎందుకంటే.. ఇతర మహిళల వక్షోజాలతో పోల్చుకుని తమ వక్షోజాల సైజు చాలా తక్కువగా ఉందనో.. మరీ ఎక్కువగా ఉందనో లేక.. రెండు సైజుల్లో తేడాలు ఉన్నాయనో తెగ బాధపడిపోతుంటారు. అయితే, మీ భర్త చెప్పినట్టుగా ఉన్నట్టుండి పెద్దవి అయ్యేందుకు మార్గం లేదు.
 
అయితే, వక్షోజాలు చిన్నవిగా ఉండటానికి, పెద్దవి అవడానికి కూడా శరీరాకృతులు మార్చుకునే రీతిగానే కొన్ని రకాల ఎక్సర్‌సైజ్‌లు ఉంటాయి. వీటి ద్వారా పాలిండ్ల సైజులను తగ్గించుకోవచ్చు లేదా పెంచుకోవచ్చు. ఒక వక్షోజం మరో వక్షోజంతో పోల్చుకున్నపుడు మరీ చిన్నదిగా ఉన్న సమయంలో మామోప్లాస్టీ ప్లాస్టిక్ సర్జరీ ద్వారా తప్పని సరిపరిస్థితుల్లోనే చేయించుకోవాలని సలహా ఇస్తున్నారు. 

No comments:

Post a Comment