Monday, 3 November 2014

44.ఆఫీసుకెళ్లడు... పొద్దస్తమానం సెక్స్ తో హూనం చేస్తున్నాడు.. అతను ఎడిక్ట్ అయ్యాడా...?


ప్రశ్న :  మాది ధనవంతుల కుటుంబం. ఆఫీసుకు వెళ్లడం ఆయన ఇష్టం. వెళితే వెళతారు లేదంటే లేదు. ఇటీవలే పెళ్లయింది. అప్పట్నుంచి ఆఫీసుకు వెళ్లడం తగ్గించారు. పొద్దస్తమానం సెక్సు చేస్తూ వళ్లు హూనం చేస్తున్నారు. ఇంట్లోవాళ్లు ఏమైనా అనుకుంటారేమోనని నాకు ఇబ్బందిగా ఉంది. ఆఫీసుకెళ్లమంటే, తనకు ఇదంటేనే ఎక్కువ ప్రీతి అని, తనకు ఇష్టమయినప్పుడు వెళతానంటూ చెపుతున్నారు. ఈయనేమైనా సెక్స్ ఎడిక్ట్ గా మారిపోయారేమోనని నాకు అనుమానంగా ఉంది...?

జవాబు :  మీరు అనుకునేది వాస్తవం కాదు. పెళ్లయిన కొత్తలో చాలామంది పురుషులు ఇలాగే ఉంటారు. సెక్స్ సుఖాన్ని పూర్తిస్థాయిలో అనుభవించాలనే తలంపుతో ఇలా ప్రవర్తిస్తుంటారు. కనుక ఈ విషయంలో మీరు అనుకునేది పొరబాటు.

సెక్స్ ఎడిక్ట్... సెక్స్ పిచ్చి... అనేది విపరీతమైన పరిమాణం. ఇలాంటివారు అత్యాచారాలకు పాల్పడుతూ, ఇతర స్త్రీలపై కూడా వ్యామోహం పెంచుకుంటూ ఉంటారు. స్త్రీలపై అఘాయిత్యాలకు పాల్పడేవారుగా ఉంటారు. ఐతే అందరూ ఇలాంటి దారుణాలకు ఒడిగట్టేవారుగా ఉండకపోవచ్చు.
 
కొందరు కొన్ని వస్తువులతో స్వయంతృప్తి పొందుతూ కాలం గడుపుతారు. ఇది కూడా సెక్సువల్ ఎడిక్షన్ కిందకే వస్తుందంటారు. అందువల్ల ఆయనకు ఎలాంటి అనారోగ్య రుగ్మత లేదు. సంతోషంగా దాంపత్య సుఖాన్ని చవిచూడండి. మెల్లగా కొన్ని రోజుల తర్వాత ఆయన తన ఆఫీసు కార్యక్రమాలకు సజావుగా వెళతారు.

No comments:

Post a Comment