Monday, 10 November 2014

73.నా భార్య అడిగినట్లే 3 సార్లు చేయడం ఎలా...?



ప్రశ్న :   నా వయసు 40 సంవత్సరాలు. ఐటీ ఉద్యోగం చేస్తున్నాను. ఈమధ్య ఎందుకో ఎక్కువసార్లు రతిలో పాల్గొనలేకపోతున్నాను. ముఖ్యంగా నా భార్య రోజుకు రెండుమూడుసార్లు కావాలంటోంది. కానీ ఒక్కోసారి ఒక్కసారి కూడా చేయలేకపోతున్నాను. ఐతే సెక్స్ కోర్కెలు ఉంటున్నాయి కానీ చేయడానికి వచ్చేసరికి మనసు దానివైపు పోవడంలేదు. నా భార్య అడిగినట్లే 3 సార్లు చేయడం ఎలా...? మరో సమస్య ఏమిటంటే... ఏదైనా టూర్ కు వెళ్లి వచ్చి సెక్స్ చేస్తే వెంటనే ఔటై పోతోంది...

జవాబు :   ఒక వయసు దాటాక రోజూ రతి జరుపుకోవడం అనేది క్రమంగా తగ్గుతుంది. అలాగే ఇలాంటి వారిలో ఎక్కువసేపు చేస్తేగానీ స్ఖలనం అయ్యే పరిస్థితి ఉండదు. దీనికి కారణం బీజకోశాల్లో వీర్యం ఎక్కువసేపు తయారుకావడమే. మరీ ముఖ్యంగా కొంతమంది పురుషులు నాలుగైదు రోజులు వ్యాపార, ఉద్యోగ నిమిత్తం క్యాంపులకెళుతుంటారు.

ఇటువంటివారు అన్నాళ్లు గ్యాప్ తీసుకుని సెక్స్‌కు ఉపక్రమించగానే నాలుగైదు రోజులుగా తయారై బీజకోశాలలో నిల్వ ఉన్న వీర్యం నాలుగైదు స్ట్రోకులకే స్ఖలనమైపోతుంది. దీంతో చాలామంది పురుషులు ఆ తర్వాత సెక్స్ చేయడానికి ఉపక్రమించరు. ఫలితంగా భాగస్వామిలో అసంతృప్తి నెలకొంటుంది.

నాలుగైదు రోజులపాటు సెక్స్‌కు విరామం ఏర్పడినప్పటికీ, రెండవసారి.. మూడవసారి ఇలా మరో రెండుమూడుసార్లు సెక్స్‌లో పాల్గొనే శక్తి తమలో ఉంటుందన్న సంగతి చాలామంది పురుషులకు తెలియదు. ఈ విషయం తెలియక చాలామంది డీలా పడిపోతారు. ఒక్కసారికే ఔట్ అయిపోతారు. ఈ పరిస్థితిలో భార్య చొరవ తీసుకుని అతడిలో ఉత్సాహాన్ని రేకెత్తిస్తే రెండవసారి ఎక్కువసేపు సెక్స్ చేయగలుగుతారు.

అలాగే రోజుకు రెండుమూడు సార్లు పాల్గొనడం అనేది జీవన విధానంపై కూడా ఆధారపడి ఉంటుంది. పని ఒత్తిడి వల్ల అలసిపోతే అలా సెక్సులో పాల్గొనడం సాధ్యం కాదు. శరీరానికి కావలసినంత విశ్రాంతి ఇచ్చినప్పుడే మీరనుకున్నట్లు సాధ్యపడుతుంది.

No comments:

Post a Comment