ప్రశ్న : నా వయస్సు 52 యేళ్లు. నా భర్త చనిపోయి ఒక రెండేళ్లు అవుతోంది. నాలో కోర్కెలు ఎక్కువ. భర్త ఉన్న సమయంలో ఆయనతో బాగా ఎంజాయ్ చేస్తూ వచ్చాను. ఆ తర్వాత కోర్కెలు చంపుకోలేక స్వయంతృప్తి విధానాన్ని ఎంచుకున్నా. ఇటీవలే నాకు హార్ట్ఎటాక్ వచ్చింది. అయినా నాలోని కోర్కెలు ఏమాత్రం తగ్గలేదు. గుండెజబ్బుతో బాధపడుతున్న నేను స్వయంతృప్తితో ఆనందం పొందవచ్చా? సలహా ఇవ్వరు.
జవాబు : హృద్రోగ రోగులు స్వయంతృప్తి ద్వారా ఆనందం పొందడంలో ఎలాంటి తప్పు లేదు. అయితే, వైద్యుడు సూచన చేసినట్టుగా మందులు క్రమం తప్పకుండా వాడాలి. హార్ట్ఎటాక్‌కు గురైన వారు మెట్లు ఎక్కడ, లేదా కొద్ది దూరంగా నడవడం వంటివి సాధారణంగా చేయగలిగితే మాత్రం స్వయంతృప్తిని ఆశ్రయించవచ్చు. అయితే, భోజనం చేసిన వెంటనే, పొట్ట బిగుతుగా ఉన్న సమయాల్లో మాత్రం దీనికి దూరంగా ఉండటం మంచిది. దీనివల్ల శరీరానికి లేదా గుండెకు ఎలాంటి నష్టం లేదని భావించగలరు.

No comments:
Post a Comment