ప్రశ్న : మేమిద్దరం గత ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. అతడికి ఉద్యోగం రాగానే పెళ్లాడాలని నిర్ణయించుకున్నాం. కానీ గత ఆరేడు నెలలుగా అతడు లావయిపోతున్నాడు. బాడీ తగ్గించుకునేందుకు ప్రయత్నించమంటే వినడంలేదు. నా స్నేహితురాలు ఒకామె... లావుగా ఉన్నవారు సెక్సులో పనికిరారనీ, అలసిపోతారని చెపుతోంది. అంతేకాదు పిల్లలు కూడా కలిగే అవకాశాలు తక్కువగా ఉంటాయని అంటోంది. ఇప్పుడు ఇతడిని పెళ్లాడితే నేను దాంపత్య సుఖాన్ని ఎంజాయ్ చేయలేనేమోనని భయంగా ఉంది...
జవాబు : మితిమీరిన ఒళ్లు సెక్స్ జీవితంపై ప్రభావం చూపే మాట నిజమే. లావుగా ఉన్నవారిలో శృంగార జీవితం ఒకింత నిస్సారంగా మారుతుంది. ఐతే మీ ప్రేమికుడు స్థూలకాయుడుగా ఉన్నాడో లేదో బీఎమ్ఐ ద్వారా చెక్ చేసుకోవచ్చు. స్థూల లేదా భారీకాయం సెక్సు జీవితానికే కాదు అది పలు ఆనారోగ్యాలకు దారి తీస్తుంది. కాబట్టి అతడు క్రమం తప్పకుండా రోజూ వ్యాయామం చేయాలి. ఎత్తుకు తగిన బరువు ఉండేదాకా తప్పక ప్రయత్నం చేయాల్సిందే. వళ్లు పెంచుకుంటే అనారోగ్యాన్ని కొనితెచ్చుకున్నట్లే. ఇక సంతాన ప్రాప్తి అనేది వీర్య కణాల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది కానీ, భారీకాయంపై కాదు.

No comments:
Post a Comment