Monday, 10 November 2014

68.మళ్ళీ సెక్స్ చేద్దామనుకుంటే నాలో ఉత్సాహం కలగడం లేదు....


ప్రశ్న :   నా వయస్సు 46 సంవత్సరాలు. నా భార్యకు 40 ఏళ్లు. మా ఇద్దరికి ఎలాంటి వ్యాధులూ లేవు. నేను ప్రతి 15 రోజులకు ఒకసారి నా భార్యతో సెక్స్‌తో పాల్గొంటాను. కానీ, 5 నిమిషాలకే వీర్యం బయటకు వచ్చేస్తోంది. మళ్ళీ సెక్స్ చేద్దామనుకుంటే నాలో ఉత్సాహం కలగడం లేదు. తప్తిగా అనుభూతి పొందలేకపోతున్నాను. కనుక, నా వీర్యం త్వరగా బయటికి రాకుండా, మరింత ఉత్సాహవంతంగా సెక్స్ చేయడానికి పరిష్కార మార్గం తెలపండి?


జవాబు :   మీరు సెక్స్ జీవితంలో ఎక్కువ గ్యాప్ ఇస్తున్నారు. మీ 46 సంవత్సరాల వయస్సుకి శంగారంలో కనీసం వారానికి 2 సార్లయినా పాల్గొనాలి. చాలా రోజుల తర్వాత పాల్గొంటే అది శీఘ్రస్ఖలనానికి దారితీస్తుంది. శీఘ్రస్ఖలనానికి ప్రోస్టేట్ వ్యాధి-మూత్రనాళ ఇన్‌ఫెక్షన్స్‌తోపాటు తీవ్రమైన ఫర్‌ఫార్మెన్స్ యాంైగ్జెటీ కూడా ఒక కారణం. వీటితో పాటుగా స్ఖలనాన్ని ఆపుకుంటూ అంగ స్తంభనను కొనసాగించే సెక్స్ కండరాలపై నియంత్రణ లేకపోవడం వల్ల కూడా మీకు ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. శీఘ్రస్ఖలనాన్ని నియంత్రించకపోతే అది ఏ వయస్సులోనైనా అంగస్తంభన సమస్యను కల్గిస్తుంది. శీఘ్రస్ఖలనం అంటేనే అంగస్తంభన కాలం తగ్గిపోవడం. అది క్షణాలైనా, నిమిషాలైనా కావచ్చు. మీకు అంగస్తంభన సమస్య ఉందో లేదో తెలుపలేదు. అలాగే చక్కెర వ్యాధి, బీ.పీ., గుండె సంబంధ వ్యాధులు, నాడీ సంబంధ సమస్యలున్నాయో కూడా రాయలేదు. ఏది ఏమైనప్పటికీ మీరొకసారి సెక్సాలజిస్ట్‌ని కలవండి.

మీ సమస్య మూల కారణానికి చికిత్సతో పాటు అంగస్తంభన కాలాన్ని పెంచి, శీఘ్రస్ఖలనాన్ని తగ్గించే ఇ.వి.టి., ఐ.వి.టి., ఎస్.ఎస్., టెక్నిక్స్ మెరైటిల్ థెరపీలో భాగంగా చెప్తారు. అలాగే, శీఘ్రస్ఖలనాన్ని నియంత్రించడానికి ఫర్మార్మెన్స్ యాంైగ్జెటీ తగ్గించే దిశగా సెక్స్ సైకాలజీ, నార్మల్ సెక్స్ రెస్పాన్స్ చక్రం వివరాలు చెప్పడంతో పాటుగా సైకోథెరపీ కూడా ఇస్తారు. సెక్స్ ఆరోగ్యాన్ని మెరుగు పరిచే ఆహార నియమాలు కూడా చెప్తారు.

No comments:

Post a Comment