Wednesday, 5 November 2014

55.బ్లూ ఫిల్మ్స్ చూస్తేనే అతనికి మూడ్ వస్తోంది!




ప్రశ్న :  మాకు పెళ్ళయి 2 సంవత్సరాలు అవుతోంది. మా వారు ఒక వింత సమస్యలో ఉన్నారు. బ్లూ ఫిల్మ్స్ చూస్తే గానీ ఆయనకు మూడ్ రాదంటారు. రోజూ అవి చూశాకే సెక్స్ చేస్తారు. నన్నూ చూడమంటారు. నాకు అసహ్యంగా, అవమానంగా అన్పిస్తుంది. బ్లూఫిల్మ్‌లలో స్త్రీలను నగ్నంగా చూస్తేగానీ ఆయనకు ఉద్రేకం కలగదు. తన లైంగిక వికారానికి నా దేహాన్ని వాడుకోవడం అవమానంగా, చీదరగా ఉంది. ఒక డాక్టర్ని ఈ సమస్య గురించి అడిగితే చాలా తేలిగ్గా తీసి పడేసి నీ భర్తే కాదు, అందరు మొగాళ్ళు చూస్తారు. దాంట్లో బాధపడాల్సిందేముంది అన్నాడు. పెళ్ళయినప్పటి నుంచి సహజ ఉద్రేకాలతో శృంగారంలో పాల్గొన్నది లేదు. బెడ్‌రూం అంతా బూతు వీడియోలే. ఆ గది అంటేనే అసహ్యంగా ఉంది. మా వారు మారేదెలా?


జవాబు :  బ్లూఫిల్మ్స్, పోర్న్ సైట్స్ ఒక వ్యసనంలా తయారయ్యాయి. చాలామంది మగవాళ్ళకు యవ్వనకాలంలో చూడటం మొదలై అదొక వ్యసనంలా మారుతుంది. 60, 70 సంవత్సరాల నుండి సెక్స్ కోరికలు, అంగస్తంభనలు తగ్గిన వాళ్ళకు, మానసిక అంగస్తంభన లోపం ఉన్నవాళ్ళకు డాక్టర్స్ దృశ్య శృంగార ప్రేరకంగా బ్లూఫిల్మ్స్ చూడమంటారు. మంచి వయసులో ఉన్న మీ ఆయన వాటికి బానిసగా మారాడనిపిస్తుంది. బ్లూఫిల్మ్స్ లేకుండా అంగస్తంభన జరగడం లేదంటే ఇదొక మనో లైంగిక సమస్యగా మారిందని అర్థం చేసుకోవాలి. నిజంగా చాలా బాధపడ్తున్నావు. నువు కలిసిన డాక్టరు నీ బాధను అర్థం చేస్కోలేదు. పైగా అది చాలా సాధారణ విషయమైనట్లు కొట్టి పడేశాడు. భర్తకి భార్యే గొప్ప శృంగారోత్తేజాన్ని కలిగించేదిగా ఉండాలి. అలాంటిది అతనికి నీ స్పర్శలో స్పందనే లేదంటే అతనికి ఖచ్చితంగా మనో లైంగిక చికిత్స అవసరం. ఇక నువ్వు ఈ బాధని, అవమానాన్ని, తన అసహ్యకరమైన అలవాటుని భరించాల్సిన అవసరం లేదు. నీ బెడ్ రూంలోని బ్లూఫిల్మ్స్ తగలబెట్టు. సహజ శృంగారానికి మాత్రమే ఒప్పుకుంటానని చెప్పు. ఈ విషయం మీ అత్తగారితో చర్చించు. అతనికి కౌన్సెలింగ్, సైకోథెరపీ, సెక్స్ థెరపీ చాలా అవసరం. అతన్ని తీసుకొని సెక్సాలజిస్ట్ దగ్గరికి వెళ్ళు.

No comments:

Post a Comment