ప్రశ్న : నా వయస్సు 25 సంవత్సరాలు. మీరే నా ఈ సమస్య నుండి నన్ను గట్టెక్కించాలి. నా అంగం చాలా సన్నగా వున్నందున నేను మానసికంగా చాలా బాధపడుతున్నాను. నాకు అంగస్తంభన బాగానే జరుగుతుంది. అప్పుడు పొడవు బాగానే ఉంటుంది. కానీ, లావు మాత్రం కావడం లేదు. ఈ సమస్య చాలారోజుల నుండి ఉంది. నేనొక అమ్మాయిని ప్రేమించాను. పెళ్ళికూడా చేసుకోబోతున్నానని తనతో శారీరకంగా కలిశాను. అప్పుడు తను కూడా డైరెక్ట్‌గా చెప్పేసింది నీ అంగం చాలా సన్నగా వుందని. నాకు ఎలాంటి ఒత్తిడి లేదు. శారీరకంగా చాలా ఫిట్‌గా వుంటాను. తనతో మూడుసార్లు కలిశా. మూడుసార్లూ అలాగే చెప్పింది. ఇప్పుడు తను నాతో దూరంగా ఉంటోంది. అలా కాదేమో అని మా ఫ్రెండ్‌తో కూడా పోల్చి చూసుకున్నా. వారు కూడా చాలా సన్నగా ఉందని హేళన చేశారు. నిజమే, వారందరి కంటే నాదే సన్నగా ఉంది. మేడం.. దయచేసి మీరే నాకు శాశ్వత పరిష్కారం చూపగలరు. ఇంట్లో పెళ్లి చేస్తామంటున్నారు. నా అంగం పెద్దగా అవడానికి ఏమైనా మందులు, పరిష్కార మార్గాలు ఉంటే చెప్పండి. :
జవాబు : నువ్వు నీ స్నేహితురాలితో పెళ్ళికి ముందే సెక్సులో పాల్గొనడం తప్పు. నీ స్నేహితులతో నిన్ను నువ్వు పోల్చుకోవడం, తక్కువ అంచనా వేస్కోవడం వెంటనే మానెయ్యి. ఆందోళన, భయం, నెగెటివ్ ఆలోచనలు, లైంగిక అవయవాల సైజు పట్ల, హస్తప్రయోగం పట్ల అశాస్త్రీయమైన అవగాహన ఇవన్నీ కలిసి నిజంగానే అంగం సైజు చిన్నగా, సన్నగా ఉన్నట్లుగా భ్రమింపచేస్తున్నాయి. నీలో శంగారపరమైన కోరికలుండటం, ఉద్దీపన, అంగస్తంభన పరిపూర్ణంగా కలగడం, చక్కగా శంగారం చేయగలగడం లాంటి లక్షణాలు నువు వైవాహిక జీవితానికి, నీ భార్యను సంతప్తి పరచడానికి పూర్తిస్థాయి అర్హుడివన్న వాస్తవాన్ని సూచిస్తాయి. అంగం పరిమాణం ముఖ్యం కాదు. భార్యను అంగప్రవేశం ముందు ఎఫ్‌పీటీ ద్వారా భావప్రాప్తి పొందేలా చేయడంలోనే శంగారంలో భర్త సమర్థత నిర్ణయమవుతుంది. నీ స్నేహితులతో సహా నీ గర్ల్‌ఫ్రెండ్‌కి కూడా స్త్రీ, పురుష ప్రత్యుత్పత్తి అవయవాల పట్ల శాస్త్రీయమైన అవగాహన లేదు. నువ్వు ముందు వీళ్ళందరితో నీ లైంగిక అవయవ పరిమాణం గురించిన అనవసర చర్చలు మానేసి, సెక్సాలసిజ్ట్ వద్ద సరైన కౌన్సెలింగ్ తీసుకో.

No comments:
Post a Comment