Monday, 3 November 2014

50.వయస్సు 19.. వక్ష సంపద నిండుగా ఉన్నా... రజస్వల కాలేదు ఎందుకని!


ప్రశ్న :  నాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిలో రెండో అమ్మాయికి వయస్సు 19 యేళ్లు. కానీ ఇంకా రజస్వల కాలేదు. అయితే, ఒక ఆడపిల్లలోని అందాలన్నీ విరబూసినా... రజస్వల మాత్రం కాలేదు. వక్షోజాలు కూడా బాగానే పెరిగాయి. వైద్యుల వద్దకు తీసుకెళ్లినా... ఏవేవో మందులు రాసిస్తున్నారే గానీ వాటి వల్ల ప్రయోజనం కలగడం లేదు. ఎందుకని.?

జవాబు :  సాధారణంగా ఇలాంటి సమస్య అనేక మంది యువతుల్లో ఉంటుంది. కొందరు యువతులు రజస్వల కాకుండానే పిల్లలకు తల్లులు కూడా అవుతుంటారు. ఇలాంటి యువతుల్లో యుక్తవయస్సులో ఉండే ఆడపిల్లల్లోని అందాలన్నీ విరబూసినా.. బహిష్టులు లేకుండా కాలం వెళ్లదీస్తుంటారు. ఇలా ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయని నిపుణులైన గైనకాలజిస్టులు చెపుతున్నారు.

అలాంటి యువతుల్లో హార్మోన్ల ఉత్పత్తి తక్కువగా ఉండటంతో పాటు.. గర్భాశయం పెరుగుదల సరిగా లేక పోవడం ప్రధాన కారణంగా చెపుతున్నారు. అంతేకాకుండా పుట్టుకతోనే క్రోమోజోమ్స్‌‌లలో అస్తవ్యస్తత ఏర్పడుతుంది. దీంతో యుక్త వయస్సు పైబడి పోతున్నా రజస్వలకాని స్త్రీలు అనేక మంది ఉంటారు.

ముఖ్యంగా టర్నర్స్‌ సిండ్రోమ్‌ వల్లే రజస్వల కాకపోవడం ఉంటుందని చెపుతున్నారు. వీరిలో అండాశయాలు ఎదగవు. హార్మోన్లని ఉత్పత్తి చేయవు. పైపెచ్చు.. మరికొందరికి థైరాయిడ్ సమస్య ఉంటుంది. ఈ సమస్యతో బాధపడే యువతులు కూడా రజస్వలకు దూరంగా ఉంటారని చెపుతున్నారు.
 
అలాగే, పోషకాహార లోపం ఉన్నవారు కూడా కావలసిన వయస్సులో రజస్వల కారని చెపుతున్నారు. అలాగే చిన్నప్పుడే మధుమేహం వచ్చి తీవ్రంగా ఉన్నప్పుడు కూడా రజస్వల కాదని వైద్యులు చెపుతున్నారు మొత్తం మీద యుక్త వయస్సు యువతుల్లో ఉండే సమస్యలే రజస్వల సమస్యకు ప్రధాన కారణాలని వైద్యులు అంటున్నారు

No comments:

Post a Comment