Thursday, 6 November 2014

60.కండోమ్ లేకుండా సెక్స్ చేయమంటే వినట్లేదు... ఏం చేయాలి...?


ప్రశ్న :  ఇటీవలే పెళ్లయింది. కనీసం రెండేళ్ల వరకూ పిల్లలు వద్దని అనుకున్నాం. అందుకుగాను ఆయన్ని సెక్స్ చేసేటపుడు కండోమ్ ధరించి చేయమని చెపుతుంటే వినట్లేదు. పురుషాంగాన్ని పట్టుకుని నేను కండోమ్ తొడిగినా కొద్దిసేపటికే దాన్ని పీకి పక్కన పడేసి డైరెక్టుగా చేస్తున్నాడు. వీర్య స్ఖలనం కాగానే యోనిని వెంటనే శుభ్రపరుస్తున్నప్పటికీ గర్భం వస్తుందన్న భయం వెంటాడుతోంది. అతడిని ఎలా ఒప్పించాలో అర్థంకావడంలేదు...

జవాబు :  కండోమ్ ధరించి చేయకపోవడానికి పలు కారణాలుంటాయి. అందులో మొదటిది సెక్స్ సుఖాన్ని పూర్తిగా అనుభవించలేకపోతున్నానని కండోమ్ ధరించిన పురుషుడు మదిలో భావన ఉంటుంది. అలాగే కొందరిలో పురుషాంగా చిన్నదిగా ఉండటం వల్ల కూడా కండోమ్ కారణంగా అంగ స్తంభనలో తేడా ఉంటుంది. మరికొందరిలో కండోమ్ ధరించడం వల్ల తమకు ఎలాంటి ఫీలింగ్ కలుగడంలేదు, అందువల్ల అది లేకుండా చేయాలని చూస్తుంటారు. ఇలా కండోమ్ ధరించకపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి.
 
ఇకపోతే వీర్యస్ఖలనం అయిన వెంటనే యోనిని శుభ్రంగా కడుక్కున్నప్పటికీ యోనిలో వీర్యం స్ఖలించిన తర్వాత గర్భధారణకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక్క వీర్యకణం గర్భాషయం లోపలికెళ్లినా ప్రెగ్నెన్సీ రావడం ఖాయం. అందువల్ల ఆయనకు ఉన్న ఇబ్బందులేమిటో కనుక్కుని చర్చించి, మీ భయాలను ఆయనకు చెప్పి ఒప్పించే ప్రయత్నం చేయండి.

No comments:

Post a Comment