ప్రశ్న : మా ఇంటికి ఎదురుగా ఓ అందమైన ఆంటీ ఉంది. ఆమెను చూస్తే నాకు చెప్పలేనంత సెక్స్ వాంఛలు కలుగుతాయి. ఐతే ఆమె ఇటువైపు చూస్తుందంటేనే నాకు వణుకుపుడుతుంది. అంత స్ట్రిక్టుగా ఉంటుంది. ఐతే నిద్రలో ఆమెతో సెక్స్ చేస్తున్నట్లు కలలు కంటుంటాను. ఆ సమయంలో ఒక్కోసారి వీర్య స్ఖలనమయిపోతుంది. ఇదే విషయాన్ని నా స్నేహితుడితో చెబితే... వీక్ అయిపోతావని అంటున్నాడు. అప్పట్నుంచి నాకు భయం పట్టుకుంది. ఆంటీ కలలోకి రాకుండా చేయాలంటే వల్లకావడంలేదు. ఇలా అయితే నా ఆరోగ్యం ఏమయిపోతుందోనని భయంగా ఉంది. ఏంటి మార్గం...?
జవాబు : చాలామంది స్త్రీ, పురుషుల్లో ఇలాంటి ఫాంటసీ సెక్స్ సహజంగా కనిపిస్తుంది. తమకు ఇష్టమైనవారితో సెక్స్‌లో పాల్గొన్నట్లు... అంటే స్త్రీ అయితే పురుషుడితో... పురుషుడైతే స్త్రీతో శృంగారంలో పాల్గొన్నట్లు ఊహించుకోవడం వల్ల వీర్య స్ఖలనమైపోతుంది. చెప్పలేని అనుభూతికి లోనవుతారు.
ఇదేమీ వ్యాధి కాదు. శరీరంలో ఇతర గ్రంథులు ఏవిధంగా ద్రవాలను ఉత్పత్తి చేస్తాయో, వీర్య గ్రంథులు కూడా అలానే ఉత్పత్తి చేస్తాయి. ఎన్నిసార్లు ఫాంటీసీల్లోకి వెళ్లి సెక్స్ చేసి వీర్యం స్ఖలించినా ప్రమాదం లేదు. మళ్లీ వీర్యం ఉత్పత్తి అవుతూనే ఉంటుంది.
ఇలా ఉత్పత్తి అయ్యే వీర్యం, హస్త ప్రయోగం వల్లనో, ఫాంటిసీల వల్లనో ఏదో విధంగా బయటకు వచ్చేస్తుంది. అలా రావడం వల్ల కలిగే నష్టం ఏమీ లేదు. అది అనారోగ్యమూ కాదు. యుక్త వయసులో పాంటసీలు, హస్త ప్రయోగాలు వంటివి సహజమే. ఫాంటసీ సెక్స్‌లో వీర్యం పోవడం వల్ల నీరసించిపోతారనే అపోహలోనూ నిజం లేదు. ఐతే చదువుకునే వయస్సులో ఇటువంటి వాటివైపు ధ్యాస మళ్లకుండా చదువుపై దృష్టి పెట్టాలి.

No comments:
Post a Comment