Monday, 10 November 2014

71.పిల్లలు లేకపోవడానికి భావప్రాప్తి కలగకపోవడమే కారణమా?



ప్రశ్న :   నాకు ప్ళ్ళై మూడు సంవత్సరాలు అవుతోంది. ఇప్పటిదాకా శంగారంలో ఆనందం, భావప్రాప్తి కలగలేదు. మా వారికి మాత్రం ఆనందం కలుగుతోంది. పిల్లలు లేకపోవడానికి భావప్రాప్తి కలగకపోవడమే కారణమా? సెక్స్ అంటే అనాసక్తిగా ఉంది. ఏం చేయమంటారు? :


జవాబు :   భావప్రాప్తి పొందక పోవడానికి పిల్లలు పుట్టకపోవడానికి ఏ మాత్రం సంబంధం లేదు. కాకపోతే, భావప్రాప్తి పొందగలిగే స్త్రీలు భర్తతో తరచూ శంగారంలో పాల్గొనడానికి ఆసక్తి చూపడం వల్ల పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భావప్రాప్తి పొందని స్త్రీలు తరచూ భర్త ఆనందం కోసం పాల్గొన్నా పిల్లలు పుడతారు. ఏది ఏమైనా ఈ స్థితికి దంపతులు ఇరువురూ కారణమే! ముందు నువ్వు సెక్స్‌పట్ల నీకున్న నెగెటివ్ భావజాలాన్ని పోగొట్టుకొని ఆసక్తిని పెంచుకోవాలి. అలాగే, నీ భర్త నీకు సెక్స్‌లో భావప్రాప్తి కలిగించే బాధ్యతను తీసుకోవాలి. శంగారంలో దంపతులిద్దరూ ఆనందించాలి. భార్యకి సెక్స్‌లో ఆనందాల్ని కలిగించలేని భర్తపై భార్యకు అనాసక్తి ఏర్పడుతుంది. దీనివల్ల ఆమె సెక్స్‌లో అతికొద్ది సార్లు మాత్రమే పాల్గొంటుంది. ఈ తిరస్కారం భర్తలో శీఘ్రస్ఖలనం, అంగస్తంభన సమస్యలకు దారితీస్తుంది. ఇది పూర్తిగా భర్త వైఫల్యం, బాధ్యతా రాహిత్యం.

దంపతులిద్దరూ సెక్సాలజిస్ట్‌ని కలవండి. కౌన్సెలింగ్, సెక్స్ మెరైటెల్ థెరపీతో మీ సమస్య దూరమవుతుంది. అలాగే, పిల్లలు పుట్టకపోవడానికి కారణాలను తెలుసుకోవాలి. మీరు స్కానింగ్ చేయించుకోవడంతో పాటు మీ భర్త వీర్యపరీక్ష చేస్కోవడం, అండం విడుదలయ్యే సమయంలో దంపతులిద్దరు కలవడం ముఖ్యం.

No comments:

Post a Comment