ప్రశ్న : మాది కర్నూలు. యేడాది క్రితం డిగ్రీ పూర్తి చేశా. మరో నెలలో వివాహం చేసుకోబోతున్నా. ఇప్పటి వరకు సెక్స్ అనుభవం లేదు. పెళ్లి చేసుకున్న తర్వాత నా భర్తతో సెక్స్‌ను ఎంజాయ్ చేయాలంటే పడక గదిలో ఎలా నడుచుకోవాలి. భర్తతో ఎలా ప్రవర్తించాలి. నేను ఎలా సహకరించాలి. సలహా ఇవ్వండి ?
జవాబు : సాధారణంగా అనేక మంది యువతీ యువకులు వివాహం చేసుకున్న తర్వాత దాంపత్య జీవితాన్ని తూతూ మంత్రంగా గడిపేస్తుంటారు. ఏదో అవసరానికి అనే విధంగా దంపతులిద్దరూ "ఆ" కార్యం ముగించేస్తుంటారు. పైపెచ్చు.. ఈ విషయంలో భార్యాభర్తలిద్దరూ కూడా ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకోరు. బయటపడితే.. ఏమవుతుందోనన్న భయం వారిని వెంటాడుతుంటుంది. కానీ.. సెక్స్‌లో ఎంజాయ్ చేయాలని ఉంటుంది.
నిజానికి... సెక్స్ పట్ల భార్యాభర్తల మధ్య భిన్నాభిప్రాయాలు ఉంటాయి. కొంతమంది సెక్స్‌ను ఒక శారీరక అంశంగా మాత్రమే పరిగణిస్తుంటారు. ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నవారు సెక్స్‌లో అనుభూతిని పొందలేకపోతున్నారు. ఇటువంటివారు మానసికంగా సెక్స్ అనేది జీవితంలో ఓ భాగమని, దీన్ని సంతృప్తిగా ఎంజాయ్ చేయాలన్న భావనకు రావాలంటున్నారు.
అంతేకాకుండా... సెక్స్ పుస్తకాలు చదవడం, సెక్స్ పరమైన విషయాలు చర్చించడం ద్వారా సెక్స్‌ను ఎంజాయ్ చేయవచ్చని చెపుతున్నారు. అలాగే భార్యాభర్తలిద్దరూ.. ఏకాంత సమయంలో భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు బాహ్య జననంగాలను ప్రేరేపించుకోవడం ద్వారా సెక్స్‌లో ఉత్తేజాన్ని పొందవచ్చని సెక్స్ నిపుణలు సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా.. పడక గదిలో భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు సహకరించుకుంటూ ముందుకు సాగితే దాంపత్య జీవితాన్ని పరిపూర్ణంగా ఎంజాయ్ చేయవచ్చని సెక్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

No comments:
Post a Comment