ప్రశ్న : మాది హైదరాబాద్. ఇటీవలే వివాహం చేసుకున్నాం. నా భార్య విద్యావంతురాలు కాదు. పైపెచ్చు.. పక్కా పల్లెటూరి అమ్మాయి. శోభనం రోజున సెక్స్‌లో పాల్గొనేందుకు ఎంతగానో ప్రయత్నించా. ఆమె సహకరించక పోవడంతో వీలుపడలేదు. మరుసటి రోజు కూడా అది విధంగా జరిగింది. మూడో రోజు బలవంతం చేయబోతే.. ఏడ్చేసింది. ఏంటని ప్రశ్నిస్తే.. సెక్స్ అంటే మహా భయమని చెప్పింది. దీంతో నేను కూడా మిన్నకుండి పోయా. ఏం చేయాలి. సలహా ఇవ్వండి ?
జవాబు : చాలా మంది యువతులు తొలి కలయిక పట్ల ఇలానే భయపడుతుంటారు. దీన్నే ఫ్రిజిడిటీ అని అంటారు. ఫ్రిజిడిటీ అంటే మనోలైంగిక సమస్య. దీనికి కారణం సెక్స్ అంటే భయం, అసహ్యం. అదేదో పాడుకార్యమన్న భావనలో వారు ఉంటారన్నారు. అంతేకాకుండా, మనసులో భయం వల్ల శరీరం సహకరించదేమో... రక్తస్రావం జరుగుతుందేమో... నొప్పి కలుగుతుందేమో అన్న భయంతో ఉంటారన్నారు.
ఇలాంటి భయాందోళనలు ఉన్నపుడు యోని కండరాలు పూర్తిగా బిగుసుకు పోయి యోని రంధ్రం మూసుకుపోయి అంగప్రవేశం జరగదని చెపుతున్నారు. ఈ స్థితిని వ్జైనిస్మస్ అని వైద్య పరిభాషలో అంటారని చెప్పారు. ఇలాంటి వాటికి సెక్సువల్ కౌన్సెలింగ్, మెరైటల్, సెక్స్ థెరపీ, భయం పోగొట్టే సైకోథెరపీ వంటివి చేయిస్తే సరిపోతుందని సలహా ఇస్తున్నారు. ఇలాంటి సమస్యతోనే మీ భార్య కూడా ఉన్నారు. అందువల్ల కౌన్సెలింగ్ ఇప్పిస్తే అన్ని సర్దుకుంటాయి.

No comments:
Post a Comment