ప్రశ్న : నాకు వివాహమై రెండేళ్లు అయింది. పడక గదిలో నగ్నంగా మారి దాంపత్య సుఖాన్ని అనుభవించాలన్న కోర్కె బలంగా ఉంది. దీంతో ఆరంభంలో నేను చొరవ చూపకుండా ఆయన ఇష్టప్రకారమే సెక్స్ చేస్తూ వచ్చాను. దీంతో నాకు అసంతృప్తి, ఆయనకు సంతృప్తి మిగిలేది. ఇక తట్టులేక ఓ రోజున నేనే దుస్తులన్నీ విప్పేందుకు ప్రయత్నించాను. అందుకు ఆయన ససేమిరా అన్నారు. చివరకు అండర్‌వేర్ కూడా విప్పనని తెగేసి చెప్పాడు. పడక గదిలో మనమిద్దరమే కదా ఉండే.. బట్టలు విప్పేందుకు సిగ్గెందుకు అని ప్రశ్నించినప్పటికీ.. ఆయన నుంచి సమాధానం లేదు. ఆయనను ఒప్పించి.. నా కోర్కె తీర్చుకునేదెలా? సలహా ఇవ్వండి.
జవాబు : కొందరికి తమ శరీర రూపం మీద అపనమ్మకం ఉంటుంది. బాగా సన్నగా ఉన్నవారు, పొట్ట బాగా ఉన్నవారు తమ రూపం అవతలివారికి కనిపిస్తే నవ్వుతారనే భయంతో డ్రెస్ తీసి కనిపించరు. అటువంటివారి విషయంలో రూపం కన్నా మనసు గొప్పదనీ, ఆ మనసును చూసే తనను ఇష్టపడుతున్నానని మనసులో తిష్టవేసుకుని ఉన్న అనుమానాలను తొలగించాలి.
డ్రెస్‌తో ఉండే సెక్స్‌లో పాల్గొనడం ఇబ్బందన్న విషయాన్ని విడమరిచి చెప్పగలగాలి. అయితే అంతవరకూ ఎంతో ఓర్పుగా వ్యవహరించాలి. ఏమైనా ఇటువంటివారి పట్ల మొండివైఖరి పనికిరాదు. ఒత్తిడి చేస్తే మరింత బిగుసుకుపోయి అసలు సెక్స్ చేయకుండా తప్పించుక తిరిగే పరిస్థితికి వచ్చే ప్రమాదం ఉంటుంది. కనుక మెల్లగా దారిలోకి తెచ్చుకునేంతవరకూ కాస్త ఓపిక పట్టాలి.

No comments:
Post a Comment