ప్రశ్న : నేను కేరళలో ఓ ఐటీ కంపెనీలో పని చేస్తున్నా. ఆర్నెల్ల క్రితం మా పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నా. నా భర్త ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. అయితే, నా భర్త చూసేందుకు స్మార్ట్‌గా దృఢకాయుడిగా ఉన్నప్పటికీ.. పడక గదిలో నన్ను సంతృప్తి పరచలేక పోతున్నాడు. దీంతో ఆయనతో కలిసినపుడు సుఖప్రాప్తి పొందలేక పోతున్నా. అయితే, నాకు పెళ్లికి ముందే ఆఫీసులోని ఓ కొలీగ్‌తో సంబంధం ఉండేది. మేమిద్దరం అనేకసార్లు సెక్స్‌లో పాల్గొన్నాం. ఆ సమయంలో ఎంతో హాయిగా ఎంజాయ్ చేస్తూ సుఖప్రాప్తిని పొందేదాన్ని. ఇపుడు కూడా అతనితోనే కనీసం వారంలో ఒక్కరోజైనా గడపాలని అనిపిస్తోంది. ఏం చేయాలి. సలహా ఇవ్వండి.?
జవాబు : ఈ దాంపత్య జీవితంలో భార్య నుంచి భర్త, భర్త ద్వారా భార్య సుఖప్రాప్తి పొందలేని వారు అనేక మంది ఉంటారు. ఈ కారణంగానే పెళ్లికి ముందు సెక్స్ సంబంధాలు ఉన్న వ్యక్తులతో తిరిగి సంబంధం పెట్టుకోవాలని ఉవ్విళ్లూరుతుంటారు. ఇలాంటి సంబంధం పెట్టుకునేందుకు ప్రేమికురాలు కూడా ఆసక్తి చూపుతుంటారు. అయితే, వివాహమైన తర్వాత ఇలాంటి సంబంధాలు పెట్టుకోవడం ఇద్దరికీ ఏమాత్రం మంచిది కాదు.
సాధారణంగా పెళ్లికి ముందే మరో అబ్బాయితో శారీరక సంబంధం పెట్టుకోవడం చాలా తప్పు. పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్న తర్వాత భర్త ద్వారా దాంపత్య సుఖం పొందలేక పోతున్నాననే కారణంతో పాత బాయ్‌ఫ్రెండ్ కోసం పరితపించడం నేరం. అంతేకానీ, భర్త నుంచి సెక్స్ సంతృప్తి లభించలేదని చెపుతూ మాజీ ప్రియుడితో సెక్స్ సంబంధం కోసం ఆశపడటం భావ్యం కాదు.
పడక గదిలో దాంపత్య సుఖం పొందలేక పోతుంటే.. భర్తతోనే మనస్సువిప్పి మాట్లాడుకోవాలి. మీరు కోరుకున్నట్టుగానే మీ భర్తతో గడిపేందుకు ప్రయత్నించండి. మనస్సులోని కోర్కెలను వివరించి, దాంపత్య జీవితాన్ని అతని ద్వారానే అనుభవించేందుకు ప్రయత్నించడం. ఫలితం ఉంటుంది. అంతేకానీ, వివాహం తర్వాత పరాయి పురుషునితో సెక్స్ సంబంధం పెట్టుకోవడం భావ్యం కాదు.

No comments:
Post a Comment