Saturday, 2 August 2014

31.నా భార్య హగ్ చేసుకోగానే వీర్యం ఔటై పోయింది... ఎందుకని?


ప్రశ్న :  ఇటీవలే వివాహం చేసుకున్నా. నా భార్య చాలా అందంగా ఉంటుంది. శోభనం రోజు నుంచి నాకో సమస్య వచ్చింది. శోభనం రోజున పడక గదిలో నా భార్యను హగ్ చేసుకున్నా. ఆ తర్వాత ఆమె కూడా నన్ను కౌగలించుకుంది. ఇంతలో ఏమైందో ఏమోగానీ.. నాకు మాత్రం వీర్యం ఔటై పోయింది. ఎందుకు అలా జరిగిందో తెలియట్లేదు. కారణమేంటి.?

జవాబు :  సాధారణంగా తొలిసారి సెక్స్‌లో పాల్గొన్నా... పెళ్లికి ముందు ఆదుర్దాగా... భయంతో ఎవరైనా చూస్తారేమో అన్న ఆందోళనతో స్ట్రెస్‌ లేక టెన్షన్‌తో శృంగారంలో పాల్గొనే ప్రయత్నం చేసినపుడు రక్తప్రసరణలోపం ఏర్పడి అంగస్తంభనం జరగదని, ఒకవేళ జరిగినా వీర్యం వెంటనే పడిపోతుందని చెపుతున్నారు.
 
శృంగారంలో పాల్గొనేటపుడు ఎలాంటి ఒత్తిడి, డిప్రెషన్‌ లేకుండా ఉండేలా చూసుకోవాలని సలహా ఇస్తున్నారు. ఇదే కౌగలింతకు కూడా వర్తిస్తుంది. అలాగే సెక్సులో పాల్గొనాలన్న ఉత్సాహం కట్టలు తెంచుకున్నప్పుడు కూడా ఇలాగే వీర్యస్ఖలనమయిపోతుంది. ఇక్కడ మీరు మీ భార్యను హగ్ చేసుకోగానే వీర్య స్ఖలనం జరిగిందని చెపుతున్నారు.
 
అంటే.. మీలో తొలిసారి భార్యతో సెక్స్‌లో పాల్గొంటున్నామనే ఫీలింగ్ మనస్సులో బలంగా ఉంది. ఈ ఉత్తేజభరితమైన ఆనందం కారణంగా అలా జరిగివుండొచ్చు. మీరు ఇక్కడో విషయాన్ని గమనించాలి. మీరు సెక్స్‌లో పాల్గొనేది మీ భార్యతోనే. పరాయి స్త్రీతో కాదు. అందువల్ల పడక గదిలో నెమ్మెదిగా... ప్రశాంతంగా సెక్స్‌లో పాల్గొనవచ్చు.

No comments:

Post a Comment