జవాబు : చాలామంది స్త్రీలు వక్షోజాలు సడలిపోయినట్లుగా ఉండటం వల్ల తీవ్రమైన మానసిక వేదనకు గురవుతుంటారు. ఇటువంటివారి కోసం ఫ్యాషన్ సంస్థలు ప్రత్యేకమైన బాడీసూట్, బాడీ షేపర్ దుస్తులను తయారు చేస్తోంది. ఇవి స్తనాల నుంచి నడుం, పిరుదుల దాకా ఉన్న ప్రాంతాన్ని నియంత్రించడం ద్వారా అదనపు ఆకృతిని ఇస్తాయి. ఇటువంటి బాడీసూట్‌లలో భుజాల కింది నుంచి పిరుదుల దాకా లేదా కేవలం నడుము వరకు మాత్రమే ఇవ్వగల రకాలు కూడా ఉన్నాయి.
కొన్ని ఒకే పీస్ కలిగి ఉండి, బ్రా లేదా బ్రీఫ్‌లను విడిగా ధరించాల్సిన అవసరం ఉండదు. స్ట్రాప్స్‌తో, స్ట్రాప్స్ లేకుండా కూడా వీటిని ధరించవచ్చు. ఇవి ఎలా సహకరిస్తాయని చూస్తే... గట్టి నియంత్రణ గల బాడీసూట్ శరీరంలోని కొవ్వును దాచేసి, నడుము, మోకాళ్ల సైజును తగ్గించి చూపడం ద్వారా నాజూగ్గా ఉన్న భ్రాంతిని ఇస్తుంది. ఇవి ధరించినంతసేపు నిరంతర సపోర్టు, పూర్తిస్థాయి సౌకర్యవంతంగా అనిపిస్తుంది. నాజూకుదనంతోపాటు సడలని వక్షోజ సంపదను కలిగి ఉన్నట్లు చేస్తుంది.

No comments:
Post a Comment