Friday 29 April 2016

204. ఆమెతో కలిసి బ్రతకాలంటే వల్లకావడంలేదు. ఏం చేయాలి...?



ప్రశ్న  :   నా భార్య అంటే నాకు పంచ ప్రాణాలు. ఆమె ఒక్క క్షణం దూరమైనా ఉండలేను. మా పెళ్లి జరిగి 12 సంవత్సరాలైంది. మాకు 10 ఏళ్ల అబ్బాయి కూడా ఉన్నాడు. మా సంసారం అన్యోన్యంగానే సాగుతోంది. కానీ ఈమధ్య తన చిన్ననాటి స్నేహితుడు వచ్చి వెళ్లాడు. అప్పట్నుంచి ఆమెలో మార్పు కనిపించింది. ఒకరోజు వాళ్లిద్దరూ బెడ్రూంలో నాకు అలా పట్టుబడ్డారు. వాళ్లను నేనేమీ అనలేదు. ఐతే ఆరోజు నుంచి అతడు మళ్లీ కనబడలేదు. నా భార్య మాత్రం ఏమీ జరగనట్టే ఉంటోంది. ఆమెంటే నాకు ప్రాణంతో సమానం. ఇలా చేసిందని కక్షతో ఏమీ చేయలేను. ఆమెతో కలిసి బ్రతకాలంటే వల్లకావడంలేదు. ఏం చేయాలి...? 

జవాబు :  ఓ వివాహిత స్త్రీ భర్త బతికి ఉండగానే వేరొకరితో సంబంధం పెట్టుకోవడం చట్టవ్యతిరేకం. కాబట్టి మీరు పైన చెప్పిన విషయాలను రుజువు చేస్తూ కోర్టులో డైవోర్స్ కేసు వేసి అక్రమ సంబంధాన్ని ప్రధాన కారణంగా చూపిస్తూ విడాకులు కోరవచ్చు.


No comments:

Post a Comment