Friday 29 April 2016

205. ఈమెతో సెక్స్ కాదని ఆమెను ఎందుకు కావాలనుకుంటున్నానో అర్థం కావడం లేదు.....



ప్రశ్న  :  మా ఇంటి పక్కింటి యువతి చాలా బ్యూటీ. ఆమెతో సెక్స్ కావాలని ఎన్నో నెలలుగా ఎదురుచూస్తున్నా. చివరికి ఎంతో ప్రయత్నించిన మీదట ఆమె సరే అంది. ఐతే ఆమె అలా అన్న తర్వాత నుంచి నాకు ఓ రకమైన ఫీలింగ్ కలుగుతోంది. నాకు ఇప్పటికే పెళ్లయింది. నా భార్య కూడా ఆమెతో సరిసమానంగానే అందంగా ఉంటుంది. మరి ఈమెతో సెక్స్ కాదని ఆమెను ఎందుకు కావాలనుకుంటున్నానో అర్థం కావడం లేదు. అంతేకాదు... నాకు తెలిసినవారిలో ఇద్దరుముగ్గురు ఇలాగే మరో స్త్రీతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. అసలు ఎందుకిలా అనిపిస్తుంది...? 

జవాబు  :  వివాహేతర సంబంధాలు పలు కారణాల వల్ల ఏర్పడుతాయి. ఒకే రకమయిన అనుభవంతో విసుగుపుట్టడం వల్ల కావచ్చు లేదంటే భార్య నుంచి సరయిన సుఖం లభించక ఏర్పడవచ్చు. ఐతే కొందరు పురుషులు పరాయి స్త్రీ సెక్సుకు అంగీకరిస్తే, ఆమెతో రతి సుఖం ఎలా ఉంటుందో చూడాలన్న థ్రిల్ కోసం పాల్గొంటారు.

ఇకపోతే అవతలి స్త్రీ తనపట్ల ఆకర్షితురాలయి సెక్స్ కోసం ఆరాటపడటాన్ని చూసి తనేదో అందగాడిననీ, తనలోని మగతనాన్ని మరో స్త్రీ కోరుకుంటుంది కనుక దానిని తీర్చాలన్న ఉద్దేశ్యంతో వివాహేతర సంబంధానికి పూనుకుంటారు. ఇంకా కొన్ని కారణాల వల్ల ప్రేమికులు విడిపోవడం, వేరే వివాహం చేసుకున్న తర్వాత తన భాగస్వామితో తృప్తికరమైన సెక్స్ అనుభవాన్ని చవిచూడకపోయిన సందర్భంలో పాత పరిచయం పురివిప్పుతుంది.

ప్రేయసి లేదా ప్రియుడు తన ప్రేమ బంధాన్ని గుర్తు చేసి, తను ఎదుర్కొంటున్న సమస్యను అవతలి వ్యక్తికి చెప్పి ఎలాగోలా ఒప్పించి సెక్స్ సుఖాన్ని అనుభవిస్తారు. ఇవే కాకుండా కొత్తదనం కోరుకోవడం, దంపతుల మధ్య తగ్గే ప్రేమ, ఆకర్షణ, ఆదరణ వంటివన్నీ వివాహేతర సంబంధానికి దారితీస్తాయి. ఐతే ఇలాంటి వివాహేతర సంబంధాలు ఎప్పటికైనా చేటు తెస్తాయని తెలుసుకోవాలి.

204. ఆమెతో కలిసి బ్రతకాలంటే వల్లకావడంలేదు. ఏం చేయాలి...?



ప్రశ్న  :   నా భార్య అంటే నాకు పంచ ప్రాణాలు. ఆమె ఒక్క క్షణం దూరమైనా ఉండలేను. మా పెళ్లి జరిగి 12 సంవత్సరాలైంది. మాకు 10 ఏళ్ల అబ్బాయి కూడా ఉన్నాడు. మా సంసారం అన్యోన్యంగానే సాగుతోంది. కానీ ఈమధ్య తన చిన్ననాటి స్నేహితుడు వచ్చి వెళ్లాడు. అప్పట్నుంచి ఆమెలో మార్పు కనిపించింది. ఒకరోజు వాళ్లిద్దరూ బెడ్రూంలో నాకు అలా పట్టుబడ్డారు. వాళ్లను నేనేమీ అనలేదు. ఐతే ఆరోజు నుంచి అతడు మళ్లీ కనబడలేదు. నా భార్య మాత్రం ఏమీ జరగనట్టే ఉంటోంది. ఆమెంటే నాకు ప్రాణంతో సమానం. ఇలా చేసిందని కక్షతో ఏమీ చేయలేను. ఆమెతో కలిసి బ్రతకాలంటే వల్లకావడంలేదు. ఏం చేయాలి...? 

జవాబు :  ఓ వివాహిత స్త్రీ భర్త బతికి ఉండగానే వేరొకరితో సంబంధం పెట్టుకోవడం చట్టవ్యతిరేకం. కాబట్టి మీరు పైన చెప్పిన విషయాలను రుజువు చేస్తూ కోర్టులో డైవోర్స్ కేసు వేసి అక్రమ సంబంధాన్ని ప్రధాన కారణంగా చూపిస్తూ విడాకులు కోరవచ్చు.


203. చనిపోయినా కూడా ఇంకా అతడి జ్ఞాపకాలతోనే ఉన్నదా... నా పరిస్థితి ఏమిటి...?


ప్రశ్న   :  నా భార్య పరిస్థితి ఏమిటో నాకు అర్థం కావడంలేదు. ఆమె చాలా అందగత్తె అని 15 ఏళ్ల క్రితం మా పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాను. ఆ తర్వాత తెలుసుకున్నాను ఆమెకు ఓ ప్రియుడు ఉన్నాడని. ఐతే మా పెళ్లి తర్వాత అతడితో సంబంధాలు కట్ చేసుకున్నానని చెప్పింది. నాలుగేళ్ల క్రితం అతడు చనిపోయాడు. కానీ ఈమధ్య ఓ రోజు అతడు రాసిన ప్రేమలేఖలను తీసుకుని చదువుతూ ముద్దుపెట్టుకుంటూ కనబడింది. ఆమె గమనించకుండా అలా దాక్కుని చూస్తూ ఉన్నాను. ఆ లేఖలతో ఏదో మాట్లాడుతోంది. ఆమె ప్రియుడిని వదల్లేదా...? చనిపోయినా కూడా ఇంకా అతడి జ్ఞాపకాలతోనే ఉన్నదా... నా పరిస్థితి ఏమిటి...? నాకేమీ అర్థం కావడంలేదు... 

జవాబు  :  ఆమెపాతజ్ఞాపకాల నుంచి బయటకు రానట్లు అర్థమవుతుంది. అతడు భౌతికంగా లేకపోయినా మానసికంగా అ తడి జ్ఞాపకాలు ఉన్నాయి. ఇకపోతే ఆమెను ఆ దారి నుంచి బయటకు రప్పించాల్సిన బాధ్యత మీదే. 15 ఏళ్ల క్రితం ప్రేమ అయినప్పటికీ ప్రేమ అనేది మరిచిపోవడం చాలా కష్టమైనదే. మరీ ఆమె ఆ ఆలోచనల్లోనే మునిగితేలుతుంటే మానసిక వైద్యుడికి చూపించండి. కౌన్సిలింగ్ ద్వారా మెల్లమెల్లగా ఆ ఆలోచనల నుండి దూరం కావచ్చు.



202. సెక్స్ మీద విపరీతమైన కోరికైతే ఉందికానీ అంగమే స్తంభించడంలేదు. .....



ప్రశ్న   :  నా వయసు 55 ఏళ్లు. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. నా భార్యకు 45 ఏళ్లు వచ్చాయి. సెక్సులో బాగా కోఆపరేట్ చేస్తుంది. కాని నేను వారానికి ఒక్కసారే సెక్సులో పాల్గొనగలను. సెక్స్ మీద విపరీతమైన కోరికైతే ఉందికానీ అంగమే స్తంభించడంలేదు. ఇది ఇప్పటి సమస్య కాదు. పెళ్లయినప్పటి నుంచి ఇలాగే ఉంది. రోజూ 2 పెగ్గులు మందు తాగి, 2 సిగరెట్ ప్యాకెట్లు కాల్చందే నిద్రపట్టదు. అందువల్లనే అది స్తంభించడం లేదా...? 

జవాబు  :  సెక్స్ కోర్కెలు ఉన్నప్పటికీ కొందరిలో అంగం స్తంభించడం అనేది ప్రతిరోజూ కావాలన్నా కుదరదు. ఇది సహజ లక్షణంగా అనుకోవచ్చు. మరికొందరిలో ఆరోగ్య కారణాల వల్ల సెక్స్ సామర్థ్యం తగినంతగా ఉండదు. దీనికితోడు సెక్స్ కోర్కె తీర్చలేకపోతున్నావని భార్య నుంచి ఛీత్కారాలతో తనకు ఎక్కువసార్లు సెక్స్ చేసే పరిస్థితి ఎందుకు కలగడం లేదన్న ఆవేదనతో మరింత డీలా పడిపోతారు. ఆ కారణంగా అంగం స్తంభించడంలో సమస్య తలెత్తుతుంది.

కాబట్టి ఆవేదన చెందకుండా, అనవసరమైన ఆలోచనలు మానేసి, నా సామర్థ్యం ఇంతేనని ప్రశాంతంగా మనసు ఉంచుకోవాలి. సిగరెట్లు, మందు సెక్స్ కోర్కెలకు, అంగ స్తంభనకు అవరోధం కలిగిస్తాయి. అవి మానేయండి. అప్పుడు అంగస్తంభన విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి.

201. బాస్ ఎంతగా ప్రేరేపించినా సెక్స్‌లో పాల్గొనలేకపోతున్నా.....


ప్రశ్న  :  నా వయస్సు 32 యేళ్లు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోతే.. పిల్లలు, తన పోషణార్థం ఒక ఆఫీసులో చేరాను. డిగ్రీ పూర్తి చేసివుండటంతో పనిలో చేరిన కొద్ది రోజులకే మంచి గుర్తింపు, హోదా లభించింది. దీంతో కంపెనీ బాస్ గుర్తించి మేనేజర్ పదవి ఇచ్చారు. ఆ తర్వాత మా యిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త.. శారీరక సంబంధానికి దారితీసింది. అలా కొంతకాలం పాటు బాగానే ఎంజాయ్ చేశాం. అయితే, గత కొన్ని నెలలుగా తీవ్రమైన పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నా. దీంతో బాస్ ఎంతగా ప్రేరేపించినా సెక్స్‌లో పాల్గొనలేకపోతున్నా. ఈ సమస్య శాశ్వతంగా ఉంటుందా? నా సమస్యకు పరిష్కారం లేదా?

జవాబు  :  సాధారణంగా తీవ్రమైన పని ఒత్తిడిలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే సమస్య ఇది. దీనికితోడు సామాజిక ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయి. దీంతో శృంగారంలో అనుకున్నంతగా స్పందించలేరు. ఇక్కడ మీ సమస్య కేవలం పని ఒత్తిడి మాత్రమే. పని భారాన్ని క్రమంగా తగ్గించుకోండి. తోటి వర్కర్స్‌కు షేర్ చేయండి.

దీనికితోడు ప్రతిరోజూ యోగా, ఏరోబిక్స్ వంటి వ్యాయామాలు చేయండి. దాంతో ఒత్తిడి తొలగిపోవడంతో పాటు ఫిట్‌సెస్ చేకూరుతుంది. మీ సెక్స్ పెర్‌ఫార్మెన్స్ కూడా పెరుగుతుంది. మానసికంగా ప్రశాంతంగా ఉండటం అన్నిటికంటే ముఖ్యం. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే కొన్నాళ్లు మందులు వాడటం ద్వారా మీ సమస్యను అధిగమించవచ్చు.



200. నాకు తృప్తి ఎందుకు కలుగడంలేదు.......


ప్రశ్న  :  సెక్సులో నా భర్త పడే సంతోషాన్ని చూసి నేను నా భర్త కోసం తెగ తృప్తి పడుతున్నట్లు ముఖం పెడుతుంటాను. ఆయన వీర్యం స్ఖలించాక నన్ను ముద్దులతో ముంచెత్తుతారు. ఎక్కడంటే అక్కడ ముద్దులు పెడుతారు. ఎంతో తృప్తి చెందుతారు. నిజానికి నాకు అటువంటి తృప్తి కలుగదు. ఐనా ఆయన సంతోషాన్ని చూసి నేను కూడా సంతోషంగా ఉన్నట్లు ప్రవర్తిస్తాను. అసలు నాకు తృప్తి ఎందుకు కలుగడంలేదు... 

జవాబు  :  సెక్సు చివరి దశకు చేరుకుని పురుషుడు యోనిలో వీర్యం స్ఖలించే సమయంలో అతడికి కలిగే తృప్తినే భావప్రాప్తి అని పిలుచుకుంటుంటారు. ఇదేవిధమైన తృప్తి స్త్రీలోనూ కలుగుతుందని చాలామంది పురుషులు అనుకుంటారు. కానీ సెక్స్ చేస్తూ వీర్యం స్ఖలించినప్పుడు భావప్రాప్తికి లోనయ్యే స్త్రీలు కేవలం 29 శాతం అంటున్నారు పరిశోధకులు. మరి ఆ 71 శాతం మంది స్త్రీలకు సెక్సులో భావప్రాప్తి చెందరా అంటే, వాటికి వేరే చెపుతుంటారు.

స్త్రీ సెక్స్ సమయంలో కంటే ఫోర్ ప్లే సమయంలోనే ఎక్కువ భావప్రాప్తికి లోనవుతుంది. ముఖ్యంగా సెక్సులో పాల్గొనే ముందు పురుషుడు స్త్రీ వక్షోజాలను చూషించడం, ముద్దులతో స్పర్శా సుఖాన్ని అందజేయడం, యోనిపై స్పర్శించడం, క్లైటోరిస్ పై నెమ్మదిగా స్పృశిస్తూ సుఖానుభూతులకు గురిచేయడం వంటి చర్యల్లో ఎక్కడో ఓ దగ్గర భావప్రాప్తికి లోనవతుందట.

అలాగే ఫోర్ ప్లే చేస్తూ సెక్స్ చేసే సమయంలోనూ భావప్రాప్తి చెందుతుందని తమ పరిశోధనల్లో తేలిందంటున్నారు పరిశోధకులు. కనుక స్త్రీకి భావప్రాప్తి అనేది కేవలం వీర్య స్ఖలనమయినప్పుడే కలుగాలని ఏమీ లేదు.


199. పెళ్లయ్యాక భార్యను సెక్సులో తృప్తిపరచలేనని అంటున్నాడు......




ప్రశ్న   :  నాకు సెక్స్ కోర్కెలు విపరీతం. అందమైన అమ్మాయిని చూస్తే అంగం దానంతట అదే స్తంభిస్తుంది. సన్నిహితంగా ఉండాలనిపించేది. అలాంటి ఊహలతోనే డిగ్రీ చదువులో తక్కువ మార్కులు వచ్చాయి. ఐతే చాలా కష్టపడి ఉద్యోగం సాధించాను. ఐతే సెక్స్ కోర్కెలను అదిమిపట్టలేక హస్తప్రయోగం చేస్తున్నా. నా స్నేహితుడు హస్తప్రయోగం అతిగా చేస్తూ, వీర్యాన్ని స్ఖలించడం వల్ల పెళ్లయ్యాక భార్యను సెక్సులో తృప్తిపరచలేనని అంటున్నాడు. అందువల్ల హస్తప్రయోగం చేసినా వీర్యం స్ఖలిస్తుందనగా అదిమిపెట్టి వీర్యం స్ఖలించకుండా జాగ్రత్తపడుతున్నా. దీనివల్ల ఏమైనా అనారోగ్య సమస్య వస్తుందేమోనని మరొక భయం పట్టుకుంది... 

జవాబు  :  హస్త ప్రయోగం చేస్తున్నపుడు వీర్య స్ఖలనాన్ని నిరోధించాలని చూడటం ఏమంత మంచిది కాదు. ఇలా నిరోధించిడం వల్ల పొత్తికడుపులోనూ, వృషణాలలోనూ లేనిపోని సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. హస్త ప్రయోగం చేస్తున్నప్పుడు వీర్య స్ఖలనం జరిగే సమయంలో గబుక్కున ఆపేయాలని చూస్తే న్యూరోసిస్ లక్షణాలు కూడా రావచ్చు.

కనుక ఎప్పుడో జరిగే పెళ్లి, భార్యతో ఎక్కువసేపు సెక్స్ చేయాలన్న కోరికతో ఇప్పుడే ఆరోగ్యం పాడుచేసుకునే పద్ధతులు మంచివి కావు. పెళ్లయిన తర్వాత సెక్సు చేస్తున్నప్పుడు ఎక్కువసేపు స్ఖలనం కాకుండా ఉండే పద్ధతి దానంతట అదే వస్తుంది. హస్తం ప్రయోగం చేసుకోకున్నా... సెక్స్ కోర్కెలు కలిగినపుడు నిద్రలోనే స్వప్న స్ఖలనం జరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ స్నేహితుడు చెప్పినవి పట్టించుకోనవసరంలేదు.

198. భవిష్యత్తులో మళ్లీ ఆమె పాత స్నేహితుడు ఎంటరవ్వడా . ....



ప్రశ్న   :  మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ఈమధ్య హనీమూన్ వెళ్లాం. అక్కడ ఒకరి సంగతులు ఒకరు చెప్పుకున్నాం. హనీమూన్ మధురానుభూతిని పొందే క్షణంలో నా భార్య చెప్పిన మాట విని తల తిరిగిపోయింది. ఆమెతో సెక్స్ చేయబోయే ముందు నాకో విషయం చెప్పింది. అదేమిటంటే... ఆమె డిగ్రీ చదివే రోజుల్లో ఓ బాయ్‌ఫ్రెండ్ ఆమెను మాయచేసి అనుభవించాడట. ఆ తర్వాత అతడు మళ్లీ కనబడకుండా ఫారిన్ వెళ్లిపోయాడట. ఈ విషయంలో తన తప్పేమీ లేదని, ఇది చెప్పకపోతే తను నిత్యం చస్తూ బతుకుతున్నట్లనిపిస్తుందని కాళ్లపై పడి బోరున ఏడ్చేసింది. 

ప్రేమించే సమయంలో ఎందుకు చెప్పలేదు అని అడిగితే... సమాధానం చెప్పటం లేదు. బోరుమని ఏడుస్తోంది. ఐతే ఆమె నా ప్రాణం. కానీ ఆమె నిజంగా మాయలో పడి అలా మోసపోయిందా.... లేదంటే ఇష్టపూర్వకంగా అతడితో సెక్సులో పాల్గొందా...? ఇప్పుడు నేను ఆమె తప్పును క్షమించి వదిలేసినా భవిష్యత్తులో మళ్లీ ఆమె పాత స్నేహితుడు ఎంటరవ్వడా .  మా పెద్దలను సైతం ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ అమ్మాయి చరిత్ర ఇదీ అని తెలిస్తే నా పేరెంట్స్ ఏమంటారోనని ఆందోళనగా ఉంది. ఈ విషయం తెలిసిన దగ్గర్నుంచి ఆమెతో నేను క్లోజ్‌గా ఉండలేకపోతున్నాను. ఆమె కూడా తన గదికే పరిమితమైపోయింది. ఇంటి పని చేసేసి గదిలో కూర్చుని ఏడుస్తూ ఉంటోంది. ఈ సమస్యకు పరిష్కారమేమిటో అర్థం కావడం లేదు.....

జవాబు   :  ఇది చాలా బాధాకరం. ప్రేమించేటపుడు కొందరు ఇలా మాయచేసి లైంగికంగా అనుభవించి మోసం చేసే వార్తలను మనం పత్రికల్లోనూ చూస్తుంటాం. కానీ ఆమె ఈ విషయంలో అమాయకురాలని తెలుస్తుంది. తన కాలేజీ రోజుల్లో అతడిని అమాయకంగా నమ్మడంతో అతడి చేతిలో మోసపోయింది. ఇప్పుడు కూడా అసలు నిజాన్ని చెప్పడంతో ఆమె తన మనసులో ఏదీ దాచుకోదని అర్థమవుతుంది. ఆమె మనసులో ఎలాంటి కల్మషము లేదని తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడామె మీ అర్థాంగి. కాబట్టి ఆమెను ఆ చేదు జ్ఞాపకాల నుంచి బయట వేసి కొత్త జీవితాన్ని అందించాల్సింది మీరే. అది ఎలాంటి జీవితం అనేది మీ చేతుల్లోనే ఉంది.


197.ఆమెకు గర్భం వచ్చే అవకాశం ఉన్నదా...?


ప్రశ్న  :  డిగ్రీ చదువు పూర్తయి జాబ్ సెర్చింగ్‌లో ఉన్నాము. ఈమధ్య ఇద్దరం అలా ప్రకృతిని ఆస్వాదించేందుకు సరదాగా సైకిల్ పైన వెళ్లాము. కొంత దూరం వెళ్లాక మంచి పచ్చిక బయలు కనబడటంతో అక్కడికెళ్లి ముచ్చట్లు చెప్పుకున్నాము. సాయంత్రం కావస్తుండటంతో ఇద్దరం బయలుదేరాం ఇంటికి వచ్చేందుకు. కానీ ఆ క్షణంలో ఆమె సెక్సీ భాగాలు నన్ను తాకాయి.

తమకంతో ఆమెను కౌగలించుకున్నాను. అలా అలా ఓ బలహీన క్షణంలో ఇద్దరం సెక్సులో పాల్గొన్నాం. సెక్స్ చేసినంత సేపు ఎంతో ఆనందంగా పాల్గొన్న ఆమె ముగిశాక ఏడ్పు మొదలుపెట్టింది. తనకు గర్భం వస్తుందేమోనని భయంగా ఉందని అంటోంది. ఐతే సెక్సులో పాల్గొన్న తర్వాత రెండు రోజులకు ఆమెకు బహిష్టు వచ్చింది. ఆమెకు గర్భం వచ్చే అవకాశం ఉన్నదా...?

జవాబు   : మీరు చెప్పేదాన్ని బట్టి గర్భం వచ్చే అవకాశం తక్కువ. ఐతే పెళ్లికి ముందు అలా దగ్గరవడం వల్ల చిక్కులు వస్తాయి. అందువల్ల నిగ్రహం ముఖ్యం. గర్భం రాకూడదని అనుకుంటే గర్భ నిరోధానికి వైద్యుడి సలహాతో మాత్రలు వేసుకోవచ్చు. లేదంటే కండోమ్ ధరించి సెక్సులో పాల్గొనవచ్చు.

196. బాస్ సడెన్‌గా దాన్ని నా ముందు పెట్టాడు.. ఉద్యోగ భయంతో వత్తేశాను... ఇపుడేం చేయాలి...?


ప్రశ్న  :  నాకు ఏడాది క్రితం పెళ్లయింది. ప్రముఖ కంపెనీలో పనిచేస్తున్నాను. మంచి జీతం ఇస్తున్నారు. ఇటీవల మాకు కొత్త బాస్ వచ్చాడు. వారం రోజులపాటు బాగానే ఉన్నాడు. ఓ రోజు నన్ను పిలిచి ప్రియారిటీ పనులేమిటో లిస్టవుట్ చేశాడు. మరో రోజు పిలిచి మాట్లాడుతూనే ప్యాంటు వద్ద ఆ భాగాన్ని వత్తుతూ మాట్లాడుతున్నాడు. నాకేదో తేడాగా అనిపించి అక్కడి నుంచి బయటకు వచ్చేశాను. మళ్లీ మరో రోజు కూడా ఇలాగే చేశాడు. అప్పుడు నేను పట్టించుకోలేదు. అతడు ఏదేదో చేస్తున్నా నాకప్పగించిన పనిని పూర్తి చేసి వచ్చాను.  


ఇటీవల నాతో మాట్లాడుతూనే అకస్మాత్తుగా నా వద్దకు వచ్చి ప్యాంటు కింది దించి పురుషాంగాన్ని నా ముందు వుంచి, దాన్ని తాకుతూ వత్తాలని బతిమాలాడు. ఏం చేయాలో తోచక, కాదంటే ఉద్యోగం నుంచి తీసేస్తారని భయపడి అతడు కోరినట్లే వత్తాను. ఆ తర్వాత శెలవు పెట్టేశాను. శెలవులు అయిపోతున్నాయి. ఇప్పుడు వెళితే మళ్లీ అలా అడుగుతాడేమోనని భయంగా ఉంది. ఈ విషయం నా భర్తతో చెబితే వెంటనే ఉద్యోగం మానేయమంటారు. ఎవరికి చెప్పినా ఇదే సలహా ఇస్తారని అనుకుంటున్నాను. వేరే మార్గం ఏదయినా ఉందా...

జవాబు  :  ఇలాంటి కామాంధులు కొన్నిచోట్లు ఉంటున్నారు. అధికారం చేతిలో ఉండేసరికి ఇలా ప్రవర్తిస్తుంటారు. తమ కింద పనిచేసే మహిళా ఉద్యోగులను ఇలా లైంగికంగా వేధిస్తుంటారు. మీవద్ద మొదటిసారిగా వెకిలివేషం వేసినప్పుడే అతడికి వార్నింగ్ ఇచ్చి ఉంటే మళ్లీ మీ జోలికి వచ్చేవాడు కాదు. మీరు మౌనంగా అన్నీ భరించేసరికి ఆ పని చేశాడు. దీన్ని కూడా భరిస్తే తదుపరి స్టెప్ వేసే అవకాశం లేకపోలేదు. కాబట్టి అతడికి అలాంటి పిచ్చి చేష్టలు చేయవద్దని హెచ్చరించండి. అప్పటికీ వినకపోతే విషయాన్ని అతడి పై అధికారులకు పంపండి. అప్పటికీ పరిష్కారం దొరక్కపోతే వేరే ఉద్యోగం చూసుకోవడం మంచిది.