Wednesday 12 August 2015

165.ఆమె తన నాభీ కిందికి చీర కడుతోంది... కంట్రోల్ చేసుకోలేకపోతున్నా...?





ప్రశ్న  :  నేను ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాను. అక్కడ నా బ్యాచ్‌లో ఓ అందమైన అమ్మాయి కూడా ఉంది. ఆమె ఎప్పుడూ చీర కట్టుకునే వస్తుంటుంది. కానీ ఆ చీర తన నాభీ కిందికి కట్టి వస్తుంటుంది. ఆమె వచ్చినప్పట్నుంచి నా చూపులు అక్కడికే వెళుతున్నాయి. ఆమె పట్ల తీవ్రంగా ఆకర్షితుడవుతున్నాను. గబుక్కున మనసులో రేగుతున్న సెక్స్ కోర్కెను చెప్పేస్తానేమోనని భయంగా ఉంది. కంట్రోల్ చేసుకునేది ఎలా...?

జవాబు  : ప్రత్యేకించి అటువైపే ఎందుకు చూస్తున్నారు. ముందు మీ దృష్టిని ఇతర వ్యాపకాలపైకి మరల్చండి. ఆమె వస్తున్నప్పుడు ముఖం కేసి చూస్తూ మాట్లాడండి. మరీ అంతగా కంట్రోల్ కాలేకపోతుంటే ఆమె వచ్చినప్పుడు మీ కంప్యూటర్లోకి చూస్తూ మాట్లాడుకోవచ్చు. అలా కాకుండా ఆమెను ఇబ్బందిపెట్టే చూపులు చూస్తే ఇద్దరికీ సమస్యే.

164.పెళ్లయిన కొందరు ఆంటీలను చూస్తే నిగ్రహం కోల్పోతున్నాను. ...ఎందుకని?






ప్రశ్న  :  నా వయసు 28 ఏళ్లు. ప్రస్తుతం ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. నాదో వింత సమస్య అని అనుకుంటున్నాను. నేనంటే ఇష్టపడే టీనేజ్ అమ్మాయిలకు బదులు ఆంటీలపై ఇష్టం పెరుగుతోంది. నన్ను ప్రేమిస్తున్నానంటూ వెంటబడే అమ్మాయిని పట్టించుకోవడంలేదు. కానీ నేను పనిచేసే కంపెనీలో పెళ్లయిన కొందరు ఆంటీలను చూస్తే నిగ్రహం కోల్పోతున్నాను. ముఖ్యంగా ఓ ఆంటీని చూస్తే పిచ్చెక్కిపోతోంది.


ఆమె నాభీ కిందికి చీర కట్టుకుని నడుముకు కిందిగా చీరకట్టు అమర్చుకుని ఉంటుంది. ఎంతవద్దన్నా ఆ ప్రాంతాలవైపు నా చూపు వెళ్లిపోతోంది. ఆమెతో సెక్సులో పాల్గోవాలనిపిస్తుంది. కానీ అది తప్పని తెలుసు కనుక బలవంతంగా కోర్కెను అణచుకుంటున్నాను. కానీ ఇలా ఎన్నాళ్లో అర్థం కావడంలేదు. ఆమెను చూస్తే నేను ఎందుకింత గిజగిజలాడుతున్నానో అర్థంకావడంలేదు. నాకేమైనా మానసిక బలహీనతేమోనని డౌటుగా ఉంది...


జవాబు :  ఇదేమీ ఆందోళన చెందాల్సిన విషయం కాదు. ముఖ్యంగా ఆమె వస్త్రధారణ వ్యవహారం మిమ్మల్ని ఎక్కువగా ఆకర్షిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇలాంటి వస్త్ర ధారణతో మీరు ఇష్టపడే అమ్మాయి మీ చెంతకు వచ్చినా ఆమె పట్ల కూడా మీరు ఇలాగే ఆకర్షితులయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని గురించి ఎక్కువగా ఆలోచన చేయకుండా తగిన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోండి. అన్నీ అవే సర్దుకుంటాయి.

163.నన్నలా చూడగానే అరిచి పడి పోయింది... ఆ పని అంటేనే వణుకుతోంది... ఏంచేయాలి?





ప్రశ్న  :  మాది పెద్దలు కుదిర్చిన సంబంధం. పెళ్లయిన తర్వాత నేను వృత్తిరీత్యా వేరే ఊరికి వెళ్లాల్సి వచ్చింది. అందువల్ల మా సెక్స్ కలయిక కుదర్లేదు. 6 నెలల తర్వాత ఇటీవలే ఇంటికి వచ్చాను. ఎంతో ఆశగా నా భార్యతో సెక్స్ చేయాలని ఆ రాత్రి పడక గదికి చేరిన నాకు చేదు అనుభవం ఎదురైంది.

సెక్స్ చేసేందుకు నేను సమాయత్తమయ్యాను. కానీ స్తంభించిన నా పురుషాంగాన్ని చూసి ఆమె కేక వేసి పడిపోయింది. నాకు భయం వేసి ఆమె ముఖంపై నీళ్లు చల్లాను. లేచి కూర్చుని వెంటనే పక్క గదిలోకి వెళ్లిపోయింది. ఏమిటని అడిగితే... అదంటే భయమంటోంది. అప్పటికీ ధైర్యం చేసి సెక్స్ చేయబోతే వణికిపోతోంది... ఏం చేయాలో తెలియడంలేదు.

జవాబు  :  ఇలాంటి సమస్య కొంతమంది ఎదుర్కొంటుంటారు. దీనికి కారణం కొందరు స్త్రీలలో సెక్స్ పట్ల ఉన్న భయం. సెక్స్ చేయగానే కన్నెపొర చిరిగిపోతుందనీ, రక్తం కారుతుందనీ... ఇలా ఏవేవో భయాలను కలిగి ఉంటారు. ఇలాంటివారిని ప్రేమగా దగ్గరకు తీసుకుని కొన్నాళ్లు సెక్సీ భాగాలను తాకుతూ ముద్దాడాలి. ఆ తర్వాత మెల్లగా వారే సెక్స్ పరంగా ఉద్రిక్తచెందాక రతికి ఉపక్రమించాలి. అంతేతప్ప నేరుగా అక్కడికే వెళితే సమస్య ఇలాగే ఎదురవుతుంది.

162.వారిది చిన్నది.. నాది పెద్దది... దగ్గరకు వచ్చేందుకు భయపడుతున్నారు.. ఏం చేయాలి?





ప్రశ్న  :  మావారి అంగం చాలా చిన్నది. అదేసమయంలో నేను బొద్దుగా, లావుగా ఉండటంవల్ల నా యోని పెదవులు లావుగా ఉన్నాయి. దీంతో యోని పెద్దదిగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ కారణంగా నన్ను తృప్తిపరచలేనన్న భయంతో మావారు నావద్దకు వచ్చేందుకు భయపడిపోతున్నారు. అంగం సైజుతో పనిలేదనీ.. ఇద్దరం సంతోషంగా శారీరకంగా కలుద్దామని ఎంతగా నచ్చజెప్పినా ఆయన వినిపించుకోవడం లేదు. ఏం చేయాలి.. మా ఇద్దరి కోర్కెలు తీర్చుకునే మార్గమేంటి...

జవాబు   :  పురుషుడి మనస్సులో స్త్రీని శారీరకంగా సంతృప్తిపరచలేనన్న భావన పడిపోయినపుడే ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. అంగం సైజుతో పనిలేదని చెప్పినప్పటికీ.. ఆయన వెనుకంజ వేస్తున్నారంటే కాస్తంత ఆలోచించాల్సిన విషయం. దాంపత్య జీవితంలో పురుషుని పాత్ర ఎంత కీలకమో స్త్రీపాత్ర కూడా అంతేముఖ్యం. ఆ విషయం అర్థం చేసుకున్నారు కాబట్టే భర్తను మరింత నిరుత్సాహపరచకుండా ప్రోత్సహిస్తున్నారు. అయితే, ఆయన మనస్సులో నిగూఢమైవున్న భావనను పోగొట్టి యధాతథస్థితికి తీసుకునిరావడం అంతసులభమైన విషయంకాదు. అయినప్పటికీ.. మీవంతు ప్రయత్నంగా ఇతర బాహ్య రతి పద్ధతులను పాటిస్తూ ఆయనను దారిలోకి తెచ్చే ప్రయత్నం చేయండి. అప్పటికీ రాకుంటే సెక్స్ కౌన్సెలింగ్ ఇప్పించడమే ఏకైక మార్గం.

161.చనుమొనల ఆకృతిని బట్టి లైంగిక సంబంధం ఉందో లేదో కనుగొనవచ్చా...






ప్రశ్న   :  నా కాబోయే భార్య వక్షోజాలను చూషించే సమయంలో ఆమె చనుమొనలు చూశాను. అవి చాలా పెద్దవిగా ఉన్నాయి. ఈ విషయాన్ని పెళ్లయిన నా స్నేహితుడితో చర్చిస్తే... అలా చనుమొనలు పెద్దవిగా ఉంటే సెక్స్ అనుభవం ఉండే ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. వాడు చెప్పింది నిజమా...? చనుమొనల ఆకృతిని బట్టి లైంగిక సంబంధం ఉందో లేదో కనుగొనవచ్చా...?

జవాబు   :  మీది అర్థం లేని భయం. మీ స్నేహితుడు చెప్పినది నిజం కాదు. చనుమొనలు ఒక్కో స్త్రీలో ఒక్కో విధంగా ఉంటాయి. కొందరు మహిళలకు చనుమొనలు చాలా పెద్దవిగా ఉంటాయి. మరికొందరికి చిన్నవిగా ఉంటాయి. అలాగే రంగుల్లో కూడా తేడాలు ఉంటాయి. వీటి ఆధారంగా ఆ మహిళకు ముందస్తుగా సెక్స్ అనుభవం ఉందని చెప్పడం సాధ్యం కాదు.

మహిళల చనుమొనల్లో తేడాలు, మార్పులు ఉండటం సహజం. వీటి రంగు, రూపాలకి లైంగిక అనుభవానికి సంబంధం లేదు. వీటిని చూసి సెక్స్ అనుభవం ఉన్నట్టు చెప్పలేము. కాబట్టి అర్థంలేని భయంతో అనుమానాలకు పోవద్దు.

160.చేతివేళ్ళతో మర్మాంగాన్ని తాకి తృప్తిపడుతోంది.. ఇదేం అలవాటు?






ప్రశ్న   :  నాకో గర్ల్‌ఫ్రెండ్ ఉంది. ఇద్దరం చాలా రోజులుగా ప్రేమించుకుంటున్నాం. అన్ని అంశాలపై ఇద్దరి అభిప్రాయాలను వెల్లడిస్తుంటాం. కానీ, మా మాటల మధ్య ఇప్పటివరకు పెళ్లిప్రస్తావన అనేది రాలేదు. అదేసమయంలో ఆమెను హగ్ చేసుకోవడం, ముద్దులు పెట్టుకోవడం చేస్తున్నాను. ఆమె మాత్రం నా మర్మాంగాన్ని చేతివేళ్ళతో తాకి తృప్తిపడుతోంది. ఇదేం అలవాటో నాకైతే అర్థంకావడం లేదు. ఆమె ఎందుకలా చేస్తోంది.

జవాబు  :  ఇదికూడా ఓ రకమైన స్వయంతృప్తి పొందే చర్యే. అంగాన్ని అలా తాకడం వల్ల ఆమెలో కామ ఉద్దీపనులు కలిగి.. స్వయంతృప్తి పొందుతూ ఆనందిస్తుంది. అంటే డైరెక్టుగా సెక్స్‌లో పాల్గొనకుండా తన మనస్సుకు నచ్చిన వ్యక్తితో ఈ తరహా చర్యల్లో పాల్గొనడం వల్ల తాను పొందదలచుకున్న ఆనందాన్ని, స్వయంతృప్తిని పొందుతుంది.

పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొన్నట్టయితే గర్భం, సుఖ వ్యాధులు వంటివి వస్తాయన్న భయం ఆమె మనస్సులో ఉంటుంది. పైగా.. ఎపుడు కూడా పెళ్లి ప్రస్తావన రాలేదని అంటున్నారు. ఒకవేళ పరాయి వ్యక్తిని వివాహం చేసుకున్నట్టయితే అతనికి తన ముందస్తు సెక్స్ అనుభవం తెలుస్తుందన్న భయం కూడా ఆమెను వెంటాడుతూ ఉండొచ్చు. అందువల్లే చేతివేళ్ళతో అంగాన్ని స్పృశిస్తూ స్వయంతృప్తి పొందుతున్నట్టుగా ఉంది.

159.అప్పట్నుంచి సెక్సులో పాల్గొనదే ఉండలేకపోతున్నాం ?






ప్రశ్న  :  మేమిద్దరం ప్రేమికులం. ఇద్దరం పీజీ కోర్సులు చేస్తున్నాం. మేమిద్దరం పెళ్లాడుతామని మా పేరెంట్స్ కి చెబితే వాళ్లు ఒప్పుకున్నారు కూడా. ఐతే పీజీ ముగిశాక ఉద్యోగంలో సెటిల్ అయ్యి పెళ్లి చేసుకోమన్నారు. తనకి క్యాంపస్ సెలక్షన్ కూడా అయిపోయింది. ఇక నాకు రావాల్సి ఉంది. కాకపోతే దానికి మరో రెండేళ్లు పట్టవచ్చు.

అంతవరకూ వేచిఉండాలన్నారు మా పేరెంట్స్. ఐతే అనుకోకుండా ఒకరోజు ఇద్దరం సెక్సులో పాల్గొన్నాం. ఇక అప్పట్నుంచి సెక్సులో పాల్గొనదే ఉండలేకపోతున్నాం. ఈ ఒక్కసారి సెక్స్ చేసుకుని పెళ్లయ్యే వరకూ వద్దనుకుంటాం. కానీ మరుసటి రోజు మళ్లీ నేను ఆమెను బ్రతిమలాడుతాను. ఇలా జరిగిపోతూ ఉంది. కానీ ఎలాగైనా మానుకోవాలని గట్టిగా అనుకున్నాను. మార్గం ఏదైనా ఉందా...?


జవాబు   :  ముఖ్యంగా నిగ్రహం అవసరం. సెక్సులో పాల్గొనే సమయం కోసం వేచి చూడాల్సిన పరిస్థితి కలుగకుండా ఆ సమయాన్ని మొత్తం కెరీర్ పైనే దృష్టి సారించండి. ఇంకా కొన్నాళ్లు కాస్త దూరంగా ఉండి చదువు సాగించేందుకు ప్రయత్నించండి. అనుకుంటే సాధించలేనిదీ ఏదీలేదు. మానుకోలేకపోవడం అనేది అసంభవం. పెళ్లికి ముందు సెక్స్ అనేది ఇద్దరికీ సమస్యలను తెచ్చి పెడుతుంది. నియంత్రణ అవసరం.

158.ఈయన చెడు అలవాట్లను మాన్పించేదెలా...?






ప్రశ్న  :  మా ఇద్దరికీ పెళ్లయి బిడ్డ పుట్టేవరకూ దాంపత్యం సంతోషంగా ఉంది. ఇప్పుడు నా భర్త వింత ప్రవర్తనతో నాకు పిచ్చెక్కేట్లు ఉంది. రోజుకో భంగిమలో సెక్సు చేయాలనడమే కాకుండా ఈమధ్య అంగాన్ని చూషించాలంటూ ఒత్తిడి చేశారు. ఇంత చెడ్డ పని ఎందుకు చేయమంటున్నాడో నాకు తెలియడంలేదు. యోని చూషణ చేస్తానని కూడా ఒకరోజు గందరగోళం చేశాడు. దానిక్కూడా నేను ససేమిరా అన్నాను. చివరికి పోర్న్ ఫిలిమ్ చూపించి, అందులో వారలా చేసుకుంటున్నప్పుడు మనం చేసుకోవడంలో తప్పేమిటి అంటున్నారు. ఈయన చెడు అలవాట్లను మాన్పించేదెలా...?



జవాబు  :  రతిలో మంచి, చెడు అనేవి ఉండవని గమనించండి. భార్యాభర్తలకు ఇష్టమైతే ఇరువురూ సంతోషంగా వివిధ భంగిమల్లో సెక్సును ఆస్వాదించవచ్చు. ఓరల్ సెక్స్ అనేది కొందరికి విపరీతంగా ఇష్టం ఉంటుంది. మరికొందరికి అస్సలు ఇష్టం ఉండదు. ఐతే భాగస్వామి కోరిక మేరకు నెరవేర్చక తప్పని స్థితి కూడా ఉంటుంది. కాబట్టి అతడి కోర్కెలను చెడు అలవాట్లు అనుకోవాల్సిన పనిలేదు. ఒకసారి ఆయన కోర్కెను సమ్మతిస్తే పదేపదే తిరిగి ఇలాంటి కోర్కెలను ప్రస్తావించకపోవచ్చు. దాంపత్యంలో పరస్పరం అర్థం చేసుకుని ముందుకు వెళ్లాలి.

157.మన ప్రేమకు గుర్తుగా ఓ రాత్రి శారీరకంగా కలిసివుందామని అభ్యర్థిస్తున్నాడు. ఏం చేయాలి?





ప్రశ్న   ప్రైవేట్ కంపెనీలో హెచ్ఆర్ విభాగంలో ఎగ్జిక్యూటివ్ విభాగంలో పని చేస్తున్నా. నా బాస్ చాలా అందంగా ఉంటాడు. దీంతో అతనిపట్ల ఆకర్షణ ఏర్పడటం అది ప్రేమగా మారింది. అతనికి కూడా నేనంటే అమిత ఇష్టం. అప్పటి నుంచి మేమిద్దరం ప్రేమికులుగా కలిసిమెలిసి తిరుగుతున్నాం. అయితే, నాకు ఇంకా వివాహం కాలేదు. మా బాస్‌కు అయింది. అతడికి పిల్లలు లేరు. అలా రెండేళ్లు గడిచిన తర్వాత ఓసారి నన్ను పెళ్లి చేసుకుంటాననే ప్రతిపాదన తెచ్చాడు.


నీ భార్యకు విడాకులు ఇస్తారా అని అడిగాను. అందుకు ఆయన సమ్మతించలేదు. రెండో భార్యగా ఉండమంటున్నాడు. నాకది ఇష్టం లేదు. కానీ నీవు లేనిదే నేను జీవించలేనంటూ నాపై అలిగాడు. చివరకు నేనే బ్రతిమలాడి.. ఓ మంచి ప్రేమికులుగా విడిపోదామని సలహా ఇచ్చా. అయితే, మన ప్రేమకు గుర్తుగా ఓ రాత్రి శారీరకంగా కలిసివుందామని అభ్యర్థిస్తున్నాడు. ఏం చేయాలి? 

జవాబు   :  ఖచ్చితంగా శారీరక సుఖాన్ని పొందాలన్న ధ్యాస, తపన మినహా.. అతడిలో మరొకటి కనిపించడం లేదు. అతనిది నిజమైన ప్రేమ కాదు. మీ మీద వ్యామోహం మాత్రమే. ఆఫీసులో బాస్‌గా ఉంటూ చేదోడువాదోడుగా ఉంటున్నాడన్న సాఫ్ట్ కార్నర్‌ వల్లే మీరు అతనిపట్ల ఆకర్షితులయ్యారు. అంతేకానీ, ఇది మీ ఇద్దరి మధ్య ఉండే నిజమైన ప్రేమ కాదు. మొదటి భార్యకు విడాకులు ఇవ్వని వాడు మిమ్మల్ని మరో పెళ్లి ఎలా చేసుకుంటాడు.. రెండో భార్యగా ఎలా చూసుకుంటాడు. ఇక్కడ మీరిద్దరిదీ శారీరక ఆకర్షణ మాత్రమే. మీకు ఇంకా వివాహం కాలేదంటున్నారు. అందువల్ల మీరు అతడి నుంచి దూరంగా ఉండండి.

156.స్ట్రోక్స్ ఇచ్చినా తృప్తి లేదు... అతడిది చిన్నదేమో....? పెళ్లయినా ఇంతేనా...?




ప్రశ్న  :  మా పెళ్లికి మరో ఏడాది వ్యవధి ఉంది. నా బాయ్ ఫ్రెండు బతిమాలితే సెక్సులో పాల్గొన్నాను. సెక్స్ చేసే సమయంలో అతడు తన పురుషాంగాన్ని నా యోనిలో ప్రవేశింపజేసి స్ట్రోక్స్ ఇస్తుంటాడు. నాకున్న సమస్య ఏంటంటే, అతడు ఎంత గట్టిగా స్ట్రోక్స్ ఇస్తున్నా... యోనికి సరిపడా పురుషాంగం ఉన్నట్లు అనిపించడం లేదు.

సెక్స్ చేసే సమయంలో అతడి స్తంభించిన పురుషాంగాన్ని ప్రవేశపెట్టినా ఇంకా గ్యాప్ ఉంటోంది. అందువల్లనే ఏమోగానీ, అతడు ఎంతగా గట్టిగా స్ట్రోక్స్ ఇచ్చినా తృప్తి కలుగడంలేదు. పెళ్లయిన తర్వాత కూడా ఇలాగే ఉంటే, సెక్స్ జీవితంలో ఆనందం పొందలేకుండా పోతానని బెంగగా ఉంది. అతడి పురుషాంగం పెద్దదిగా మారి నన్ను తృప్తిపరిచే మార్గం ఉందా...?


జవాబు  :  దీనికి చాలా కారణాలుంటాయి. పురుషాంగం ప్రవేశించే కంటే ముందే యోని లైంగికపరంగా బాగా స్పందినప్పుడు సాగుతున్నట్లు ఉంటుంది. అలాంటి సమయంలో పురుషుడు స్పందించిన అంగాన్ని ప్రవేశపెట్టినప్పటికీ తగినంత ఫోర్ ప్లే చేయకుండా ప్రవేశపెడితే ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమవుతుంది. లైంగిక ప్రక్రియలో ఫోర్ ప్లే అత్యావశ్యం. అలా చేయకుండా నేరుగా పురుషాంగాన్ని ప్రవేశపెట్టినట్లయితే ఫలితం ఇలాగే ఉంటుంది.

మరో విషయం ఏమిటంటే, పెళ్లి కాకుండా ముందుగానే సెక్సులో పాల్గొనేవారిలో ఆందోళన, భయం ఉంటాయి. గర్భం వస్తుందనే జంకు ఉంటుంది. అందువల్ల సెక్సులో సమర్థవంతంగా పాల్గొనలేకపోతారు. ఇకపోతే పురుషాంగం ఎంత పొడవు ఉన్నదన్నది ముఖ్యం కాదు... అది స్తంభించి గట్టిగా ఉంటుందా లేదా అనేది ముఖ్యం.

అంతేకాదు... స్త్రీ యోనిలో లైంగిక ఆనందాన్ని పెంచి సంతృప్తికి గురిచేసే కామనాడులు 2 నుంచి 3 అంగుళాల లోపే ఉంటాయి. కనుక పురుషాంగం పొట్టిగా ఉన్నా స్తంభించి ఉంటే సెక్సులో స్త్రీకి అమితానందం కలుగుతుంది.

155.పక్కింటామె వస్తుంటే దొంగచూపులు చూశా... మా ఆవిడ క్లాస్ పీకుతోంది.. ఏంచేయాలి?






ప్రశ్న  :  మాది హైదరాబాద్. ఇటీవల మా ఇంటిపక్కనే ఓ కుటుంబం అద్దెకు వచ్చింది. ఆ భార్యాభర్తలిద్దరూ చాలా స్మార్ట్‌గా, చూడచక్కగా ఉన్నారు. అలా రోజులు గడిచేకొద్దీ ఆమె నాకు పరిచయమైంది. దీంతో ఆమె వచ్చేటప్పుడు.. వెళ్లేటప్పుడు నా కళ్లు ఆమెవైపు మళ్లసాగాయి. ఈ విషయాన్ని నా భార్య గుర్తించి.. ఆమెను ఎందుకు దొంగచూపులు చూస్తున్నారు.. నాలో ఏం తక్కువా అంటూ నన్ను నిలదీసింది. అదేసమయంలో పక్కింటావిడ కూడా నాపై ఫిర్యాదు చేసింది. దీంతో నా భార్య నాకు ప్రతి రోజూ క్లాస్ పీకుతోంది. ఆమెను మళ్లీ నాదారికి తెచ్చుకోవడమెలా?

జవాబు  :  అసలు పక్కింటావిడను మీరు ఏ ఉద్దేశ్యంతో చూశారో మీరే చెప్పాలి. అదేసమయంలో మీ భార్య అనుమానం పూర్తిగా తొలగిపోయాలంటే భార్యతో మరింత సన్నిహితంగా మెలగండి. పైగా ఆమె ప్రేమను పొందటం కోసం మరింత ప్రేమను చూపించండి. ఆమె తప్ప మరెవ్వరు మీ మనస్సులో లేరనే భావం ఆమెలో కలగించేలా ప్రయత్నించండి. అలాగే, పక్కింటావిడ మళ్లీ తప్పుడు ఆరోపణలు, ఫిర్యాదులు చేయకుండా జాగ్రత్త వహించండి. చాడీలు చెప్పే స్త్రీల పట్ల మరింత జాగ్రత్త వహించండి. ఆమెను వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు ఆమెను దొంగ చూపులు చూడకుండా జాగ్రత్త వహించండి.

154.శీఘ్రస్ఖలనంతో నిరుత్సాహరుస్తున్నాడు. ఏం చేయాలి?






ప్రశ్న  :  నాకు ఇటీవలే వివాహమైంది. నా భర్తకు సెక్స్ అంటేనే హైరానా పడిపోతున్నాడు. దీంతో శోభనం రోజు నుంచి ఇప్పటి వరకు ఒక్క రాత్రి కూడా సంతృప్తికరమైన భావప్రాప్తిని పొందలేదు. ఈ పరిస్థితి నాకే కాదు.. ఆయనకు కూడా ఉంది. హైరానా పడొద్దని ఎంత చెప్పినా ఆయన వినిపించుకోవడం లేదు. ఫలితంగా శీఘ్రస్ఖలనంతో నిరుత్సాహరుస్తున్నాడు. ఏం చేయాలి?


జవాబు  :  దాంపత్యం అనేది నెమ్మదిగా అనుభవిస్తూ ఆనందించవలసిన అంశం. అందుకే సెక్స్‌లో పాల్గొనే దంపతులకు హడావుడి పనికిరాదు. పడక గదిలో ఎంత ఎక్కువ సేపు సెక్స్‌లో పాల్గొంటే అంత ఆనందం పొందుతారు. అయితే, ఇందుకు అనువైన వాతావరణాన్ని కల్పించుకోవాల్సిన బాధ్యత మాత్రం భార్యాభర్తలపైనే వుంది. పడక గదిలో ప్రోత్సాహకరమైన వాతావరణం కల్పించుకోవడంతో పాటు... మానసిక సంసిద్ధత కూడా ఎంతో ముఖ్యం. అంటే మనస్సులో మొదలైన సెక్స్ కోరిక శరీరానికి వ్యాపించినపుడే సెక్స్ ఆనందం కలుగుతుంది.

అదేసమయంలో సెక్స్ పాల్గొనే దంపతులు మొబైల్ ఫోన్స్ వంటివి దూరంగా ఉంచుకోవడం మంచిది. ఇలాగే, ఇతర ఆలోచనలన్నీ పక్కనబెట్టి, కేవలం సంభోగంపైనే మనస్సు లగ్నం చేయండి.. ముద్దూముచ్చట్లు, స్పర్శలు, కౌగిలింతలు, ఇతరాత్రా చిలిపి చేష్టలతో ఇద్దరూ కామోద్రేకం పొంది ఆ తర్వాత అసలు కార్యక్రమానికి పూనుకున్నట్టుయతే నిజమైన సెక్స్ అనుభూతిని ఆశ్వాదిస్తారని సెక్స్ నిపుణులు చెపుతున్నారు.

153. అసలు ఆమెకు రతి కంటే మిగిలిన వాటిలో ఎందుకు అంత తృప్తి కలుగుతోంది. కారణం ఏమిటి...?






ప్రశ్న  :  నా భార్యకు 24 ఏళ్లు. నాకు 26 ఏళ్లు. ఈమధ్యనే పెళ్లయింది. ఆమెకు రతి కంటే ఫోర్ ప్లే పట్ల చాలా ఇష్టం చూపిస్తోంది. ఫింగరింగ్ చేస్తుంటే పరవశిస్తుంది. యోని చూషణ చేస్తుంటే విపరీతమైన తృప్తి చెంది కళ్ల వెంట నీళ్లు పెట్టుకుంటుంది. ఇవన్నీ ముగిశాక అంగ ప్రవేశం చేసి సెక్స్ చేస్తుంటే ఎలాంటి స్పందన లేకుండా ఉంటుంది. వీర్యాన్ని స్ఖలించేటపుడు నేను చెప్పలేనంత తృప్తి చెందుతుంటే ఆమె ఏదో ధ్యాసలో ఉంటుంది. అసలు ఆమెకు రతి కంటే మిగిలిన వాటిలో ఎందుకు అంత తృప్తి కలుగుతోంది. కారణం ఏమిటి...?

జవాబు   :  సెక్స్ అనేది శారీరకమైనదే అయినప్పటికీ మనసుకు సంబంధినది కూడా. ఫోర్ ప్లేలో ఫింగరింగ్, ఓరల్ సెక్సులో యోని చూషణ సమయంలో కామవాంఛను ఉత్తేజింపచేసే నాడులకు ప్రేరణ కలుగుతోంది. అందువల్ల ఆమె బాగా తృప్తి చెందుతోంది. కానీ సెక్సు విషయానికి వచ్చేసరికి కేవలం అంగప్రవేశం చేసి వీర్యాన్ని స్ఖలిస్తే అయిపోదు. మధ్యలో ఆమెకు ఇష్టమైన పనులు ఏమిటో చేస్తూ ఉంటే తప్పక క్లైమాక్సుకు చేరేటపుడు మీరు అనుకునే భావప్రాప్తిని చూడవచ్చు. అంతేతప్ప అదేమీ సమస్య కాదు.

152.పెళ్లి చేసుకుందామంటే ఆమె నాకంటె రెండేళ్లు పెద్దది. ఈ స్థితిలో నాకు దారేమిటో తోచడంలేదు...?






ప్రశ్న  :  మాది సంపన్నుల కుటుంబం. ఆరు నెలల క్రితం మా పెదనాన్న కొడుకు ఓ సంబంధాన్ని చూద్దామని నన్ను కూడా తీసుకెళ్లాడు. కానీ ఎందుకో ఆ అమ్మాయిని చేసుకోనని చెప్పేశాడు. కానీ ఆమె నాకు బాగా నచ్చింది. కాకపోతే నాకంటే రెండేళ్లు పెద్దది. ఐనప్పటికీ ఆమె నాకు నచ్చడంతో ఫోన్ నెంబరు తీసుకున్నాను. ఆ తర్వాత ఆమెతో ఫోను సంభాషణ చేస్తూ స్నేహాన్ని పెంచుకున్నాను. ఆమె కూడా నేనంటే ఎంతో ఇష్టంగా ఉండేది. ఒక్కరోజు ఫోన్ చేయకపోయినా విపరీతంగా బాధపడేది. ఒకరోజు మేమిద్దరం ఏకాంతంగా ఉండే అవకాశం వచ్చింది. ఆ సమయంలో ఆమె-నేను లైంగికంగా ఒకటయ్యాం.


తనకు ఎంతో తృప్తి కలిగిందని చెప్పింది. ఆ తర్వాత అలా నాలుగైదు సార్లు పాల్గొన్నాం. ఇదిలావుంటే హఠాత్తుగా నా పెదనాన్న కుమారుడు ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని మొదటికొచ్చాడు. మా ఇద్దరి వ్యవహారం తెలియని పెద్దలు కూడా వారి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈ విషయంపై ఆమెను అడిగితే తను నిస్సహాయరాలినని అంటోంది. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియడంలేదు. పెళ్లి చేసుకుందామంటే ఆమె నాకంటె రెండేళ్లు పెద్దది. ఈ స్థితిలో నాకు దారేమిటో తోచడంలేదు...?

జవాబు  :  మీ ఇద్దరూ పరస్పర ఆకర్షణకు లోనై లైంగికంగా దగ్గరయ్యారు. పెళ్లికి ముందు లైంగికంగా దగ్గరవ్వడం అనర్థాలకు దారితీస్తుందని తెలిసినా చాలామంది ఇలాంటి తప్పులే చేస్తుంటారు. ఈ సమస్యకు పరిష్కార మార్గం, జరిగిన విషయాన్ని మీ పెదనాన్న కుమారుడికి చెప్పేసి, ఆ అమ్మాయిని మీరు పెళ్లి చేసుకోవడం ఒక్కటే. రెండుమూడేళ్లు వయసు తేడా ఉన్నా... అదేమీ పట్టింపు కాదు.

151.నా స్నేహితుడి భార్య నాతో పిల్లలు కంటానంటోంది...ఏం చేయాలో పాలుపోవడంలేదు...






ప్రశ్న  :  మేమిద్దరం చిన్ననాటి స్నేహితుల. నాకు పెళ్లయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. నా స్నేహితుడికి కూడా 4 ఏళ్ల కిందటే పెళ్లయింది. ఐతే వారికి పిల్లలు పుట్టలేదు. దీంతో అతడు తన భార్యను డాక్టర్ వద్ద చెక్ చేయించాడు. ఆమెకు ఎలాంటి లోపం లేదని తేలింది. దాంతో నా స్నేహితుడిలోనే లోపం ఉందని అర్థమయింది. వాడిని టెస్ట్ చేయించుకోమంటే వినడంలేదు.

ఈమధ్య నా స్నేహితుడు - అతడి భార్య ఇద్దరూ పిల్లల పుట్టకపోవడం విషయంపై నా సమక్షంలోనే కీచులాడుకున్నారు. నేనే సర్ది చెప్పాను. ఆ తర్వాత వాడు ఆఫీసుకి వెళ్లిపోయాడు. వాడు వెళ్లిపోయిన తర్వాత నా స్నేహితుని భార్య భోరున విలపించింది. తనను గొడ్రాలని అందరూ అంటున్నారని వెక్కివెక్కి ఏడ్చింది.

నేను ఆమెను దగ్గరకు తీసుకుని ఓదార్చాను. అంతే, ఆమె నన్ను గట్టిగా కౌగలించుకుంది. తనతో రతిలో పాల్గొని పిల్లలు కలిగేలా సహాయం చేయాలని అర్థించింది. ఆమె పరిస్థితి చూసి ఆ క్షణంలో ఆమెతో సెక్సులో పాల్గొన్నాను. ఇద్దరం సెక్సులో బాగా ఎంజాయ్ చేశాము. ఇక అప్పట్నుంచి రోజూ నా స్నేహితుడు ఆఫీసుకు వెళ్లగానే సెక్స్ చేయించుకుంటుంది. ఇప్పుడు నాకు కొత్త భయం పట్టుకుంది.

నా కారణంగా ఆమె గర్భవతి అయితే అది నా స్నేహితుడికి తెలిస్తే ఏమవుతుందోనని భయంగా ఉంది. అంతేకాదు, ఈ విషయం నా భార్యకు తెలిస్తే... అనే ఊహ చాలా భయాన్ని కల్గిస్తోంది. ఆమె మాత్రం నన్ను వదలటం లేదు. రోజూ సెక్స్ కావాలని ఫోన్ల మీద ఫోన్లు చేస్తోంది. ఏం చేయాలో పాలుపోవడంలేదు...


జవాబు  :  స్నేహితుడుకి సాయం చేయాల్సింది ద్రోహం చేస్తున్నారు. అతడి భార్య పిల్లలు లేరన్న ఆవేదన, దుఃఖంలో సెక్స్ కావాలని అడిగి ఉండవచ్చు. అంతమాత్రం చేత ఆమెతో రతిలో పాల్గొనడం భావ్యం కాదు. స్నేహితుడిని వైద్యుని వద్దకు తీసుకెళ్లి అతడి వీర్యంలో ఉండాల్సిన సంఖ్యలో వీర్యకణాలు ఉన్నాయా లేదా అని చెక్ చేయించి వారిద్దరికీ పిల్లలు పుట్టేట్లు చేయాల్సిన బాధ్యత మీది. అలాంటిది స్నేహితుని భార్యతో సెక్సులో ఒక్కసారి కాదు రోజూ పాల్గొంటున్నారు.

ఒకవేళ ఆమె గర్భం ధరిస్తే ఆ బిడ్డకు తండ్రి మీరే అవుతారు. తప్పించుకునేందుకు ప్రయత్నించినా సాధ్యం కాదు. డీఎన్ఎ పరీక్ష ద్వారా నిరూపిస్తారు. అంతేకాదు, ఒకవేళ అదే జరిగితే మీ భార్యాపిల్లల పరిస్థితి ఏమిటి..? మీ భార్య మిమ్మల్ని ఉపేక్షిస్తుందా...? మీ స్నేహితుడి భార్య పట్ల మీరు చూపిస్తున్న చర్య ఇద్దరి కుటుంబాలను సమస్యల సుడిగుండంలోకి నెడుతుంది. కనుక తక్షణమే ఆమెతో సెక్స్ సంబంధాన్ని ఆపేసి స్నేహితుడి ఆరోగ్యాన్ని చెక్ చేయించి సహాయపడండి.

150.పెళ్లి కాక ముందే సెక్స్ కావాలంటున్నాడు... గర్భం రాకుండా ఎలా..?





ప్రశ్న  :  వచ్చే ఏడాది పెళ్లాడబోతున్నాం. కానీ అంతవరకూ సెక్స్ చేయకుండా ఉండలేనని నా బోయ్ ఫ్రెండ్ అంటున్నాడు. ఒక్కసారి సెక్సులో పాల్గొందామని అడుగుతున్నాడు. ఇప్పటికే చాలాసార్లు కాదన్నాను కానీ ఇక కాదనలేని పరిస్థితి. సెక్సులో పాల్గొన్నా గర్భం రాకుండా ఉండే పద్ధతులు ఏమిటి...?

జవాబు  :  కండోమ్ సక్రమంగా వాడితే క్షేమమే. అంగప్రవేశానికి ముందు కండోమ్ ధరించాలి. ఒకవేళ కండోమ్ చిరిగిపోతే తర్వాత తీసుకోవాల్సిన అత్యవసర గర్భ నిరోధక చర్యలను చేపట్టాల్సి ఉంటుంది. దీనిలో హార్మోన్ల మాత్రలు వేసుకోవాల్సి ఉంటుంది.

ఈ మాత్రలను మొదటి డోస్ సెక్సులో పాల్గొన్న 72 గంటల లోపు తీసుకోవాలి. తొలి డోసు తీసుకున్న 12 గంటలకు రెండవ డోసు తీసుకోవాలి. సెక్సులో పాల్గొన్న తర్వాత ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా డోస్ తీసుకోవడం మంచిది.

ఇలా తీసుకోవడం వల్ల అండం విడుదల, ఫలదీకరణ వంటివి నిరోధించబడతాయి. ఫలదీకరణం చెందినా ఆ బీజాన్ని స్థిరపడకుండా చేస్తాయి. ఈ మాత్రలలో వైఫల్య శాతం 2 నుండి 3 శాతం మాత్రమే. సెక్సులో సుఖం పొందాలంటే మానసికంగా ఏ అలజడి ఉండకూడదు. ఐతే పెళ్లి కాకుండా సెక్స్ సంబంధాలు మంచిది కాదని గమనించండి. ఇన్నేళ్లు ఆగినవారు మరో ఏడాది కాలంపాటు ఆగలేరా... అలా అని కన్విన్స్ చేయండి. పెళ్లయిన తర్వాత దాంపత్య సుఖాన్ని అనుభవించడం ఇద్దరికీ మేలు.

149.ఆమెను చూస్తుంటే నాలో సెక్స్ కోర్కెలు విపరీతంగా కలుగుతున్నాయి. ...మానుకోవడం ఎలా?





ప్రశ్న  :  మా ఎదురింట్లో అందమైన ఆంటీ ఉంది. ఆమె చాలా అందంగా ఉంటారు. కానీ ఆమెను చూస్తుంటే నాలో సెక్స్ కోర్కెలు విపరీతంగా కలుగుతున్నాయి. ఎంత కంట్రోల్ చేసుకుందామని అనుకుంటున్నా వల్లకావడం లేదు. నిగ్రహించుకోలేకపోతున్నాను. దీంతో హెచ్.పి(హస్తప్రయోగం) చేస్కుంటున్నాను. ఇలా చేసుకుంటే అంగం క్షీణించిపోతుందని నా స్నేహితుడు అంటున్నాడు. ఈ హస్త ప్రయోగం అలవాటును మానుకోలేకపోతున్నాను. దీనికి అడ్డుకట్ట వేయలేకపోతున్నాను. కంట్రోల్ చేయడం ఎలా...?


జవాబు  :  ఈ చర్య ఒక మనోలైంగిక వ్యాధిగా పేర్కొంటున్నారు. లైంగిక అవయవాలను ఇతరులకు చూపించడం, వారిని చూస్తూ హస్త ప్రయోగం చేసుకోవడం అనేది ఎక్జిబిషనిజమ్ అనే డెవియేటెడ్ సెక్స్‌కి సంబంధించిందని చెపుతున్నారు.

ఆత్మనూన్యతకు లోనైన వారు, ఆత్మవిశ్వాసం కోల్పోయిన వారు, బాల్యంలో లైంగిక అత్యాచారాలకు గురైన వారు, అణచుకోలేని తీవ్ర లైంగికవాంఛ ఉన్నవారు, వికృత లైంగిక చర్యలతో ఎదుటివారి దృష్టిని ఆకర్షించేందుకు చేసే చర్యలే ఇవి అని చెపుతున్నారు. దీనివల్ల వారు ప్రత్యక్షంగా శృంగారంలో పాల్గొన్న దానికంటే ఎక్కువ ఆనందాన్ని పొందుతారని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.

అయితే, ఇది కేవలం మనోలైంగిక వ్యాధి మాత్రమే కాదనీ, మన వ్యవస్థలో ఉన్న అనేక అపసవ్యతల నుంచి, స్త్రీలపట్ల ఉండే చులకన పురుషులకు, వారొక లైంగిక వస్తువులన్న భావజాలం నుంచి ఉద్భవించిన తీవ్రమైన సామాజిక సమస్యగా పేర్కొంటున్నారు. కనుక ఎదురింటి ఆంటీని చూస్తూ అతిగా హస్త ప్రయోగం చేస్కుంటూ సమయాన్ని వృధా చేయకుండా చదువు, కెరీర్... తదితర అంశాలపైన దృష్టి కేంద్రీకరించండి. అలా చేస్తే మీలో ఉన్న ఆ అలవాటు క్రమంగా పోయి తిరిగి మామూలు స్థితికి వచ్చేస్తారు.

148.నాకు ఒక చెడ్డ అలవాటు ఉంది... ఆడవాళ్లను చూస్తే....





ప్రశ్న  :  నా వయసు 27 సంవత్సరాలు. నాకు ఓ చెడ్డ అలవాటు ఉంది. నా చుట్టూ ఎవరైనా స్త్రీలు, అమ్మాయిలు కనపడితే వారి పట్ల సెక్స్ కోర్కెలు కలుగుతాయి. ఆ సమయంలో అంగం స్తంభిస్తుంది. హస్త ప్రయోగం చేస్కుంటూ వారికి చూపించాలనిపిస్తుంది. నాకిది తప్పు అని తెలిసినా మానుకోలేకపోతున్నాను. ఫ్రెండ్స్‌తో బయటకెళ్తే సరిపోతుందనుకుంటాను కాని ఒక్క రోజయినా ఇలాంటివి చేయాలనిపిస్తుంటుంది. నా ఈ పరిస్థితి నుండి బయట పడేదెలా...?


జవాబు  :  చెడ్డ అలవాటు అని మీరే చెపుతున్నారు. కాబట్టి అందులో ఎలాంటి సందేహం లేదు. యుక్త వయసులో సెక్స్ కోర్కెలు కలుగడం సహజమే కానీ... ఇలా అసహజమైన రీతిలో బహిరంగ ప్రదేశాల్లో అంగ ప్రదర్శన అనేది అసహజమైన పరిస్థితి. ఈ స్థితి నుంచి బయటకు రాలేకపోతుంటే మానసిక వైద్యుడిని సంప్రదించాల్సిందే. వారు తగు వైద్య చికిత్స అందిస్తారు.

147. నాకేమో అతడితో కౌగిలి, అతనే గుర్తుకు వస్తున్నాడు. ఏం చేయాలో తెలియడంలేదు..






ప్రశ్న  :  ఏడాది క్రితం మా ఆఫీసులో ఒకతను చేరాడు. అతడిని చూడగానే ఎందుకో తెలియని ఆకర్షణకు లోనయ్యాను. అతడు కూడా నేనంటే ఎంతగానో ఇష్టాన్ని ప్రదర్శించేవాడు. మొదటిరోజే చాలా దగ్గరగా మాట్లాడుకున్నాము. ఐతే మా ఇద్దరికీ అంతకుముందే పెళ్లిళ్లయ్యాయి. మా ఇద్దరి మధ్య తలెత్తిన ఈ ఆకర్షణ ప్రమాదమని తెలిసినప్పటికీ ఉండలేకపోయాము.

ఓరోజు అతడు నన్ను కౌగలించుకోవాలని ఉందని అడిగాడు. నేను అతడి అభ్యర్థనకు సరేనన్నాను. దాంతో 15 నిమిషాల పాటు గట్టిగా కౌగలించుకున్నాడు. అలా కౌగలించుకున్న దగ్గర్నుంచి అతిడికి ఏమైందో తెలియదు కానీ నన్ను పట్టించుకోవడం మానేశాడు. నాతో మాట్లాడటం లేదు. నాకేమో అతడితో కౌగిలి, అతనే గుర్తుకు వస్తున్నాడు. ఏం చేయాలో తెలియడంలేదు..
జవాబు  :   అతడు కౌగిలించుకోవడంతో మీ మీద ఉన్న ప్రేమ తగ్గిపోవడమో, మిమ్మల్ని పట్టించుకోవడమో కాదు... ఇప్పటికే వివాహమైన అతడికి తన వైవాహిక జీవితం, కొత్త కౌగిలితో వచ్చే ఇబ్బందులు కళ్ల ముందు కదలాడి ఉంటాయి. దాంతో అతడు దూరంగా జరుగుతూ తప్పించుకుని తిరుగుతున్నాడు.

వివాహేతర సంబంధాలు ఎప్పటికైనా ప్రమాదకరమన్న సంగతి గ్రహించాలి. ఆయన కూడా ఇదే తెలుసుకుని ఉంటాడు. అందువల్లనే ఆ ఆకర్షణ నుంచి బయటపడి మామూలు లోకంలోకి వచ్చాడు. ఇద్దరూ ఆ ఆకర్షణల నుంచి బయటకు రావడం ఇరు కుటుంబాలకు మంచిదన్నది గ్రహించండి.

146.వక్షోజాలను ఇక చూసే అవకాశం ఉండదేమోనని బాధగా ఉంటోంది......





ప్రశ్న  :  మా పెళ్లయి ఏడాది దాటింది. నాకు నా భార్య అందమైన ఎద సంపద అంటే చెప్పలేనంత ఇష్టం. ఆ వక్షోజాలను తాకాలని, ముద్దాడాలని చూషించాలని ఉంటుంది. కానీ ఆమె అందుకు ససేమిరా అంటోంది. కనీసం జాకెట్ హుక్స్ కూడా తీయడంలేదు. అక్కడ టచ్ చేస్తే కోపంతో నా ముఖాన్ని నెట్టివేస్తోంది. కనీసం దొంగచాటుగా కూడా చూసే అవకాశం రావడంలేదు. ఏం చేయాలో అర్థం కావడంలేదు.ఆమె వక్షోజాలను ఇక చూసే అవకాశం ఉండదేమోనని బాధగా ఉంటోంది... ఆమెలో మార్పు రాదా... నా కోరిక తీరే అవకాశం లేదా...?

జవాబు  :  కొంతమంది యువతులు తమ వ్యక్తిగత భాగాల గురించి చాలా స్ట్రిక్టుగా ఉంటారు. పెళ్లయినప్పటికీ భర్తను కూడా వాటిని తాకేందుకు ఇష్టపడరు. మీ భార్య సైకలాజీ కూడా దాదాపు అలాగే ఉన్నట్లు కనబడుతుంది. ఇటువంటి వ్యక్తిత్వం ఉన్నవారు కనీసం ఫోర్ ప్లే కూడా ఇష్టపడరు. సెక్సులో సుఖం అనుభవించకపోయినా ఫర్వాలేదనుకుంటారు. దీనికి కారణాలు చాలానే ఉంటాయి. కొందరు తమ అందం తగ్గిపోతుందని అనుకుంటే మరికొందరు తమ అందాలను చూస్తే భర్త ఎలా ఫీలవుతారోనని అనుకుంటారు. ఇంకొందరు అసలు ఇలాంటి చర్యలంటేనే అసహ్యించుకుంటారు.

కాబట్టి అటువంటి వారి విషయంలో కొద్దిగా ఓర్పు అవసరం. ముందుగా శృంగార సంభాషణతో వారి మనసును మార్చాలి. మెల్లగా ముద్దులు, కౌగలింతల రుచి చూపించాలి. అలా చేస్తూ ఉంటే ఏదో ఒకరోజు మీరు కోరుకుంటున్న కోరిక తీరే అవకాశం ఉంటుంది. ఓపిగ్గా ఎదురుచూడండి. అలాగే ప్రయత్నం కూడా చేస్తూ ఉండండి.

145.ఎంత ప్రయత్నించినా వెళ్లడంలేదు... బిగుతుగా ఉంది, వెడల్పు చేయడం ఎలా...?




ప్రశ్న   :  నా భార్య యోని చాలా బిగుతుగా ఉంది. ఎన్నిమార్లు ట్రై చేసినా ఇదే పరిస్థితి. విసుగెత్తి చాలాసార్లు సెక్స్ చేయడం మానుకున్నాను. వివిధ భంగిమల్లో చేసేందుకు రకరకాలుగా ప్రయత్నించాను. ఫోర్ ప్లే చేసినా ఫలితం ఉండటం లేదు. నా పురుషాంగం సైజు 6 అంగుళాలు ఉంది. అందుకనే వెళ్లడంలేదా...? ఆమె యోని సైజును పెద్దది చేయడం ఎలా...?

జవాబు :  యోని బిగుతుగా ఉండి అంగ ప్రవేశానికి కష్టంగా మారడం వెనుక పలు కారణాలు ఉంటాయి. ఆమెకు సెక్స్ ఇష్టం లేకపోవడమో లేదంటే సెక్స్ అంటే భయమో... అయి ఉండవచ్చు. ఇవేవీ కారణం కానట్లయితే చాలా అరుదుగా కొందరిలో కన్నెపొర మరీ దళసరిగా ఉండటంతో సెక్స్ సాధ్యం కాకుండా ఉంటుంది. కాబట్టి ముందుగా ఆమెలో సెక్స్ పట్ల ఏమైనా అపోహలున్నాయేమో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కూడా సాధ్యం కానట్లయితే గైనకాలజిస్టును సంప్రదిస్తే తగు చికిత్స చేస్తారు.