Wednesday 12 November 2014

85.నా భార్య రోజుకో భంగిమలో సెక్స్ కావాలంటోంది.. ఎందుకని?




ప్రశ్న :   నాది గుంటూరు. ఇటీవలే వివాహమైంది. నా భార్య హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజనీర్‌గా పని చేస్తోంది. శోభనం రోజు నుంచి ఇప్పటి వరకు ప్రతి రోజూ సెక్స్ కావాలంటోంది. అదీ కూడా రోజుకో భంగిమలో చేయమని అడుగుతోంది. ఇలా ఎందుకు కోరుతుందే అర్థం కావడం లేదు. పెళ్లికి ముందే ఆమెకు సెక్స్‌లో అనుభవం ఉందా అనే సందేహం కలగడమే కాకుండా, నేను ఆమెను సంతృప్తి పరచలేక పోతున్నానేమోనని అనుమానం కలుగుతోంది. సలహా ఇవ్వండి.

జవాబు :   మీరు సంతృప్తి పరచకుంటే ఆమె మిమ్మలను ప్రతిరోజూ ఓ కొత్త భంగిమలో సెక్స్ చేయమని కోరదు. మీరు ఆమెను పూర్తిగా సంతృప్తి పరచడం కోరుతోంది. అయితే, రోజుకో కొత్త భంగిమలో సెక్స్ చేసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. ఇందుకోసం వాత్సాయన కామసూత్రలో అనేక భంగిమలు ఉన్నాయి. ఆ భంగిమల్లో రొజుకొకటి చొప్పున చేస్తూ మీ జీవితాన్ని ఎంజాయ్ చేయండి.

84.నా భర్తకు కోర్కెలు ఎక్కువ కానీ పడక గదిలో అంగం గట్టిపడదు ఎందుకని?





ప్రశ్న :   మాది శ్రీకాకుళం. మూడు నెలల క్రితం వివాహమైంది. శోభనం రోజున తూతూమంత్రంగా కార్యం ముగించాడు. ఆ తర్వాత కూడా నాకు సంతృప్తి కలిగేలా ఏనాడూ సెక్స్ చేసిన సందర్భాలు లేవు. నిజానికి మావారితో పాటు... నాకు కూడా సెక్స్ కోర్కెలు ఎక్కువే. కానీ, నా భర్తకు పడక గదిలో మాత్రం అంగం గట్టిపడదు. దీంతో చాలా సమయం ఫోర్‌ప్లే చేయాల్సి వస్తోంది. చివరకు గట్టిపడినా.. యోనిలో పెట్టే సమయంలో మళ్లీ మెత్తబడిపోతోంది. ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదు. దీనివల్ల ప్రతి రోజూ రాత్రి నిరాశతో గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏం చేయాలి?

జవాబు :  వివాహమైన కొత్తల్లో చాలా మంది భర్తల్లో ఆందోళన నెలకొనివుంటుంది. భార్యను పడక గదిలో సంతృప్తి పరచగలనా లేదా అనే సందేహం వారిని పట్టిపీడిస్తూ ఉంటుంది. మనస్సులో ఇలాంటి ఆలోచన ఉన్నవారికి అంగం గట్టిపడటం చాలా కష్టం. ఒకవేళ బలవంతంగా గట్టిపడేలా చేసుకున్నా అంగ ప్రవేశం సమయంలో మళ్లీ మామూలుగానే ఉంటుంది. మరికొందరికి కండోమ్ ధరించి సెక్స్ చేసేందుకు అయిష్టత చూపుతారు. ఇలాంటి వారికి కూడా అంగం గట్టిపడదు. అందువల్లే ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుంటారు.

ఇకపోతే.. సాధారణంగా బీపీ, గుండెజబ్బులు ఉన్నవారు మందులు వాడుతూ సెక్స్‌లో పాల్గొనవచ్చని సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా రక్తప్రసరణ వేగం పెంచి గుండెకు అధిక భారాన్ని పెంచే మందులు వాడటం మేలని సూచన చేస్తున్నారు. మానసిక వ్యథ మూలంగా కలిగే ఒత్తిడి కూడా రక్తప్రసరణ వేగం పెంచే మందులను వాడాలని కోరుతున్నారు.

ప్రధానంగా మందుల కన్నా కూడా రిలాక్సేషన్‌ టెక్నిక్స్‌ ప్రాక్టీస్‌ చేయాలని సూచిస్తున్నారు. ఆందోళనపడుతూ సెక్స్‌లో ఉపక్రమించడం కంటే.. మిన్నకుండి పోవడం మంచిదంటున్నారు. భార్య వద్ద ఏమాత్రం బిడియం, సిగ్గు, సంకోచం లేకుండా ప్రవర్తిస్తూ తమ లైంగిక కోర్కెలను తీర్చుకోవచ్చని వైద్యులు సలహా ఇస్తున్నారు. వైద్యుల సలహా మేరకు సెక్స్‌లో పాల్గొనవచ్చని చెపుతున్నారు.

83.నా భార్యను ఓరల్ సెక్స్ చేయమంటే మహాపాపం అంటోంది.. ఏం చేయాలి?



ప్రశ్న :  కొత్తగా వివాహమైంది. శోభనం రోజు నుంచి ఇప్పటి వరకు సెక్స్‌లో బాగానే పాల్గొంటున్నాం. అయితే, నాకు నా భార్యతో ఓరల్ సెక్స్ చేయించుకోవాలని ఆశగా ఉంది. అలాగే, నేను కూడా ఆమెకు చేస్తూ ఎంజాయ్ చేయాలన్నది బలమైన కోరిక. ఇదే విషయాన్ని నా భార్యకు చెప్పాను. ఆమె మాత్రం అందుకు సమ్మతించడం లేదు. ఎవరో ఆమె ఫ్రెండ్ చెప్పిందట. ఓరల్ సెక్స్ చేయడం మహా పాపమని. అలా చేసే వాళ్లు చనిపోయిన తర్వాత నరకానికి పోతారని. దీంతో ఆమెను ఎంతగా బ్రతిమిలాడుతున్నా నా కోర్కెను తీర్చడం లేదు. ఏం చేయాలి?

జవాబు :   శృంగార పద్ధతుల్లో ఓరల్ సెక్స్ అనేది ఒక భాగం. అనేక వేల సంవత్సరాల నుంచి అనేక సంస్కృతుల వారు ఓరల్ సెక్స్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. అనుభవిస్తూ ఆనందపడుతున్నారు. వాత్సాయన కామసూత్రంలో ఓరల్ సెక్స్‌ గురించిన ప్రస్తావన వుంది. అయితే, కొన్ని మతాలవారు... మూఢ నమ్మకాలు ఎక్కువగా ఉండేవారు మాత్రం ఓరల్ సెక్స్  చేసేందుకు ఇష్టపడరు. మీ భార్యకు మూఢనమ్మకాలపై అధిక విశ్వాసం ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఈ తరహా సెక్స్‌లో పాల్గొనేందుకు ఇష్టపడటం లేదు. మీ నుంచి తప్పించుకునేందుకే ఆమె ఆ తరహా సమాధానాలు చెపుతున్నట్టుగా తెలుస్తోంది.

82.బిడ్డ పుట్టాక కూడా ఆయన నా వక్షోజాలను.... బిడ్డకేమైనా హాని కలుగుతుందా...?




ప్రశ్న :  నా భర్తకు వక్షోజాలను చూషించడం అంటే చాలా ఇష్టం. పెళ్లయిన దగ్గర్నుంచి వక్షోజాలను చూషించిన తర్వాతే సెక్స్ చేసేవారు. ఐతే నాకు 4 నెలల క్రితం బిడ్డ పుట్టింది. ఈమధ్యనే మా అమ్మవారి ఇంటి నుంచి ఇక్కడికి వచ్చాను. ఆయన ఇంతకుముందులానే సెక్స్ చేసేముందు వక్షోజాలను చూషించడం కాదు కానీ, వక్షోజాలను గట్టిగా ఒత్తుతున్నారు. ఇలా చేస్తూ సెక్స్ చేస్తున్నారు. దీనివల్ల బిడ్డ ఆరోగ్యానికేమైనా హాని కలుగుతుందా...?

జవాబు :  స్త్రీ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత చాలామంది పురుషులు ఎక్కువగా తమ ముద్దుల పాపాయితో ఆటాపాటలకు సమయం వెచ్చిస్తారు. అలాగే సెక్స్ విషయంలో కూడా బిడ్డ పుట్టకు ముందు కంటే బిడ్డ తల్లిగా ఉన్న సమయంలో స్త్రీతో సెక్సులో పాల్గొనడం తగ్గుతుంది. ఐతే కొందరు మాత్రం యధావిధిగా సెక్స్ సుఖాన్ని చవిచూస్తుంటారు.

వక్షోజాలను చూషించడం, ఒత్తడం వంటివన్నీ సెక్సులో భాగమే. వక్షోజాలను ఒత్తడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఎదురవదు కానీ, వక్షోజాలను చూషిస్తే... బిడ్డకు పాలిచ్చేటపుడు వారికి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదముంది. కాబట్టి వక్షోజాలను చూషించడం ఆపేయాలంటారు వైద్యులు.

81.ఇప్పుడు ఇతడిని పెళ్లాడితే నేను దాంపత్య సుఖాన్ని ఎంజాయ్ చేయలేనేమోనని భయంగా ఉంది...





ప్రశ్న :   మేమిద్దరం గత ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. అతడికి ఉద్యోగం రాగానే పెళ్లాడాలని నిర్ణయించుకున్నాం. కానీ గత ఆరేడు నెలలుగా అతడు లావయిపోతున్నాడు. బాడీ తగ్గించుకునేందుకు ప్రయత్నించమంటే వినడంలేదు. నా స్నేహితురాలు ఒకామె... లావుగా ఉన్నవారు సెక్సులో పనికిరారనీ, అలసిపోతారని చెపుతోంది. అంతేకాదు పిల్లలు కూడా కలిగే అవకాశాలు తక్కువగా ఉంటాయని అంటోంది. ఇప్పుడు ఇతడిని పెళ్లాడితే నేను దాంపత్య సుఖాన్ని ఎంజాయ్ చేయలేనేమోనని భయంగా ఉంది...

జవాబు :   మితిమీరిన ఒళ్లు సెక్స్ జీవితంపై ప్రభావం చూపే మాట నిజమే. లావుగా ఉన్నవారిలో శృంగార జీవితం ఒకింత నిస్సారంగా మారుతుంది. ఐతే మీ ప్రేమికుడు స్థూలకాయుడుగా ఉన్నాడో లేదో బీఎమ్ఐ ద్వారా చెక్ చేసుకోవచ్చు. స్థూల లేదా భారీకాయం సెక్సు జీవితానికే కాదు అది పలు ఆనారోగ్యాలకు దారి తీస్తుంది. కాబట్టి అతడు క్రమం తప్పకుండా రోజూ వ్యాయామం చేయాలి. ఎత్తుకు తగిన బరువు ఉండేదాకా తప్పక ప్రయత్నం చేయాల్సిందే. వళ్లు పెంచుకుంటే అనారోగ్యాన్ని కొనితెచ్చుకున్నట్లే. ఇక సంతాన ప్రాప్తి అనేది వీర్య కణాల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది కానీ, భారీకాయంపై కాదు.

80.స్ట్రోక్స్ ఇస్తుంటే నా యోనిలో ఏవో శబ్దాలు వస్తున్నాయి. ఎందుకని?




ప్రశ్న :   మాది విజయనగరం. వివాహమై ఆర్నెల్లు అయింది. నేను, నా భర్త సెక్స్‌లో పాల్గొన్నపుడు ఆయన స్ట్రోక్స్ ఇస్తుంటే నా యోని నుంచి ఏవేవో శబ్దాలు వస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఇలా ఎందుకు వస్తున్నాయి. ఆ శబ్దాలను ఆపేదెలా? సలహా ఇవ్వరు.

జవాబు :  సాధారణంగా ప్రతి మహిళ యోనిలో నుంచి ఈ తరహా శబ్దాలు వస్తుంటాయి. దీనికి కారణం పురుషాంగం యోనిలోకి ప్రవేశపెట్టి స్ట్రోక్స్ ఇస్తుంటే యోనిలో గాలి చేరుతుంది. ఈ గాలి స్ట్రోక్స్ ఇస్తుంటే బయటకు వస్తుంది. స్త్రీలో కోర్కె తారా స్థాయికి చేరినపుడు యోని రంధ్ర మరింత పెద్దగా మారుతుంది. దీనికి తోడు యోనిలో ద్రవాలు ఊరతాయి. గాలి చేరుతుంది.

యోనిలోకి ప్రవేశించిన పురుషాంగం.. కదులుతున్నపుడు యోనిలో ఉత్పత్తి అయిన జిగట ద్రవాలను తప్పించుకుని గాలి ఓ రకమైన శబ్దంతో బయటకు వస్తుంది. ఈ శబ్దాలు పోయేందుకు సెక్స్ భంగిమను మార్చుకుని రతిలో పాల్గొన్నట్టయితే దానికి చెక్ పెట్టొచ్చు. అంతకుమించి భయపడాల్సిందేమీ లేదు.

79.ఇపుడు తన బోయ్ ఫ్రెండుతో తనకు కూడా ఎంజాయ్ చేయాలని .......




ప్రశ్న :   మా ఇద్దరికి పెళ్లై ఏడాది దాటింది. ఇటీవల గోవా వెళ్లాం. అక్కడ మా గత జీవితాలను చర్చించుకున్నాం. తనకు ఓ బోయ్ ఫ్రెండ్ ఉండేవాడట. నాక్కూడా ఓ ప్రేయసి ఉన్నదని చెప్పాను. దాంతో కావాలనుకుంటే ఆమెను పిలిపించి ఆమెతో సెక్స్ ఎంజాయ్ చేయమంది. ఇంటికి తిరిగి వచ్చాక నా మాజీ ప్రేయసికి ఫోన్ చేసి రమ్మని చెప్పింది.

ఆమె రాగానే తనకు తన పిన్ని ఇంట్లో పని ఉందని చెప్పి వెళ్లిపోయింది. ఆరోజు నా మాజీ ప్రేయసి నేను సెక్స్ ఎంజాయ్ చేశాము. మరుసటిరోజు ఉదయం ఆమె వెళ్లిపోయిన తర్వాత నా భార్య తిరిగి వచ్చింది. ఇపుడు తన బోయ్ ఫ్రెండుతో తనకు కూడా ఎంజాయ్ చేయాలని ఉందట. అతడిని పిలువమని అంటోంది. నాకు మైండ్ పోతోంది.. ఏం చేయాలో అర్థం కావడంలేదు...

జవాబు :  ఇలాంటి వివాహేతర సంబంధాలు అందరికి ఇబ్బందులు తెస్తాయి. గత జీవితాలు గురించి చెప్పుకున్నప్పటికీ పెళ్లయిపోయిన తర్వాత పాత స్నేహాలను తిరగదోడి వారితో లైంగిక సంబంధాలను పెట్టుకోవాలనుకోవడం తప్పు. మీరు చేసింది పెద్ద తప్పు. భార్య మాజీ ప్రేయసి గురించి, ఆమెతో సెక్స్ సుఖాన్ని గురించి ప్రస్తావించినపుడు వారించాల్సింది.

మరో రకంగా చూస్తే ఆమె వ్యక్తిత్వానికి పరీక్ష పెట్టినట్లుగా అనిపిస్తోంది. మాజీ ప్రేయసితో సెక్స్ అనగానే వద్దని చెపుతారేమో అని ఎదురుచూసి ఉండవచ్చు. ఐతే అలా కాకుండా ఆమెతో లైంగిక ఆనందాన్ని చవిచూడటం జరిగిపోయింది. ఇపుడు ఆమె అలాంటి కోరికను వెళ్లబుచ్చేసరికి ఏం చేయాలో అర్థం కాకుండా పోతుంది. కాబట్టి వివాహేతర సంబంధాలు తప్పు. వాటికి దూరంగా ఉండాలి.

Tuesday 11 November 2014

78.నా జీవితం నా భర్తతో సంతోషంగా ఉండదనిపిస్తోంది... ఏం చేయాలి..?


ప్రశ్న :  కాలేజీ టైంలో ఓ అబ్బాయి - నేను ప్రేమించుకున్నాం. హద్దులు దాటలేదు కానీ అతడికి నేనంటే ప్రాణం. ఇప్పటికీ నా యోగక్షేమాలు తెలుసుకుంటుంటాడు. ఐతే నా భర్త ఇందుకు భిన్నం. అతడు ఓ శాడిస్ట్. ఎంతకీ నా అభిప్రాయాలకు విలువివ్వరు. ఆయనతో ఇమడలేననిపిస్తోంది. నా పాత స్నేహితుడితో వెళ్లిపోతే బావుండనిపిస్తుంది. ఐతే ఇది మా పెద్దల గౌరవ మర్యాదలతో కూడుకున్నది కావడంతో ఆలోచిస్తున్నా. కానీ నా జీవితం నా భర్తతో సంతోషంగా ఉండదనిపిస్తోంది... ఏం చేయాలి..?

జవాబు :  పెళ్లి చేసుకుని భర్తతో ఏవో చిన్నచిన్న గొడవలు వచ్చాయని పాత ప్రేమికుడ్ని ఊహించుకుంటూ అతడితో లోకం అనుకోవడం కొందరు చేస్తుంటారు. మూడుముళ్లు కట్టిన భర్తతో మనస్పర్థలు వస్తే పాత ప్రేమికుడి వద్దకు పారిపోవడం పరిష్కారం కాదు.

నూరేళ్లు కలిసి ఉండాల్సిన భర్తను వదిలేసి ఇప్పుడు పాత ప్రేమికుని వద్దకు వెళ్లాలనుకోవడం అనే ఆలోచనను ప్రక్కన పెట్టేసి భర్తతో మీకు వచ్చిన సమస్యను పరిష్కరించుకోవాలి. ఆయన ఖచ్చితంగా ప్రేమగా చూసుకుంటారు. ఇక ప్రేమికుని వద్దకు వెళ్లిపోవడమనేది ప్రేమించినపుడు... అంటే పెళ్లి చేసుకోబోయే ముందు తీసుకోవాల్సిన నిర్ణయం. మీ ప్రేమను మీ తల్లిదండ్రులకు చెప్పి ఒప్పించి అతడిని పెళ్లి చేసుకుని ఉండాల్సింది.

అలాకాకుండా ఇపుడు పెళ్లి చేసుకుని ఇలాంటి ఆలోచనలు చేయడం మంచిది కాదు. మీ భర్త శాడిస్ట్ అని ఏ కారణం వలన అంటున్నారో తెలియలేదు. ఐతే ప్రేమించుకుని పెళ్లాడిన జంటల్లోనూ ఇలాంటి సమస్యలు రావని గ్యారెంటీ ఉందా... అంటే అదీ లేదు. ఎందుకంటే ఎన్నో ప్రేమ జంటలు చిన్నచిన్న గొడవలతోనే విడాకుల వరకూ వెళ్లిపోతున్నాయి. కాబట్టి పాత జ్ఞాపకాలను మనసు నుంచి తీసేసి కొత్త జీవితం వైపు భర్తతో కలిసి అడుగులేయండి.

77.వీర్యం స్ఖలించగానే ఆమె మొద్దు నిద్రపోతోంది... ఎందుకిలా...?



ప్రశ్న  :  కొత్తగా పెళ్లయింది. నాకు సెక్స్ కోర్కెలు విపరీతం. నా భార్యకు కూడా అంతే. ఇద్దరం సెక్సులో విపరీతంగా పాల్గొంటాం. సుమారు గంటపాటు రెండుమూడు భంగిమల్లో సెక్సు చేసుకుంటాం. ఐతే చిట్టచివరికి వీర్యం స్ఖలించగానే ఆమె వెంటనే నిద్రపోతుంది. ఎలాంటి నిద్ర అంటే, మహా మొద్దునిద్ర. ఎంత పిలిచినా లేవదు. నాకు ఒక్కోసారి భయమేస్తుంది. ఆమెకేమైనా అయిపోయిందేమోనని ఆందోళనగా ఉంటుంది. ఎందుకిలా జరుగుతోంది...?

జవాబు  :  సెక్స్‌లో స్త్రీ-పురుష శరీరాలు రెండూ ఆనందంతో పరవశించి పోతాయి. సెక్స్ పూర్తయ్యాక శరీరంలో ఉండే ఎండార్ఫిన్ విడుదల అవడమే అందుకు కారణం. సెక్స్ చేసేటప్పటి అలసట, సెక్స్‌లో పొందిన తృప్తి వల్ల అలా నిద్ర రావడం సహజమే. అంతేకాదు హస్తప్రయోగం చేసుకునేవారు కూడా ఎక్కువమంది నిద్రపోయే ముందే జరుపుకుంటారు.

స్త్రీ కూడా రతి అనంతరం హాయిగా నిద్రపోతుంది. ఐతే చాలామంది స్త్రీలు సెక్స్ పూర్తయ్యాక వెంటనే అంగాన్ని తీసివేయడానికి ఇష్టపడరు. అంగాన్ని యోనిలోనే ఉంచి, భర్త ప్రేమగా దగ్గరికి తీసుకుని ముద్దాడుతూ, శరీరాన్ని నిమురుతుంటే అనగా ఆఫ్టర్ ప్లే చేస్తున్నప్పుడు మరింతగా తృప్తిని పొంది హాయిగా నిద్ర పోతారని ఓ సర్వేలో వెల్లడయింది. కనుక సెక్స్ తర్వాత నిద్ర ముంచుకు రావడం అనేది జబ్బేమీ కాదు.

76.నేను సెక్స్ చేయలేకపోతున్నానని ఆమె మరో వ్యక్తితో ఆ సుఖాన్ని చవిచూస్తోంది....




ప్రశ్న :   నేను చాలా లావుగా ఉంటాను. పెళ్లయ్యాక మరీ లావైపోయాను. కడుపు మాడ్చుకున్నా శరీరం తగ్గడంలేదు. నా పురుషాంగం స్తంభించినప్పుడు 4 అంగుళాలకు మించి ఉండటంలేదు. రాత్రిపూట నా భార్య వద్ద సెక్స్ చేయాలంటే నరకం కనబడుతోంది. ఆమె కింద నేను పైన ఉండే భంగిమను ఎప్పుడో ఆపేశాం. ఈ భంగిమలో ఎంత ప్రయత్నించినా నా పురుషాంగం ఆమె యోనిలో ప్రవేశించడంలేదు. దాంతో డాగీ స్టైల్ ప్రయత్నిస్తున్నా.

ఈ పద్ధతిలో కూడా పురుషాంగం ఆమె యోని ద్వారం వరకూ వెళుతోందని కానీ ప్రవేశించడంలేదు. ఇదంతా కేవలం నేను లావుగా ఉండటం వల్లనే సాధ్యపడటంలేదు. నా అవస్థ చూసి నా భార్య ఎగతాళిగా నవ్వుకుంటోంది. కొన్నిసార్లయితే సెక్స్ చేసుకుందామని అడగ్గానే... నీవల్లకాదు... ఎందుకు లేనిపోని ప్రయాస అని హేళన చేస్తోంది.

ఇటీవల ఆమె కొలీగ్ తో పరిచయం పెంచుకున్నది. నాకు చెప్పకపోయినా అతడితో సెక్సు సుఖాన్ని చవిచూస్తున్నట్లు తెలుసుకున్నాను. నేను సెక్స్ చేయలేకపోతున్నానని ఆమె మరో వ్యక్తితో ఆ సుఖాన్ని చవిచూస్తోంది. నేను మానసికంగా కుంగిపోతున్నాను. ఆమెను ఏమీ అనలేని పరిస్థితి. ఏం చేయాలో అర్థంకావడంలేదు. ఒక్కోసారి ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోంది.....

జవాబు :   ఏ సమస్యకయినా ఆత్మహత్య పరిష్కారం కాదు. ఆత్మహత్య చేసుకుంటే సమస్య తీరిపోతుందా... అసలు సమస్యను పరిష్కరించేందుకు మనిషే లేకుండా పోతాడు కదా. ఇలాంటి ఆలోచనలు మనసు నుంచి తరిమివేయండి. భార్య మరొకరితో సెక్సులో పాల్గొంటుందని అనుకుంటున్నారు కానీ నేరుగా మీరు చూసింది లేదు. కాబట్టి చూడకుండా అపోహ పడవద్దు.

ముఖ్యంగా మీరు మీ బరువు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకుగాను వైద్యుడిని సంప్రదించి ఆయన పర్యవేక్షణలోనే ఎలాంటి పదార్థాలను తీసుకోవాలో చర్చించి అలా నడుచుకోండి. సెక్స్ చేసేటపుడు పురుషాంగం చిన్నది పెద్దది అనే తేడా ఏమీ ఉండదు. అది స్తంభించే తీరుపైనే సెక్స్ సామర్థ్యం ఆధారపడి ఉంటుంది. కాబట్టి పురుషాంగం సైజును గురించి బాధపడవద్దు. ముందు మీ శరీరాన్ని తగ్గించుకునేందుకు తగిన వ్యాయామాలు చేయండి సరిపోతుంది.

Monday 10 November 2014

75.మావారి పురుషాంగం చిన్నదిగా ఉంటుంది..కానీ నాకు పెద్ద పురుషాంగంతో సెక్స్ కావాలని కోర్కె కలుగుతోంది




ప్రశ్న :   మాకు పెళ్లయి నాలుగేళ్లయింది. ఒక బాబు పుట్టాడు. ఆయన సాఫ్ట్ వేర్ ఇంజినీర్. నేను ఓ ప్రైవేటు కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ గా చేస్తున్నాను. మా ఆయనకు నెలకు లక్ష రూపాయలు జీతం వస్తుంది. ఇంట్లో డబ్బుకు కొదవలేదు. నాక్కూడా పాతికవేలు ఇస్తారు. డబ్బు పరంగా సంతోషంగా ఉన్నప్పటికీ సెక్స్ పరంగా చాలా అసంతృప్తిగా ఉంటోంది. మావారి పురుషాంగం చిన్నపిల్లలు పురుషాంగం మాదిరి చాలా చిన్నదిగా ఉంటుంది. సెక్స్ సమయంలో పెద్దదిగా ఉండదు. నాకు పొడవైన పురుషాంగంతో సెక్స్ చేయించుకోవాలని ఉంటుంది. కానీ ఆయన పురుషాంగం అంతకుమించి పొడవుండటంలేదు.
 
ఓసారి పురుషాంగం పెద్దది చేసుకునే మార్గం ఆలోచించమని అడిగితే... అదంతే, మనుషులంతా ఒకే విధంగా ఉన్నారా అని కోప్పడ్డారు. అప్పట్నుంచి అడగడం మానేశా. ఐతే నాలో సెక్స్ కోర్కెలు మాత్రం విపరీతంగా ఉంటున్నాయి. ఆ అసంతృప్తితోనో ఏమో ఈమధ్య మా బాస్ కు చాలా దగ్గరయిపోయాను. ఆయనకు నాకు మాటల మధ్య సెక్స్ గురించిన సంభాషణ వచ్చింది. నా అసంతృప్తి తెలుసుకుని ఒప్పుకుంటే తాను తృప్తి పరుస్తానని అంటున్నాడు. కానీ ఈ చర్య కారణంగా భర్తకు ద్రోహం చేసినట్లవుతుందని ఆవేదన చెందుతున్నా. కానీ నాకు పెద్ద పురుషాంగంతో సెక్స్ కావాలని కోర్కె కలుగుతోంది. బాస్ తో ఒక్కసారి సెక్సులో పాల్గొని కోర్కె తీర్చుకోవాలనిపిస్తోంది...

జవాబు :  పురుషాంగపు కొలతలపై చాలామందిలో అపోహలు ఉన్నాయి. కానీ పురుషాంగం ఎంత పొడవు ఉన్నదనేది ముఖ్యం కాదు. సెక్స్ సమయంలో పురుషాంగం స్తంభించి ఉన్నదా లేదా అనేదే ముఖ్యం. పురుషాంగం పొడవుగా ఉన్నప్పటికీ స్తంభన లేకపోతే సెక్సులో తృప్తి కలుగదు. అలాగే చిన్నది, పొట్టిగా ఉన్న పురుషాంగమైనా సెక్స్ సమయంలో స్తంభించి ఉన్నట్లయితే స్త్రీకి సెక్స్ తృప్తి కలుగుతుంది. స్త్రీ యోని లోపల రెండుమూడు అంగుళాల లోతునే కామనాడులు స్పర్శా సుఖాన్ని చవిచూస్తాయి. కనుక పురుషాంగం మూడున్నర అంగుళాలున్నా చాలు.
 
సెక్స్ తృప్తి అనేది కేవలం పొడవైన పురుషాంగంతో కలుగుతుందనేది అపోహ. ఇకపోతే వివాహేతర సంబంధం కొత్త అనుభవాలను చూపించినా ఆ తర్వాత అనేక సమస్యలకు మూలకారణమవుతుంది. మీ దంపతులు ఇద్దరూ కొన్నాళ్లపాటు ఆఫీసులకు సెలవు పెట్టి విహార యాత్రలకు వెళ్లండి. అక్కడ మీరు అనుకున్నవిధంగా సెక్స్ ఆనందాన్ని ఆయన కల్గించగలరు. ముఖ్యంగా ఆఫీసు పనులతో ఆయన అలసిపోవడం వల్ల మీకు అలాంటి భావన కలుగుతోంది.

74.స్తనాల సైజులు పెద్దవిగా ఉంటే పెళ్లికి ముందే సెక్స్‌లో పాల్గొన్నట్టా?


ప్రశ్న :   స్తనాల సైజులు పెద్దవిగా ఉంటే పెళ్లికి ముందే సెక్స్‌లో పాల్గొన్నట్టా?


జవాబు :  చాలామంది యువతులకు వక్షోజాలు చాలా పెద్దవిగా ఉంటాయి. చూసేందుకు సన్నగా ఉన్నప్పటికీ.. వక్ష ద్వయం మాత్రం భారీగా ఉంటుంది. మరికొందరిలో మాత్రం లావుగా ఉన్నప్పటికీ.. ఈ సైజులు మాత్రం చిన్నవిగా ఉంటాయి. ముఖ్యంగా సన్నగా ఉండే యువతిలో వక్షోజాల సైజులు పెద్దవిగా ఉండటం వల్ల చూసేందుకు ఆకర్షణీయంగా ఉంటాయి.
 
అయితే వారికి పెళ్లి అయిన తర్వాత వచ్చే భర్తలు అనుమానం కలిగిన వాళ్లు అయితే లేనిపోని మాటలు పడాల్సి వస్తుంది. పెళ్లికి ముందే వక్షోజాలు పెద్దవిగా ఉంటే ఖచ్చితంగా వివాహానికి ముందే సెక్స్ అనుభవం ఉండి ఉంటుందనే ఆలోచనకు వచ్చి వేధిస్తుంటారు. ఈ ప్రశ్నకు సమాధానం కోసం వైద్య నిపుణులను సంప్రదిస్తే..
 
వక్షోజాల సైజు పెద్దగా ఉంటే పెళ్ళికి ముందు సెక్స్ అనుభవం ఉన్నట్లు ఎవరైనా చెప్పినట్టయితే ఆ మాటలు వారి అవివేకానికి నిదర్శనం. ఇటువంటి అనుమానాలతో సంసారాన్ని పాడుచేసుకోవడం మినహా మరొకటి లేదు. వక్షోజాల సైజులు కొందరిలో భారీగా ఉన్నట్లు కనబడటం సహజం. హార్మోన్లలో తేడా వల్ల ఇలా జరుగుతుంది. అంతేకానీ, ఈ సైజులు పెద్దవిగా ఉంటే పెళ్లికి ముందే సెక్స్ అనుభవం ఉన్నట్టు కాదని వారు చెపుతున్నారు.

73.నా భార్య అడిగినట్లే 3 సార్లు చేయడం ఎలా...?



ప్రశ్న :   నా వయసు 40 సంవత్సరాలు. ఐటీ ఉద్యోగం చేస్తున్నాను. ఈమధ్య ఎందుకో ఎక్కువసార్లు రతిలో పాల్గొనలేకపోతున్నాను. ముఖ్యంగా నా భార్య రోజుకు రెండుమూడుసార్లు కావాలంటోంది. కానీ ఒక్కోసారి ఒక్కసారి కూడా చేయలేకపోతున్నాను. ఐతే సెక్స్ కోర్కెలు ఉంటున్నాయి కానీ చేయడానికి వచ్చేసరికి మనసు దానివైపు పోవడంలేదు. నా భార్య అడిగినట్లే 3 సార్లు చేయడం ఎలా...? మరో సమస్య ఏమిటంటే... ఏదైనా టూర్ కు వెళ్లి వచ్చి సెక్స్ చేస్తే వెంటనే ఔటై పోతోంది...

జవాబు :   ఒక వయసు దాటాక రోజూ రతి జరుపుకోవడం అనేది క్రమంగా తగ్గుతుంది. అలాగే ఇలాంటి వారిలో ఎక్కువసేపు చేస్తేగానీ స్ఖలనం అయ్యే పరిస్థితి ఉండదు. దీనికి కారణం బీజకోశాల్లో వీర్యం ఎక్కువసేపు తయారుకావడమే. మరీ ముఖ్యంగా కొంతమంది పురుషులు నాలుగైదు రోజులు వ్యాపార, ఉద్యోగ నిమిత్తం క్యాంపులకెళుతుంటారు.

ఇటువంటివారు అన్నాళ్లు గ్యాప్ తీసుకుని సెక్స్‌కు ఉపక్రమించగానే నాలుగైదు రోజులుగా తయారై బీజకోశాలలో నిల్వ ఉన్న వీర్యం నాలుగైదు స్ట్రోకులకే స్ఖలనమైపోతుంది. దీంతో చాలామంది పురుషులు ఆ తర్వాత సెక్స్ చేయడానికి ఉపక్రమించరు. ఫలితంగా భాగస్వామిలో అసంతృప్తి నెలకొంటుంది.

నాలుగైదు రోజులపాటు సెక్స్‌కు విరామం ఏర్పడినప్పటికీ, రెండవసారి.. మూడవసారి ఇలా మరో రెండుమూడుసార్లు సెక్స్‌లో పాల్గొనే శక్తి తమలో ఉంటుందన్న సంగతి చాలామంది పురుషులకు తెలియదు. ఈ విషయం తెలియక చాలామంది డీలా పడిపోతారు. ఒక్కసారికే ఔట్ అయిపోతారు. ఈ పరిస్థితిలో భార్య చొరవ తీసుకుని అతడిలో ఉత్సాహాన్ని రేకెత్తిస్తే రెండవసారి ఎక్కువసేపు సెక్స్ చేయగలుగుతారు.

అలాగే రోజుకు రెండుమూడు సార్లు పాల్గొనడం అనేది జీవన విధానంపై కూడా ఆధారపడి ఉంటుంది. పని ఒత్తిడి వల్ల అలసిపోతే అలా సెక్సులో పాల్గొనడం సాధ్యం కాదు. శరీరానికి కావలసినంత విశ్రాంతి ఇచ్చినప్పుడే మీరనుకున్నట్లు సాధ్యపడుతుంది.

72.శృంగారంలో ఇది వైఫల్యమేనా?


ప్రశ్న :   నా వయసు 32 సంవత్సరాలు. నాకు పదేళ్ళ క్రితం పెళ్ళయింది. నా భార్యతో సెక్స్‌లో పాల్గొన్న ప్రతీసారి ఒక నిముషంలోపే స్ఖలనం అయ్యింది. దీంతో నా భార్య అసంతృప్తికి లోనైంది. నాకూ అవమానంగా అనిపించింది. నాకున్న కోపంలో గొడవపడి విడిపోయాం. నాతో సెక్స్‌లో సంతృప్తి లేకనే విడిపోయిందని నాకు తర్వాత తెలిసింది. తర్వాత సెక్స్, నరాల, ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్‌లను సంప్రదించాను. వీరందరు రకరకాల టెస్టులు చేసి అన్నీ నార్మల్‌గానే ఉన్నాయని కొన్ని మందులు వాడితే శీఘ్రస్ఖలనం తగ్గుతుందని అన్నారు.

కానీ, ఏ మందులు వాడినా ఫలితం లేదు. తర్వాత ఇద్దరు ఆడవాళ్లతో సెక్స్‌లో పాల్గొన్నా ఒక్క నిముషంలోనే వీర్యం పడిపోయి అంగం మెత్తబడింది. నాకు కోపం, భయం, ఆలోచనా ఎక్కువ. నేను మామూలుగా ఉంటే దమ్ము రాదు. ఏదైనా పని చేస్తుంటే దమ్ము వస్తుంది. మా ఇంట్లో వాళ్ళందరూ మళ్లీ పెళ్ళి చేసుకోమంటున్నారు. కానీ, నా సమస్య వారికి తెలియదు. నేనేం చేయాలో అర్థం కావడం లేదు. ఇక నాకు చావే దిక్కా. దయచేసి నా సమస్యను మీరే పరిష్కరించగలరు? :


జవాబు :   మీకున్న సెక్స్ సమస్యను శీఘ్రస్ఖలనం అంటారు. అనుకున్న సమయానికంటే ముందే వీర్యం స్ఖలనం అవుతుంది. ఒక రెండు నిముషాలలోపే స్ఖలనం అయితే దాన్ని శీఘ్రస్ఖలనం అంటారు. దీనికి ప్రోస్టేట్ గ్రంథి సమస్య, మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు, పీ.సీ. కండరాల బలహీనత లాంటి వాటికి వాడే మందులు (బీపీకి వాడేవి), శారీరక కారణాలతో పాటుగా సెక్స్‌కు ముందు తీవ్రమైన మానసిక ఆందోళన, భయం, నిన్నటిలా ఇప్పుడూ క్షణాల్లో స్ఖలనం అవుతుందన్న ముందస్తు ఆలోచన, ఎక్కువ సేపు ఉండి తీరాలన్న స్వీయ డిమాండ్, భార్య తిరస్కారం, ఆమె ఆందోళనతో సహకరించకపోవడం, అవమానించడం వంటి వాటన్నింటితోపాటు ముఖ్యంగా అంగప్రవేశం తర్వాత ఆమె నిరాసక్త పూరిత బాడీ లాంగ్వేజ్, ఎక్కువ సేపు లేదా సరైనంత సమయం వరకూ శృంగారం జరగాలన్న ఆమె డిమాండ్ పరోక్షంగా భర్తను మానసికంగా తీవ్రమైన ఆందోళనకు గురిచేస్తాయి. దీంతోపాటు సెక్స్ లోపాల వల్ల కాకుండా వ్యక్తిత్వ లోపాల కారణంలో దంపతుల మధ్య తీవ్రమైన విద్వేషాలు, కలతలు, కలహాలు, ఘర్షణ వైరుధ్యాలు కూడా ఏర్పడి శీఘ్రస్ఖలనానికి దారితీస్తాయి.

పైగా మీకు ఆైంగ్జెటీ న్యూరోసిస్ అనే మానసిక సమస్య ఉంది. దీని లక్షణాలు ప్రతి దానికీ కోపం, ఆందోళన, భయాలకు లోనవడం, మానసిక ఒత్తిడికి గురికావడం, ఆత్మవిశ్వాస లోపం, ఆత్మనూన్యతలు. ఈ సమస్య వల్ల లక్ష్యాలు సాధించలేక జీవితంలో వైఫల్యాలను ఎదుర్కొంటారు. దీనివల్ల మళ్ళీ డిప్రెషన్‌కు గురవడం. ఈ వ్యక్తిత్వ లోప ప్రభావం మీ శృంగార జీవితంపైనా పడి శృంగార వైఫల్యానికి దారితీస్తుంది. తీవ్రమైప ఉద్రేక పూరిత మనస్తత్వానికి లోనయ్యే వారు శృంగారంలో అంగస్తంభన కాలాన్ని ఎక్కువ సేపు నిలిపి ఉంచుకోలేక శీఘ్రస్ఖలన సమస్యకు లోనవుతారు. తీవ్రమైన, ఆందోళన వల్ల మెదడు స్ఖలనానికి సంబంధించిన నరాల్ని ముందుగానే ప్రేరేపిస్తుంది.

దీంతో నిర్దేశిత సమయం కంటే ముందే వీర్యం విడుదలై పోయి అంగస్తంభన ముగిసిపోతుంది. కాబట్టి, ముందు మీరు మీ తొలి వైవాహిక జీవితంలోని వైఫల్యాల నుంచి పాఠం నేర్చుకోవాలి. మీ భార్య కేవలం సెక్స్‌లో అసంతృప్తి వల్ల మాత్రమే మిమ్మల్ని తిరస్కరించిందని నేననుకోను. ఎందుకంటే, మీరే చెప్పినట్లు మీ వ్యక్తిత్వంలోని కోపం, ఆవేశం లాంటి ప్రవర్తనల లోపాలవల్ల కూడా ఆమె విసిగిపోయి ఉండవచ్చు. కాబట్టి, రెండవసారి జీవితాన్ని సరిగ్గా ప్లాన్ చేస్కోండి. శీఘ్రస్ఖలనం తగ్గని సమస్యేమీ కాదు. ముందు మీరు మీలోని ఆవేశం, కోపం, ఉద్రేకం లాంటి నెగెటివ్ ప్రవర్తనాంశాల్ని తగ్గించుకోవడానికి కౌన్సెలింగ్ సైకోథెరపీ తీసుకోండి.

దాంపత్య బంధం నిలవడానికి భార్యపై ఆధిపత్యం, పెత్తనం నెరపే భర్తలా కాకుండా స్త్రీని విలువలున్న మనిషిగా, తన హక్కులతోపాటు భార్య హక్కుల్నీ గుర్తించి గౌరవించే మానవీయమైన మనిషిగా తీర్చిదిద్దే ఫీమేల్ ఓరియంటెడ్ కౌన్సెలింగ్ చాలా అవసరం. దంపతుల మధ్య అధికారిక సంబంధం ఎప్పుడూ పరస్పర గౌరవాన్ని, ప్రేమనూ, నమ్మకాన్ని నిలిపి ఉంచవు. దాంపత్య వైరుధ్యాల్ని మిత్రపూరిత ధోరణిలో ఒత్తిడికి లోనవకుండా, ఆవేశం, కోపాలకు గురికాకుండా ప్రశాంతంగా పరిష్కరించుకోవడం ముఖ్యం.

అలాగే, శీఘ్రస్ఖలనాన్ని తగ్గించుకోవడానికి సెక్సాలజిస్ట్‌ను కలవండి. అంగస్తంభన కాలాన్ని పెంచుతూ శీఘ్రస్ఖలనాన్ని తగ్గించే టెక్నిక్స్ చెప్పడమే కాకుండా మీ వ్యక్తిత్వంలో ప్రధాన లోపంగా ఉన్న ఆందోళనా పూరిత మనస్తత్వాన్ని తగ్గించే సైకోథెరపీ కూడా ఇస్తారు. ఎందుకంటే, మానవ లైంగికత, మానవ దృక్పథాన్ని బట్టే లైంగిక సమస్యలు మారుతూ ఉంటాయి. మంచి చికిత్సతో కాబోయే వివాహాన్ని విజయవంతం చేస్కోండి.

71.పిల్లలు లేకపోవడానికి భావప్రాప్తి కలగకపోవడమే కారణమా?



ప్రశ్న :   నాకు ప్ళ్ళై మూడు సంవత్సరాలు అవుతోంది. ఇప్పటిదాకా శంగారంలో ఆనందం, భావప్రాప్తి కలగలేదు. మా వారికి మాత్రం ఆనందం కలుగుతోంది. పిల్లలు లేకపోవడానికి భావప్రాప్తి కలగకపోవడమే కారణమా? సెక్స్ అంటే అనాసక్తిగా ఉంది. ఏం చేయమంటారు? :


జవాబు :   భావప్రాప్తి పొందక పోవడానికి పిల్లలు పుట్టకపోవడానికి ఏ మాత్రం సంబంధం లేదు. కాకపోతే, భావప్రాప్తి పొందగలిగే స్త్రీలు భర్తతో తరచూ శంగారంలో పాల్గొనడానికి ఆసక్తి చూపడం వల్ల పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భావప్రాప్తి పొందని స్త్రీలు తరచూ భర్త ఆనందం కోసం పాల్గొన్నా పిల్లలు పుడతారు. ఏది ఏమైనా ఈ స్థితికి దంపతులు ఇరువురూ కారణమే! ముందు నువ్వు సెక్స్‌పట్ల నీకున్న నెగెటివ్ భావజాలాన్ని పోగొట్టుకొని ఆసక్తిని పెంచుకోవాలి. అలాగే, నీ భర్త నీకు సెక్స్‌లో భావప్రాప్తి కలిగించే బాధ్యతను తీసుకోవాలి. శంగారంలో దంపతులిద్దరూ ఆనందించాలి. భార్యకి సెక్స్‌లో ఆనందాల్ని కలిగించలేని భర్తపై భార్యకు అనాసక్తి ఏర్పడుతుంది. దీనివల్ల ఆమె సెక్స్‌లో అతికొద్ది సార్లు మాత్రమే పాల్గొంటుంది. ఈ తిరస్కారం భర్తలో శీఘ్రస్ఖలనం, అంగస్తంభన సమస్యలకు దారితీస్తుంది. ఇది పూర్తిగా భర్త వైఫల్యం, బాధ్యతా రాహిత్యం.

దంపతులిద్దరూ సెక్సాలజిస్ట్‌ని కలవండి. కౌన్సెలింగ్, సెక్స్ మెరైటెల్ థెరపీతో మీ సమస్య దూరమవుతుంది. అలాగే, పిల్లలు పుట్టకపోవడానికి కారణాలను తెలుసుకోవాలి. మీరు స్కానింగ్ చేయించుకోవడంతో పాటు మీ భర్త వీర్యపరీక్ష చేస్కోవడం, అండం విడుదలయ్యే సమయంలో దంపతులిద్దరు కలవడం ముఖ్యం.

70. ఎక్కడికీ వెళ్ళలేకపోతున్నా.......


ప్రశ్న :  నా వయస్సు 17 సంవత్సరాలు. ఇంటర్మీడియట్ చదువుతున్నాను. నేను రాత్రిళ్ళు నిద్రలో మూత్రం పోసుకుంటున్నాను. చిన్నప్పటి నుంచీ ఇలాగే జరుగుతోంది. పగటి వేళ కూడా ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయాలనిపిస్తుంది. రాత్రిళ్ళు నిద్దట్లో మూత్ర విసర్జన వల్ల ఎక్కడికీ వెళ్ళలేకపోతున్నా. నా దుప్పట్లు ఎవరూ వాడరు. వెక్కిరిస్తారు. నా సమస్యకు పరిష్కారం చెప్పగలరు.

జవాబు :  నీ సమస్యను నక్టర్నల్ డైయూరేసిస్ అంటారు. సాధారణంగా 5 సంవత్సరాలు వచ్చేసరికి 85 శాతం మందికి, 10 ఏళ్ళ వయస్సు వచ్చే సరికి 95 శాతం మంది పిల్లలకు మూత్రకోశం మీద నియంత్రణ వస్తుంది. అలా కాకుండా వయసు పెరిగినా రాత్రిళ్ళు పక్కతడిపే అలవాటుంటే మాత్రం కారణాలు శోధించాలి. నరాల జబ్బులు, మూత్ర వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు, అనువంశిక కారణాలు (అంటే తల్లిదండ్రులకు చిన్నప్పుడు పక్కతడిపే అలవాటుంటే పిల్లలకు వస్తుంది) పుట్టుకతోనే కిడ్నీల్లో, ఇతర మూత్ర మార్గాల్లో నిర్మాణ పరమైన లోపాలు కూడా ఈ వ్యాధికి కారణాలు అవుతాయి. అలాగే, మగ పిల్లల కంటే కూడా ఆడపిల్లలకు మూత్రనాళం పొడవు తక్కువగా ఉండటం వల్ల మూత్ర నాళాల్లో ఇన్‌ఫెక్షన్లు వేగంగా వ్యాప్తి చెంది సిైస్టెటిస్ అనే మూత్రకోశపు వ్యాధికి చాలాసార్లు గురై ఈ రాత్రిళ్ళు పక్క తడపడం అనే వ్యాధికి లోనవుతారు.

మూత్ర విసర్జన సమయంలో మంట, నొప్పి రావడం, రాత్రిళ్ళు ఎక్కువసార్లు నిద్రలో పక్కలోనే మూత్ర విసర్జన జరగడం ఈ వ్యాధి లక్షణాలు. అలాగే, మలబద్దకం కూడా ఈ వ్యాధికి ఓ కారణం. పెద్ద పేగు చివరి భాగమైన రెక్టమ్ లేదా పురీషనాళం విసర్జక పదార్థాలతో నిండిపోయి దాని ముందువైపు ఉండే మూత్రాశయంపై ఒత్తిడి పెరిగి నిద్రలో మూత్ర విసర్జన జరుగుతుంది. అలాగే భయం, ఆందోళన, మానసిక ఒత్తిడి కూడా మూత్రకోశ కండరాలను అనియంత్రిత సంకోచాలకు గురిచేస్తాయి. దీనివల్ల భయంకరమైన కలలు వచ్చాక నిద్రలో మూత్ర విసర్జన జరుగుతుంది.

జువినైల్ డయాబెటిస్ ఉన్న పిల్లలు, టీనేజర్స్‌కు కూడా రాత్రిళ్లు పక్కలో మూత్ర విసర్జన అలవాటు ఉంటుంది. వీరిలో రక్తంలో ఎక్కువైన చక్కెరను కిడ్నీలు పెద్ద మొత్తంలో విసర్జిస్తాయి. ఈ క్రమంలో మూత్రాశయంలో పరిమాణానికి మించి మూత్రం తయారవడంతో నిద్రలో అసంకల్పితంగా మూత్ర విసర్జన జరుగుతుంది. పైన చెప్పిన కారణాల్లో నీకేమైనా ఉన్నాయేమో చెక్ చేసుకొని చికిత్స తీసుకోవాలి. నీ పేరేంట్స్‌కి ఈ విషయం ఈపాటికే తెలిసి ఉండాలి.

అలాగే, రాత్రిపూట కూల్‌డ్రింక్స్, టీ, కాఫీ వంటి మూత్రాన్ని జారీచేసే ప్రేరక ద్రవాల్ని తీసుకోవద్దు. పడుకునే ముందు ఖచ్చితంగా మూత్ర విసర్జన చేయడం అలవాటు చేసుకోవాలి. అలాగే, అలారం పెట్టుకుని, మధ్య రాత్రి లేచి మూత్ర విసర్జన చేయాలి. మలబద్దకాన్ని పోగొట్టే ఆకుకూరలు, పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. మానసిక ఆందోళన కారణమైతే నెగెటివ్ ఆలోచనా ధోరణిని పాజిటివ్ ఆలోచనా ధోరణికి మార్చుకోండి. కోపం, ఆందోళన తగ్గే దిశలో కౌన్సెలింగ్, ఫిజియోథెరపీ తీసుకోండి.

డీపర్ రిలాక్సేషన్ టెక్నిక్స్, బ్రీథింగ్ ఎక్సర్‌సైజెస్ మానసిక ప్రశాతంతతను పెంచుతాయి. పగటివేళ కూడా మూత్ర విసర్జన ఎక్కువసార్లు అవుతే యూరాలజిస్ట్‌ని కలవాలి. షుగరు ఉందేమో పరీక్ష చేయించుకోవాలి. అలాగే, యూరాలజిస్ట్ పర్యవేక్షణలో కొన్ని రోజులపాటు మూత్రకోశపు అనవసర సంకోచాలను నియంత్రించే మందులు వాడాలి.

69.ఆ భయంతో సెక్స్ అంటేనే విరక్తి పుడుతోంది....


ప్రశ్న :   మా పెళ్లయి 9 నెలలు అవుతోంది. మా వారి ప్రవర్తన చాలా వింతగా ఉంటోంది. ఎప్పుడూ బ్లూ ఫిల్మ్స్ చూస్తారు. పెళ్ళికి ముందే అలవాటు ఉందట. ఈ మధ్య ఆనల్ సెక్స్‌కి ఒప్పుకోమని ఒత్తిడి చేస్తున్నారు. ఒకసారి బలవంతంగా ప్రయత్నం చేస్తే, ప్రాణం పోయేంత నొప్పి అనిపించి రక్తస్రావం కూడా అయింది. 10 రోజులు మందులు వాడితే కానీ కోలుకోలేక పోయాను. ఆ భయంతో సెక్స్ అంటేనే విరక్తి పుడుతోంది. తనకు ఆ పద్ధతే ఇష్టమనీ, పైగా తగ్గింది కదా మళ్ళీ అలానే చేస్తానని వెంటబడి వేధిస్తున్నాడు. వద్దంటే నువ్వే ఉన్నావా అని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఏం చేయమంటారు?

జవాబు :  నువ్వు వెంటనే ఈ విషయాన్ని మీ అత్తకూ, అమ్మకూ చెప్పాలి. నీలో నువ్వే దాచుకుని కుమిలి పోనక్కర లేదు. శంగారం పేరుతో అతను నీ మీద చేస్తున్న హింసను నువ్వు దాచాల్సిన అవసరం లేదు. సెక్స్‌లో ఈ రకమైన అసహజమైన లైంగిక వేధింపులు కూడా గహహింస చట్టంలోకే వస్తాయి. ఈ రకమైన సెక్స్‌కి అస్సలు ఒప్పుకోవద్దు. వేధింపులు మానే వరకూ మామూలు శంగారానికి కూడా ఒప్పుకోవద్దు. కనీసం నీకు చికిత్స ఇచ్చిన గైనకాలజిస్ట్ అయినా నీ భర్తకి కౌన్సెలింగ్ ఇచ్చి ఉంటే బాగుండేది, బాధ్యతగా ఉండేది. ముందు ఆ బ్లూఫిల్మ్స్ అన్నీ తీసి ధ్వంసం చెయ్యి. నెట్ కనెక్షన్ తీసెయ్యి. ఆనల్ సెక్స్ అంటే దొడ్డికెళ్లే గుదమార్గం ద్వారా అంగప్రవేశం చేయడం. ఇది చాలా ప్రమాదకరం. తీవ్రమైన నొప్పి, రక్తస్రావం అవడంతో పాటు అది అలాగే కొనసాగిస్తే ముందే ఆ భాగంలో క్రిములు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇన్‌ఫెక్షన్, చీము, వాపు, నొప్పి, జ్వరం వస్తాయి. మెల్లగా ఆనల్ ఫిషర్- ఫిస్ట్యులా ఏర్పడుతుంది. అప్పటికీ ఆపకుండా అలానే ఆ సెక్స్ కొనసాగిస్తే అది కేన్సర్‌కి దారితీస్తుంది. భార్యాభర్తల మధ్య కాకుండా పెళ్లయిన లేదా ఇతర వ్యక్తుల మధ్య అక్రమ సంబంధాల్లో హోమోసెక్సువల్స్‌లో ఈ రకమైన (ఆనల్) సెక్స్ ద్వారా హెచ్‌ఐవి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆనల్ సెక్స్ ఒక అసహజమైన శంగార ప్రక్రియ. దీన్ని పెళ్ళి-దాంపత్యం పేరుతో భార్య మీద బలవంతంగా ప్రయోగించడం నేరం అవుతుంది. కేసు పెడితే అతనికి శిక్ష పడుతుంది. శంగారం భార్యాభర్తలు ఒకరిపట్ల ఒకరు ప్రేమను వ్యక్తపరచుకునే అందమైన దేహభాష మాత్రమే. విపరీతమైన నొప్పిని, భయాన్ని కలిగించే హింసాత్మక ప్రయోగం కాదు. సెక్స్‌వల్ల దంపతులు ఇరువురూ ఆనందం పొందాలి. భార్యకు నొప్పి, భర్తకు ఆనందం కాదు. సెక్స్ శాడిజంతో కొనసాగించే హింసా ప్రక్రియలను సభ్య సమాజమంతా, ముఖ్యంగా టీనేజర్స్ బహిష్కరించాలి. నీ భర్త శాడిజం, సెక్స్ పర్వర్షన్‌తో బాధపడ్తున్నాడు. అతనికి సైకోథెరపీతోపాటు పాజిటివ్ సెక్సువల్ ఓరియెంటేషన్ చాలా అవసరం. పురుషుడి వికతమైన సెక్స్ వాంఛలు తీర్చుకోవడానికి స్త్రీ ఒక ప్రయోగశాలలోని మూగ జంతువు కాదు. స్త్రీపై గౌరవం లేనివాడు మాత్రమే శంగారంలో ఇటువంటి వికత చేష్టలకు పూనుకొంటాడు. నువ్వు మంచి సెక్సాలజిస్ట్‌ని కలువు. ముందు నువ్వు, నీ భర్త హెచ్‌ఐవి ఇతర ఎస్‌టిడీ పరీక్షలు చేయించుకోండి. అతని ప్రవర్తన మారే దిశగా ఫిజికో సెక్సువల్ థెరపీ ఇప్పించు. మారేంత వరకూ అతనితో శంగారాన్ని ఖచ్చితంగా తిరస్కరించు. భయం, నొప్పి, హింస లేని దాంపత్య జీవితాన్ని అనుభవించడం స్త్రీకి ఉన్న ప్రత్యుత్పత్తి హక్కులలో ప్రధానమైంది.

68.మళ్ళీ సెక్స్ చేద్దామనుకుంటే నాలో ఉత్సాహం కలగడం లేదు....


ప్రశ్న :   నా వయస్సు 46 సంవత్సరాలు. నా భార్యకు 40 ఏళ్లు. మా ఇద్దరికి ఎలాంటి వ్యాధులూ లేవు. నేను ప్రతి 15 రోజులకు ఒకసారి నా భార్యతో సెక్స్‌తో పాల్గొంటాను. కానీ, 5 నిమిషాలకే వీర్యం బయటకు వచ్చేస్తోంది. మళ్ళీ సెక్స్ చేద్దామనుకుంటే నాలో ఉత్సాహం కలగడం లేదు. తప్తిగా అనుభూతి పొందలేకపోతున్నాను. కనుక, నా వీర్యం త్వరగా బయటికి రాకుండా, మరింత ఉత్సాహవంతంగా సెక్స్ చేయడానికి పరిష్కార మార్గం తెలపండి?


జవాబు :   మీరు సెక్స్ జీవితంలో ఎక్కువ గ్యాప్ ఇస్తున్నారు. మీ 46 సంవత్సరాల వయస్సుకి శంగారంలో కనీసం వారానికి 2 సార్లయినా పాల్గొనాలి. చాలా రోజుల తర్వాత పాల్గొంటే అది శీఘ్రస్ఖలనానికి దారితీస్తుంది. శీఘ్రస్ఖలనానికి ప్రోస్టేట్ వ్యాధి-మూత్రనాళ ఇన్‌ఫెక్షన్స్‌తోపాటు తీవ్రమైన ఫర్‌ఫార్మెన్స్ యాంైగ్జెటీ కూడా ఒక కారణం. వీటితో పాటుగా స్ఖలనాన్ని ఆపుకుంటూ అంగ స్తంభనను కొనసాగించే సెక్స్ కండరాలపై నియంత్రణ లేకపోవడం వల్ల కూడా మీకు ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. శీఘ్రస్ఖలనాన్ని నియంత్రించకపోతే అది ఏ వయస్సులోనైనా అంగస్తంభన సమస్యను కల్గిస్తుంది. శీఘ్రస్ఖలనం అంటేనే అంగస్తంభన కాలం తగ్గిపోవడం. అది క్షణాలైనా, నిమిషాలైనా కావచ్చు. మీకు అంగస్తంభన సమస్య ఉందో లేదో తెలుపలేదు. అలాగే చక్కెర వ్యాధి, బీ.పీ., గుండె సంబంధ వ్యాధులు, నాడీ సంబంధ సమస్యలున్నాయో కూడా రాయలేదు. ఏది ఏమైనప్పటికీ మీరొకసారి సెక్సాలజిస్ట్‌ని కలవండి.

మీ సమస్య మూల కారణానికి చికిత్సతో పాటు అంగస్తంభన కాలాన్ని పెంచి, శీఘ్రస్ఖలనాన్ని తగ్గించే ఇ.వి.టి., ఐ.వి.టి., ఎస్.ఎస్., టెక్నిక్స్ మెరైటిల్ థెరపీలో భాగంగా చెప్తారు. అలాగే, శీఘ్రస్ఖలనాన్ని నియంత్రించడానికి ఫర్మార్మెన్స్ యాంైగ్జెటీ తగ్గించే దిశగా సెక్స్ సైకాలజీ, నార్మల్ సెక్స్ రెస్పాన్స్ చక్రం వివరాలు చెప్పడంతో పాటుగా సైకోథెరపీ కూడా ఇస్తారు. సెక్స్ ఆరోగ్యాన్ని మెరుగు పరిచే ఆహార నియమాలు కూడా చెప్తారు.

67.డైరెక్ట్‌గా చెప్పేసింది నీ అంగం చాలా సన్నగా వుందని... ....



ప్రశ్న :  నా వయస్సు 25 సంవత్సరాలు. మీరే నా ఈ సమస్య నుండి నన్ను గట్టెక్కించాలి. నా అంగం చాలా సన్నగా వున్నందున నేను మానసికంగా చాలా బాధపడుతున్నాను. నాకు అంగస్తంభన బాగానే జరుగుతుంది. అప్పుడు పొడవు బాగానే ఉంటుంది. కానీ, లావు మాత్రం కావడం లేదు. ఈ సమస్య చాలారోజుల నుండి ఉంది. నేనొక అమ్మాయిని ప్రేమించాను. పెళ్ళికూడా చేసుకోబోతున్నానని తనతో శారీరకంగా కలిశాను. అప్పుడు తను కూడా డైరెక్ట్‌గా చెప్పేసింది నీ అంగం చాలా సన్నగా వుందని. నాకు ఎలాంటి ఒత్తిడి లేదు. శారీరకంగా చాలా ఫిట్‌గా వుంటాను. తనతో మూడుసార్లు కలిశా. మూడుసార్లూ అలాగే చెప్పింది. ఇప్పుడు తను నాతో దూరంగా ఉంటోంది. అలా కాదేమో అని మా ఫ్రెండ్‌తో కూడా పోల్చి చూసుకున్నా. వారు కూడా చాలా సన్నగా ఉందని హేళన చేశారు. నిజమే, వారందరి కంటే నాదే సన్నగా ఉంది. మేడం.. దయచేసి మీరే నాకు శాశ్వత పరిష్కారం చూపగలరు. ఇంట్లో పెళ్లి చేస్తామంటున్నారు. నా అంగం పెద్దగా అవడానికి ఏమైనా మందులు, పరిష్కార మార్గాలు ఉంటే చెప్పండి. :

జవాబు :   నువ్వు నీ స్నేహితురాలితో పెళ్ళికి ముందే సెక్సులో పాల్గొనడం తప్పు. నీ స్నేహితులతో నిన్ను నువ్వు పోల్చుకోవడం, తక్కువ అంచనా వేస్కోవడం వెంటనే మానెయ్యి. ఆందోళన, భయం, నెగెటివ్ ఆలోచనలు, లైంగిక అవయవాల సైజు పట్ల, హస్తప్రయోగం పట్ల అశాస్త్రీయమైన అవగాహన ఇవన్నీ కలిసి నిజంగానే అంగం సైజు చిన్నగా, సన్నగా ఉన్నట్లుగా భ్రమింపచేస్తున్నాయి. నీలో శంగారపరమైన కోరికలుండటం, ఉద్దీపన, అంగస్తంభన పరిపూర్ణంగా కలగడం, చక్కగా శంగారం చేయగలగడం లాంటి లక్షణాలు నువు వైవాహిక జీవితానికి, నీ భార్యను సంతప్తి పరచడానికి పూర్తిస్థాయి అర్హుడివన్న వాస్తవాన్ని సూచిస్తాయి. అంగం పరిమాణం ముఖ్యం కాదు. భార్యను అంగప్రవేశం ముందు ఎఫ్‌పీటీ ద్వారా భావప్రాప్తి పొందేలా చేయడంలోనే శంగారంలో భర్త సమర్థత నిర్ణయమవుతుంది. నీ స్నేహితులతో సహా నీ గర్ల్‌ఫ్రెండ్‌కి కూడా స్త్రీ, పురుష ప్రత్యుత్పత్తి అవయవాల పట్ల శాస్త్రీయమైన అవగాహన లేదు. నువ్వు ముందు వీళ్ళందరితో నీ లైంగిక అవయవ పరిమాణం గురించిన అనవసర చర్చలు మానేసి, సెక్సాలసిజ్ట్ వద్ద సరైన కౌన్సెలింగ్ తీసుకో.


66.నాకెందుకిలా జరుగుతోంది?


ప్రశ్న :  నా వయస్సు 21 సంవత్సరాలు. నాకు 15 సంవత్సరాల నుండి హస్తప్రయోగం చేసుకునే అలవాటు ఉంది. హస్తప్రయోగం చెయ్యడం తప్పు, దీనివల్ల మర్మాయవవాలు కందినట్లు వుండి, లేపన శక్తి తగ్గుతుందని, ఆరోగ్య సమస్యలు వస్తాయని కొన్ని పుస్తకాలలో చదివాను. ఇది నిజమేనా? నాకు స్ఖలనం తొందరగా అవుతుంది. కనీసం ఒక నిమిషం కూడా ఆగట్లేదు. స్ఖలనానికి కనీసం 2 నుండి 3 నిముషాలైనా పడుతుందంటారు కదా. మరి నాకెందుకిలా జరుగుతోంది? హస్తప్రయోగాన్ని మానేయడం ఎలా? ఒకవేళ మానేయకపోతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

జవాబు :  లేపన శక్తి అనే మాటకు అర్థం లేదు. వారానికి 4-5 సార్లు హస్త ప్రయోగం చేసుకోవడం వల్ల ఏ రకమైన సెక్సు సమస్యా రాదు. హస్తప్రయోగం తప్పు, పాపం అన్న అభిప్రాయంతో, ఎవరైనా చూస్తారేమోనని తొందర తొందరగా, భయంతో ముగించడం వల్ల శీఘ్రస్ఖలనం అవుతుంది తప్ప, హస్త ప్రయోగంతో కాదు. ఇక నీ జననాంగాలు కమిలినట్లు అవడం ఏదైనా చర్మ సంబంధమైన ఇన్‌ఫెక్షన్స్ వల్ల తప్పితే హస్త ప్రయోగం వల్ల కాదు. విడిగా నీకు స్ఖలనం చాలా త్వరగా క్షణాలలో అయిపోతుంటే సెక్సాలజిస్ట్‌ని కలువు. అంగస్తంభన కాలాన్ని పెంచే శీఘ్రస్ఖలనాన్ని కంట్రోల్ చేసే పీసీ, ఐవీటీ, ఈవీటీ, డబ్ల్యూపీటీ టెక్నిక్స్ సెక్స్ థెరపీలో భాగంగా చెబుతారు. అలాగే, సెక్స్‌కు ముందు, చేసేటప్పుడు ఫర్‌ఫార్మెన్స్ ఆంైగ్జెటీ వల్ల కూడా శీఘ్ర స్ఖలనం అవుతుంది. వీటికి చికిత్స ఉంది. భయపడాల్సిన అవసరం లేదు. నువు వివాహానికి అర్హుడివే. అయితే, అతి హస్తప్రయోగం అంటే రోజుకి 2-4 సార్లు మంచిది కాదు. ఒకసారి సెక్సాలజిస్ట్‌ని కలిసి ప్రిమెరైటల్ కౌన్సెలింగ్ తీసుకో. నీ భయసందేహాలు తీరుతాయి.

Thursday 6 November 2014

65.నా ఫ్రెండ్ భర్త... ప్లీజ్ ఒక్కసారే అంటూ స్వర్గం చూపించాడు?


ప్రశ్న :  మాది విజయవాడ. ఇద్దరు పిల్లలున్నారు. వివాహమై 13 యేళ్లు అయింది. నా వయస్సు 32 యేళ్లు. ఈ మధ్య నాకు అనుకోని సంఘటన ఎదురైంది. తన స్నేహితురాలి ఇంటికి ఏదో పనిమీద వెళ్లాను. ఆ సమయంలో నా స్నేహితురాలు ఇంట్లో లేదు. ఆమె భర్త ఒక్కరే ఉన్నారు. అతను కూడా నాకు బాగా పరిచయమే. దీంతో ప్లీజ్ ఒక్కసారి అంటూ దీనంగా ప్రాధేయపడ్డారు. దీంతో నా మనస్సుకు ఏమైందో తెలియదు.. ఆయనకు లొంగిపోయాను. ఆ రోజున దాంపత్య జీవితంలోని సెక్స్ మాధుర్యాన్ని రుచిచూశాను. వాస్తవానికి నా భర్తతో రోజూ సెక్స్‌లో పాల్గొంటున్నప్పటికీ.. తృప్తి అంటే ఏంటో తెలియదు. తూతూ మంత్రంగా పూర్తి చేసేవారు. దీంతో నా స్నేహితురాలి భర్త ద్వారా పొందిన సెక్స్ అనుభవాన్ని మళ్లీమళ్లీ పొందాలని నా మనస్సు తహతహలాడుతోంది. ఇలా కోరుకోవడం నా స్నేహితురాలికి ద్రోహం చేస్తున్నాననే విషయం తెలుసు. కానీ. ఆ రోజు పొందిన సెక్స్ సుఖం అతని ద్వారా మళ్లీమళ్లీ పొందాలని ఉంది. ఏం చేయాలి. సలహా ఇవ్వండి.

జవాబు :  చాలా మంది దంపతుల విషయంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా పలువురు పురుషులు దాంపత్య జీవితంలో తమ సంతోషాన్నే చూసుకుంటారే గానీ, భార్య సంతృప్తి గురించి పట్టించుకోరు. ఫలితంగానే మొక్కుబడిగా ఆ కార్యాన్ని పూర్తి చేస్తుంటారు. ఇక్కడ మీ భర్త పరిస్థితీ అంతే. ఇకపోతే.. ఇక్కడ మీరు మీ మనస్సుకు తెలిసే తప్పు చేస్తున్నారు. అందువల్ల మీ మనస్సును నిగ్రహించుకోవాలి. చేసిన తప్పును మళ్లీమళ్ళీ చేయొద్దు. మీ స్నేహితురాలి భర్తతో ఏర్పరచుకున్న వివాహేతర సంబంధం విషయం మీ భర్త లేదా మీ స్నేహితురాలికి తెలిస్తే వారిద్దరు ఎంతగా బాధపడుతారు. అందువల్ల ఈ తరహా సంబంధానికి దూరంగా ఉండండి.
 
అదేసమయంలో మీలో కలిగే కోర్కెలను అణుచుకోవాల్సిన అవసరం లేదు. మీ వారిలోని కోర్కెలను రెచ్చగొట్టండి. పడక గదిలో డైరక్ట్‌గా సెక్స్‌లో పాల్గొనకుండా ముందుగా ఫోర్ ప్లే చేయించుకోండి. మీలోని కోర్కెలు తారాస్థాయికి చేరినపుడు అంగ ప్రవేశం చేయించుకుని సంతృప్తి పొందండి. ముఖ్యంగా.. సెక్స్ విషయంలో ఏమాత్రం సిగ్గు పడకుండా భార్యాభర్తలిద్దరూ మనస్సు విప్పి మాట్లాడుకుంటూ తన కోర్కెలకు అనుగుణంగా పడక గదిలో నడుచుకుంటే సెక్స్‌లో స్వర్గ సుఖం చూడొచ్చు.

64.నా భర్త అంగ ప్రవేశం చేయలేక పోతున్నాడు.. ఎందుకని?


ప్రశ్న :  నాకు వివాహమై నెల రోజులు మాత్రమే అయింది. ఇప్పటి వరకు నా భర్త అంగ ప్రవేశం చేయలేక పోతున్నాడు. నేను మాత్రం సెక్స్‌లో ఆయనకు బాగానే సహకరిస్తున్నా. కానీ, నా భర్త అంగం.. నా యోనిలో ప్రవేశపెట్టలేక ఇబ్బందులు పడుతున్నాడు. ఏంటని అడిగితే ఏమో తెలియడం లేదని సమాధానమిస్తున్నాడు. ఇలా ఎందుకు జరుగుతుందో తెలియడం లేదు. సలహా ఇవ్వండి.

జవాబు :  ప్రపంచంలో అనేక మంది యువతీ యువకులు శృంగారం పట్ల అమితాసక్తిని చూపిస్తుంటారు. వివాహమైన తర్వాత రత్రిక్రీడలో ఉన్న మజాను అస్వాదించాలని ఉవ్విళ్లూరుతుంటారు. తీరా వివాహమయ్యాక అంగప్రవేశం చేసేందుకు ఉపక్రమిస్తే మాత్రం వారు పూర్తిగా విఫలమవుతున్నారు. దీనికి గల కారణాలను అన్వేషిస్తే.. 
 
ప్రధానంగా వివాహిత కన్య తొలిసారి సెక్స్‌లో పాల్గొనే సమయంలో తీవ్రమైన ఆందోళనకు, ఒత్తిడికి లోనవుతుందని వారు అంటారు. ఎందుకంటే... హైమస్ (కన్నెపొర) తొలగిపోయి రక్తం వస్తుందనే భయం వారిని ఎక్కువగా పీడిస్తుందన్నారు. పైపెచ్చు రతిలో నొప్పిని తట్టుకోలేమనే భావన కూడా వారిలో ఉంటుందని అందువల్లే వారు అంగప్రవేశానికి నిరాసక్తత చూపిస్తుంటారని వైద్యులు పేర్కొంటున్నారు.
 
అయినప్పటికీ బలవంతంగా సెక్స్‌లో పాల్గొన్నప్పటికీ.. అంగ్రప్రవేశం జరగదు. ఎందుకంటే.. యోని కండరాలు బాగా బిగదీసుకుపోయి ఉండటమే దీనికి కారణమంటున్నారు. మరికొందరు కన్యలు మాత్రం పొత్తికడుపు పైభాగం వరకు ఎంత ముట్టుకున్నా... ముద్దుపెట్టుకున్నా ఆనందానే ఉంటారు.
 
కానీ, చెయ్యి పొత్తికడుపు కింద భాగానికి చేరగానే బిగుసుకుపోతారు. ఇలాంటి స్త్రీలలో యోని కండరాలు వాటంతట అవే బిగుసుకుపోతాయని అంటున్నారు. అందువల్ల పడక గదిలో మీ భర్తకు మరింతగా సహకరిస్తూ.. అంగ ప్రవేశమయ్యేందుకు మీ వంతు పాత్రను పోషిస్తే మీ సమస్యకు పరిష్కారం లభించినట్టే.

63.మెడపై ముద్దుపెట్టి వక్షోజాలను తాకించింది... సెక్స్ చేయమనేనా...?


ప్రశ్న :  మా ఇంటి పక్కన ఓ ఆంటీ నన్ను చాలా ప్రేమగా చూస్తుంది. ఈమధ్య ఓరోజు నన్ను పిలిచి ఈరోజు నువ్వు చాలా మంచి దుస్తులు వేసుకున్నావు, చాలా బావున్నావని అంటూ మెడపై ముద్దుపెట్టింది. ఆ సమయంలో ఆమె రెండు వక్షోజాలు నా వీపును తాకాయి. అలా రెండుమూడు నిమిషాలు స్పర్శకు నా అంగం స్తంభించింది. ఆ స్పర్శ మళ్లీ కావాలనిపిస్తుంది. సెక్స్ కోర్కెలు కలుగుతున్నాయి. ఆమె నన్ను అలా తాకడం వెనుక సెక్స్ కోర్కె ఉన్నట్లనుకోవచ్చా...?

జవాబు :   సహజంగా యవ్వనంలో ఉన్న పురుషులను పరాయి స్త్రీలు తమ శరీరాన్ని తాకిస్తే, ముఖ్యంగా వక్షోజాలను తాకించినపుడు ఇలాంటి భావనలు కలుగుతాయి. కానీ, ఆమె ఎప్పటినుంచో ప్రేమ, ఆప్యాయతలను చూపిస్తూ ఉందని చెపుతున్నావు కనుక దాని వెనుక సెక్స్ ఉద్దేశ్యం ఉందని అనుకోరాదు. ఒకవేళ ఆమె పట్ల నీకు అలాంటి భావన ఉన్నా, దాని నుంచి దూరంగా జరిగి కెరీర్ పై దృష్టి పెట్టాలి. సెక్స్ కోర్కెలు కలిగినా ఆ ధ్యాస నుంచి పక్కకు మరలేందుకు ప్రయత్నించాలి.

62.నా గర్ల్ ఫ్రెండ్ నాకు దూరంగా వెళుతోంది... సెక్స్ చేస్తే బంధం అలాగే ఉంటుంది కదా...


ప్రశ్న :  నేను నా గర్ల్ ఫ్రెండ్ ముద్దులు, కౌగలింతలు, అంగ చూషణ, యోని చూషణలు చేసుకున్నాం. కానీ లైంగికంగా మాత్రం కలవలేదు. ఇప్పుడు ఆమెకు లండన్ లో ఉద్యోగం వచ్చింది. కనీసం రెండేళ్ల దాకా అక్కడే ఉంటుందట. నాకు అక్కడికి వెళ్లే అవకాశం లేదు. ఆమె లండన్ నుంచి తిరిగి వచ్చాక పెళ్లాడదామంటోంది.
 
కానీ అక్కడికెళ్లిపోయిన తర్వాత నన్ను మర్చిపోతుందేమోనని ఆందోళనగా ఉంది. ఆమె అలా చేస్తే నేను బతకను. అందుకని ఆమె లండన్ కు వెళ్లేలోపు సెక్స్ చేస్తే ఆ సెక్స్ తృప్తిని మర్చిపోకుండా ఉంటుందని అనుకుంటున్నా. ఇలా చేయడం కరెక్టే కదా...?
 
జవాబు :  సెక్స్ కంటే బలమైనది నమ్మకం. ఆమె మీ పట్ల, మీకు ఆమె పట్ల నమ్మకం లేనపుడు సెక్స్ చేసినా అది నిలువదు. ఎందుకంటే సెక్స్ చేసినంత మాత్రాన ఆమె మిమ్మల్ని మనస్పూర్తిగా ప్రేమించలేదంటే, ఎక్కడున్నా మీకు దగ్గర కాలేదు. అలాగే మీరు ఆమెను పూర్తిగా విశ్వసించడంలేదని తెలుస్తోంది.
 
పెళ్లికి ముందు సెక్స్ చేయడం వల్ల ఇద్దరికీ సమస్యలు ఎదురవుతాయి. ఆమె కెరీర్ ఇపుడిపుడే తారాస్థాయికి వెళుతున్నట్లు కనబడుతోంది. కనుక ఆమెను విశ్వసించండి. ఒకవేళ లండన్ కు మిమ్మల్ని మర్చిపోయి మిమ్మల్ని కాదనుకుంటే ఆమె ప్రేమ నిజం కాదని అనుకోవాల్సి వస్తుంది. అలా మిమ్మల్ని వదిలేస్తే మీరు చేయగలిగింది ఏముంటుంది. బలవంతంగా ఏ బంధాన్ని కూడా గట్టిగా పట్టిపెట్టి ఉంచలేము.

61.ఒక్కసారికే ఔటవుతున్నా... ఆమెకు రెండుసార్లు కావాలట... వేరొకరితో ఏమైనా...?


ప్రశ్న :  వారంలో మూడుసార్లు నైట్ డ్యూటీ చేస్తుంటా. నా భార్యకు సెక్స్ యావ ఎక్కువ. రోజుకు రెండుసార్లు సెక్స్ చేయనిదే ఊరుకోదు. అంగ చూషణ చేసి నన్ను బాగా ప్రేరేపించి సెక్స్ చేయించుకుంటుంది. ఇటీవల ఆమె అలా ప్రేరేపించినప్పటికీ ఒక్కసారికి మించి చేయలేకపోతున్నా. అప్పట్నుంచి ఆమెలో అసంతృప్తి కనబడుతోంది. సెక్స్ చేయడం లేదని కోపంగా ఉంటోంది. నేను ఆఫీసుకు వెళ్లాక ఎవరితోనైనా లింక్ పెట్టుకుంటుందేమోనని ఆందోళనగా ఉంటోంది. ఆమెకు రెండుసార్లు సెక్స్ తృప్తి కలిగించేందుకు మందులు ఏమైనా ఉన్నాయా...?
 
జవాబు :  కొందరు స్త్రీలలో సెక్స్ కోర్కెలు కట్టలుతెంచుకుంటాయి. వీలుదొరికినప్పుడల్లా శృంగారంలో పాల్గొనాలని ఉత్సుకత చూపిస్తుంటారు. ఆమె అడిగిన ప్రతిసారి శృంగారంలో పాల్గొనకపోవడం వల్ల ఆమె వేరే పురుషుని పట్ల ఆకర్షితురాలవుతుందేమోనన్న భయం మీలో కనబడుతుంది. కానీ అలాంటి సందేహాలను పక్కనబెట్టండి. భార్యపై నమ్మకం ఉంచాలి. రోజుకి రెండుసార్లు సెక్స్ చేయడం లేదనే అసంతృప్తిని మీకు తెలుపుతుంది కనుక ఆమెను అలా తృప్తి పరిచేందుకు ఆలోచన చేయాలి.
 
అసలు సెక్సుకు ముందు ఫోర్ ప్లేకు మీరు ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనబడటంలేదు. కాబట్టి ముందు ఆమెను అలా సన్నద్ధం చేయాలి. స్త్రీ శరీరం అంతా కామనాడులే. కనుక సెక్స్ చేయబోయే ముందు ఆమెను శరీరంలో ఆయా శృంగార కేంద్రాలను మీటుతూ రతికి సిద్ధం చేయాలి. ఆమె ఆ సుఖానుభూతిలో ఉన్నప్పుడు సెక్స్ కు ఉపక్రమించాలి. ఇలా కాకుండా నేరుగా రతికి ఉపక్రమించిన సందర్భంలో సెక్స్ పరంగా తృప్తి చెందని స్త్రీ మళ్లీ అది కావాలని అడుగుతుంది.
 
కనుక అలా కాకుండా శ్రుంగారపరంగా ఆమెను సిద్ధం చేసి ఆ తర్వాతే సెక్స్ మొదలుపెట్టాలి. ఇలా చేస్తే ఒక్కసారికే సెక్సులో పూర్తి తృప్తిని పొందుతుంది. ఇకపోతే సెక్స్ సామర్థ్యాన్ని పెంచేందుకు మందులున్నప్పటికీ సహజసిద్ధమైన ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారానే ఈ సామర్థ్యాన్ని పొందవచ్చు.

60.కండోమ్ లేకుండా సెక్స్ చేయమంటే వినట్లేదు... ఏం చేయాలి...?


ప్రశ్న :  ఇటీవలే పెళ్లయింది. కనీసం రెండేళ్ల వరకూ పిల్లలు వద్దని అనుకున్నాం. అందుకుగాను ఆయన్ని సెక్స్ చేసేటపుడు కండోమ్ ధరించి చేయమని చెపుతుంటే వినట్లేదు. పురుషాంగాన్ని పట్టుకుని నేను కండోమ్ తొడిగినా కొద్దిసేపటికే దాన్ని పీకి పక్కన పడేసి డైరెక్టుగా చేస్తున్నాడు. వీర్య స్ఖలనం కాగానే యోనిని వెంటనే శుభ్రపరుస్తున్నప్పటికీ గర్భం వస్తుందన్న భయం వెంటాడుతోంది. అతడిని ఎలా ఒప్పించాలో అర్థంకావడంలేదు...

జవాబు :  కండోమ్ ధరించి చేయకపోవడానికి పలు కారణాలుంటాయి. అందులో మొదటిది సెక్స్ సుఖాన్ని పూర్తిగా అనుభవించలేకపోతున్నానని కండోమ్ ధరించిన పురుషుడు మదిలో భావన ఉంటుంది. అలాగే కొందరిలో పురుషాంగా చిన్నదిగా ఉండటం వల్ల కూడా కండోమ్ కారణంగా అంగ స్తంభనలో తేడా ఉంటుంది. మరికొందరిలో కండోమ్ ధరించడం వల్ల తమకు ఎలాంటి ఫీలింగ్ కలుగడంలేదు, అందువల్ల అది లేకుండా చేయాలని చూస్తుంటారు. ఇలా కండోమ్ ధరించకపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి.
 
ఇకపోతే వీర్యస్ఖలనం అయిన వెంటనే యోనిని శుభ్రంగా కడుక్కున్నప్పటికీ యోనిలో వీర్యం స్ఖలించిన తర్వాత గర్భధారణకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక్క వీర్యకణం గర్భాషయం లోపలికెళ్లినా ప్రెగ్నెన్సీ రావడం ఖాయం. అందువల్ల ఆయనకు ఉన్న ఇబ్బందులేమిటో కనుక్కుని చర్చించి, మీ భయాలను ఆయనకు చెప్పి ఒప్పించే ప్రయత్నం చేయండి.

59.భర్త లేరు... హార్ట్ఎటాక్ వచ్చింది.. స్వయంతృప్తి పొందవచ్చా?


ప్రశ్న :  నా వయస్సు 52 యేళ్లు. నా భర్త చనిపోయి ఒక రెండేళ్లు అవుతోంది. నాలో కోర్కెలు ఎక్కువ. భర్త ఉన్న సమయంలో ఆయనతో బాగా ఎంజాయ్ చేస్తూ వచ్చాను. ఆ తర్వాత కోర్కెలు చంపుకోలేక స్వయంతృప్తి విధానాన్ని ఎంచుకున్నా. ఇటీవలే నాకు హార్ట్ఎటాక్ వచ్చింది. అయినా నాలోని కోర్కెలు ఏమాత్రం తగ్గలేదు. గుండెజబ్బుతో బాధపడుతున్న నేను స్వయంతృప్తితో ఆనందం పొందవచ్చా? సలహా ఇవ్వరు.

జవాబు :  హృద్రోగ రోగులు స్వయంతృప్తి ద్వారా ఆనందం పొందడంలో ఎలాంటి తప్పు లేదు. అయితే, వైద్యుడు సూచన చేసినట్టుగా మందులు క్రమం తప్పకుండా వాడాలి. హార్ట్ఎటాక్‌కు గురైన వారు మెట్లు ఎక్కడ, లేదా కొద్ది దూరంగా నడవడం వంటివి సాధారణంగా చేయగలిగితే మాత్రం స్వయంతృప్తిని ఆశ్రయించవచ్చు. అయితే, భోజనం చేసిన వెంటనే, పొట్ట బిగుతుగా ఉన్న సమయాల్లో మాత్రం దీనికి దూరంగా ఉండటం మంచిది. దీనివల్ల శరీరానికి లేదా గుండెకు ఎలాంటి నష్టం లేదని భావించగలరు.

58.నా భర్త వయసు 45 ఏళ్లు... ఐనా సెక్స్ అంటూ వేధిస్తున్నాడు...


ప్రశ్న :  నా వయసు 40 సంవత్సరాలు. నా భర్త వయసు 45 ఏళ్లు. మా ఇద్దరి మధ్య ఎలాంటి సమస్యలు, ఇతరత్రా విభేదాలు లేనేలేవు. కానీ ఎందుకో ఈమధ్య నాకు సెక్స్ అంటే ఇష్టత పోయింది. ఆయన నా సెక్స్ పరంగా నన్ను ఎంత ప్రేరేపించినా సెక్స్ కోర్కెలు కలుగడం లేదు. ఆయనలో సెక్స్ కోర్కెలు ఎక్కువయ్యాయి. ఖాళీ దొరికితే చాలు... బెడ్రూంకు తీసుకెళుతున్నారు. సెక్స్ కావాలంటూ వేధిస్తున్నాడు. ఈ సమస్యను ఎలా డీల్ చేయాలో తెలియడంలేదు...

జవాబు :  సెక్స్ కోర్కెలు పరిస్థితిని బట్టి ఉంటుంటాయి. మీ వయసును బట్టి చూస్తే మెనోపాజ్ ముందు దశ ఏమోనన్న అనుమానం కనబడుతోంది. అదేవిధంగా యోని ద్రవాలు ఊరడం తగ్గిఉండవచ్చు. సెక్స్ బాధాకరం అనిపించి కూడా ఇష్టత పోయే అవకాశం ఉంది. కాబట్టి అసలు సమస్య ఏమిటో చెక్ చేయించుకోండి. సెక్సు మూడ్ బావుంటే వయసుతో సంబంధం లేదు.

Wednesday 5 November 2014

57.నాకు పీరియడ్స్‌లోనే కోర్కెలు ఎక్కువ కలుగుతున్నాయి.. కానీ...!!


ప్రశ్న :  మాది విజయవాడ. నా వయస్సు 34 యేళ్లు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, ఈ మధ్యకాలంలో నాకు బహిష్టు (పీరియడ్స్) కాలంలోనే సెక్స్ కోరికలు ఎక్కువగా ఉంటున్నాయి. కానీ, నా భర్తకు అటువంటి సమయంలో కనీసం నన్ను తాకడానికి కూడా ఇష్టపడటం లేదు. పీరియడ్స్‌లో ఉండగా సంభోగం చేస్తే ఆరోగ్యానికి మంచిది కాదని చెపుతున్నారు. వైద్యశాస్త్రపరంగా ఆయన అభిప్రాయం సరైనదే కావొచ్చు. కానీ, ఆయన తిరస్కార సమాధానం నాకు తీవ్ర నిరాశ కలిగిస్తోంది. దీంతో ఒక్కోసారి స్వయంతృప్తి చర్యలతో ఆనందాన్ని పొందాల్సి వస్తోంది. కొన్ని సందర్భాల్లో పక్కదారిలో (వివాహేతర సంబంధం) వెళ్లి కోర్కెలు తీర్చుకుందామా అనేలా ఆలోచనలు వస్తున్నాయి. ఏం చేయాలి. నా కోర్కెలు ఎలా తీర్చుకోవాలో సలహా ఇవ్వండి.

జవాబు :  సాధారణంగా పీరియడ్స్ సమయంలో సెక్స్ హార్మన్లు చురుగ్గా పని చేస్తాయి. ఆ కారణంగా ఎక్కువ మంది మహిళల్లో కోర్కెలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ మీ విషయంలోనూ అదే జరుగుతోంది. అయితే, మీవారు తిరస్కార సమాధానాన్ని తప్పుపట్టలేం. బహిష్టు సమయంలో సంభోగిస్తే పురుషులకు కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం అధికంగా ఉంది.
 
అయితే, పీరియడ్స్‌లో సెక్స్ చేయకూడదన్న నియమనిబంధనేదీ లేదు. ఇలాంటి సమయంలో దంపతుల మధ్య ఏకాభిప్రాయం ఉంటే.. కండోమ్ ధరించి సెక్స్ చేసుకోవచ్చు. ఈ విషయాన్ని భర్తకు సావధానంగా వివరించి చెప్పి పరిష్కరించుకోవాలేగానీ, తప్పుడు మార్గాన్ని ఎంచుకోవడం ఏమాత్రం మంచిదికాదనే విషయాన్ని గ్రహించండి.

56.సెక్స్ సమయంలో స్త్రీ వక్షోజాలలో మార్పు వస్తుందా...?


జవాబు :   శృంగారంలో పురుషునిలో లైంగిక ప్రేరణలు కల్గించడంలో స్త్రీ వక్షోజాలు కీలక పాత్ర పోషిస్తాయి. పురుషుడు స్త్రీతో శృంగారంలో పాల్గొన్నప్పుడు ఆమె శరీరంలో పలు మార్పులు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా వక్షోజాలలో ఆ మార్పు సుస్పష్టంగా కనిపిస్తుందంటారు సెక్సాలజిస్టులు.
 
స్త్రీ సెక్స్‌పరంగా ప్రేరణ పొందినప్పుడు జననేంద్రియాలలో ముఖ్యంగా వక్షోజాలలో కలిగే మార్పులను నాలుగు దశలుగా విభజించవచ్చు. మొదటిది ఎక్జైట్‌మెంట్ ఫేజ్, రెండోది ఫ్లాటోపేజ్, మూడు ఆర్గజమిక్ ఫేజ్, నాలుగోది రిజల్యూషన్ ఫేజ్‌గా ఉంటాయి.
 
లైంగిక ప్రేరణ కలిగినప్పుడు అంచెలంచెలుగా జననేంద్రియాలలో కలిగే పరిణామాలే వక్షోజాలలో కూడా కలుగుతాయి. సెక్స్ స్పందనలు కలుగగానే మొట్టమొదటిగా, ప్రధానంగా కలిగేది రక్తాధిక్యత. జననేంద్రియాలు, వక్షోజాలు అధికంగా రక్తాన్ని నింపుకుంటాయి. 
 
అధికంగా రక్తం చేరడమనేది ఈ అవయవాల దగ్గర ఉండే చర్మంలోనే కాకుండా ఈ అవయవాలకు సంబంధించిన కండలో కూడా జరుగుతుంది. దీనినే సూపర్ ఫిషియల్ అండ్ డీప్ వాసోకంజిషన్ అంటారు.
 
లైంగిక ప్రేరణ కలిగినప్పుడు స్త్రీల వక్షోజాలలో కలిగే మార్పులు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి. సెక్స్ స్పందనలకి సంబంధించి ఎక్జైట్‌మెంట్ ఫేజ్‌లో ముందుగా చనుమొనలు నిక్కబొడుచుకుంటాయి. గట్టిగా తయారవుతాయి. చనుమొనలలో ఉండే పల్చటి కండరాలు ఉద్రేకానికి లోనుకావడంతో ఈ పరిణామం జరుగుతుంది. చనుమొనలు రెండూ ఒకేసారి నిక్కబొడుచుకోవడం ఉండదు. ముందుగా ఒకటి, కాస్త ఆలస్యంగా రెండోది జరుగుతుంది. అందుకని ముందుగా ఒకటి గట్టిగా మరొకటి కాస్త మెత్తగా అనిపిస్తుంది. 
 
సెక్స్ ప్రేరణతో నిక్కబొడుచుకున్న చనుమొనలు అరసెంటీమీటరు నుంచి సెంటీమీటరు అదనంగా పరిమాణం పెరుగుతాయి. చుట్టుకొలత కూడా పావు సెంటీమీటరు నుంచి అరసెంటీమీటరు అదనంగా పెరుగుతాయి. 
 
సాధారణంగానే పెద్దవిగా ఉండే చనుమొనలు అంతగా పెద్దవి అయినట్లు కనబడవు. చిన్నవిగా ఉండే చనుమొనలు సెక్స్ ప్రేరణతో పరిమాణం పెరిగినట్లు స్పష్టంగా కనబడతాయి. ఎగ్జైట్‌మెంట్ దశలో రక్తాధిక్యత అధికమవుతుంది కనుక వక్షోజాల పరిమాణంలో మార్పు వస్తుంది. చనుమొనలు చుట్టూ రూపాయి మేర ఊదారంగులో ఉండే చర్మం ఉబ్బుగా మారుతుంది. దీంతో అంతకుముందున్న చనుమొనల ఆకృతి తగ్గినట్లుగా కనబడతాయి. 
 
ఇక ప్లాటోఫేజ్‌లో కనబడే సెక్స్‌ఫ్లెష్ కేవలం వక్షోజాల మీదే కాకుండా, ఛాతీ మీద, ఇతర చోట్ల, పొట్టపైనా కనబడుతుంది. దీనినే సెక్స్‌ఫ్లెష్ అంటారు. ఇక లైంగిక ప్రక్రియలో ప్లాటోఫేజ్ నుంచి సుఖప్రాప్తి కలిగే స్థితి ఆర్గజంకు పరుగులు తీస్తాయి. ఈ దశలో వక్షోజాలలో బిగుతు అలాగే నిలబడి ఉంటుంది. చనుమొనలు బాగా నిక్కబొడుచుకుని ఉంటాయి. క్లైమాక్స్‌కు చేరిన పిదప వక్షోజాలు తిరిగి మామూలు స్థితికి చేరుకోవడం జరుగుతుంది. సుఖప్రాప్తి కలిగిన తర్వాత పది నిమిషాల్లో వక్షోజాలు, చనుమొనలు యధాస్థితికి వచ్చేస్తాయి.

55.బ్లూ ఫిల్మ్స్ చూస్తేనే అతనికి మూడ్ వస్తోంది!




ప్రశ్న :  మాకు పెళ్ళయి 2 సంవత్సరాలు అవుతోంది. మా వారు ఒక వింత సమస్యలో ఉన్నారు. బ్లూ ఫిల్మ్స్ చూస్తే గానీ ఆయనకు మూడ్ రాదంటారు. రోజూ అవి చూశాకే సెక్స్ చేస్తారు. నన్నూ చూడమంటారు. నాకు అసహ్యంగా, అవమానంగా అన్పిస్తుంది. బ్లూఫిల్మ్‌లలో స్త్రీలను నగ్నంగా చూస్తేగానీ ఆయనకు ఉద్రేకం కలగదు. తన లైంగిక వికారానికి నా దేహాన్ని వాడుకోవడం అవమానంగా, చీదరగా ఉంది. ఒక డాక్టర్ని ఈ సమస్య గురించి అడిగితే చాలా తేలిగ్గా తీసి పడేసి నీ భర్తే కాదు, అందరు మొగాళ్ళు చూస్తారు. దాంట్లో బాధపడాల్సిందేముంది అన్నాడు. పెళ్ళయినప్పటి నుంచి సహజ ఉద్రేకాలతో శృంగారంలో పాల్గొన్నది లేదు. బెడ్‌రూం అంతా బూతు వీడియోలే. ఆ గది అంటేనే అసహ్యంగా ఉంది. మా వారు మారేదెలా?


జవాబు :  బ్లూఫిల్మ్స్, పోర్న్ సైట్స్ ఒక వ్యసనంలా తయారయ్యాయి. చాలామంది మగవాళ్ళకు యవ్వనకాలంలో చూడటం మొదలై అదొక వ్యసనంలా మారుతుంది. 60, 70 సంవత్సరాల నుండి సెక్స్ కోరికలు, అంగస్తంభనలు తగ్గిన వాళ్ళకు, మానసిక అంగస్తంభన లోపం ఉన్నవాళ్ళకు డాక్టర్స్ దృశ్య శృంగార ప్రేరకంగా బ్లూఫిల్మ్స్ చూడమంటారు. మంచి వయసులో ఉన్న మీ ఆయన వాటికి బానిసగా మారాడనిపిస్తుంది. బ్లూఫిల్మ్స్ లేకుండా అంగస్తంభన జరగడం లేదంటే ఇదొక మనో లైంగిక సమస్యగా మారిందని అర్థం చేసుకోవాలి. నిజంగా చాలా బాధపడ్తున్నావు. నువు కలిసిన డాక్టరు నీ బాధను అర్థం చేస్కోలేదు. పైగా అది చాలా సాధారణ విషయమైనట్లు కొట్టి పడేశాడు. భర్తకి భార్యే గొప్ప శృంగారోత్తేజాన్ని కలిగించేదిగా ఉండాలి. అలాంటిది అతనికి నీ స్పర్శలో స్పందనే లేదంటే అతనికి ఖచ్చితంగా మనో లైంగిక చికిత్స అవసరం. ఇక నువ్వు ఈ బాధని, అవమానాన్ని, తన అసహ్యకరమైన అలవాటుని భరించాల్సిన అవసరం లేదు. నీ బెడ్ రూంలోని బ్లూఫిల్మ్స్ తగలబెట్టు. సహజ శృంగారానికి మాత్రమే ఒప్పుకుంటానని చెప్పు. ఈ విషయం మీ అత్తగారితో చర్చించు. అతనికి కౌన్సెలింగ్, సైకోథెరపీ, సెక్స్ థెరపీ చాలా అవసరం. అతన్ని తీసుకొని సెక్సాలజిస్ట్ దగ్గరికి వెళ్ళు.

54.సెక్స్ పూర్తయ్యాక నేను పడుకుంటాను... ఆమె పరుగెడుతోంది... ఎందుకిలా?


ప్రశ్న :  నాది అసలు సమస్యో కాదో తెలియడంలేదు. మా ఆవిడకు విపరీతమైన శుభ్రత. రోజుకు కనీసం 4 సార్లు స్నానం చేస్తుంది. ఎప్పుడు కౌగలించుకుందామన్నా, వళ్లు బాగోలేదు వద్దని వారిస్తుంది. అదంతా రాత్రిపూట స్నానం చేశాక మాత్రమే అంటుంది. ఎలాగో రాత్రి అయ్యాక సెక్స్ ముగిసిన తర్వాత మర్మావయవాలను శుభ్రం చేసుకోవాలని అంటుంది. నాకేమో వీర్య స్ఖలనం ముగించాక కొద్దిసేపు అలా పడుకోవాలనిపిస్తుంది. ఆమె మాత్రం వీర్యం స్ఖలించిన వెంటనే బాత్రూంకు పరుగెడుతుంది. శుభ్రం చేసుకోవడమే కాదు... స్నానం కూడా చేస్తుంది. మరీ అంత అవసరమా...?

జవాబు :  సెక్స్ ముగిశాక మర్మావయవాలను శుభ్రం చేసుకోవడం ఆరోగ్యమే. కానీ శుభ్రత పేరుతో మరీ అన్నేసి సార్లు అంటే, సెక్సుకు ముందు సెక్సుకు తర్వాత ప్రతిసారీ చేయక్కర్లేదు. సెక్స్ అయ్యాక మర్మావయవాలను శుభ్రం చేసుకోవడం మంచిది. మీరు బద్ధకంగా పడుకుంటానని చెపుతున్నారు. ఐతే శుభ్రం చేసుకున్న తర్వాతనే విశ్రమించాలి. అలాగని సెక్స్ ముగిసిన వెంటనే పరుగెట్టాల్సిన అవసరం లేదు. మీ భార్య విషయంలోనూ... ఆమె వీర్యస్ఖలనం ముగిసిన వెంటనే అలా శుభ్రం చేసేసుకుంటే సంతానం కలిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కనుక సంతానం కావాలనుకునే స్త్రీలు సెక్స్ పూర్తయ్యాక కొద్దిసేపు పడుకున్న తర్వాతనే శుభ్రత పాటించాలి.

Monday 3 November 2014

53.నా గర్ల్ ఫ్రెండ్‌ను విడిచి 6 నెలలు దూరంగా... ఆమె సెక్స్‌లో పాల్గొంటుందేమో...


ప్రశ్న :  నేను ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నాను. అక్కడే ఓ అందమైన అమ్మాయి పరిచయమైంది. అది ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుందామని ఆమె అడిగినా నాకు ఫారిన్ ట్రిప్ ఉండటంతో మరో ఏడాది తర్వాత చేసుకుందామన్నాను. ఐతే ఆమె, నేను రోజుకు రెండుసార్లు సెక్సులో పాల్గొంటాం. ఒకవేళ నేను విశ్రాంతి తీసుకుందామని చెప్పినా సెక్స్ లేకుండా ఆమె ఉండలేదు. నన్ను రెచ్చగొట్టి మరీ సెక్స్ చేయించుకుంటుంది. ఇపుడు నేను విదేశీ పర్యటనలో 6 నెలలు ఉండాల్సి వస్తుంది.

సెక్స్ అంటే అంత పిచ్చి ఉన్న నా గర్ల్ ఫ్రెండ్ మరెవరితోనైనా సెక్సులో పాల్గొంటుందేమోనన్న ఆందోళనగా ఉంది. అప్పటికీ సిగ్గు విడిచి తనతో ఇదే విషయం చెప్పేశాను. ఆమె తను ఎవ్వరితో మాట్లాడననీ, సెక్స్ కేవలం నాతో మాత్రమే చేయాలనిపిస్తుంది తప్ప ఇంకెవరితోనూ చేయనని చెప్పింది. అయినా ఆమె చాలా అందగత్తె. పైగా ఆఫీసులో ఇద్దరుముగ్గురుతో కాస్త చనువుగా ఉంటుంది. నేను ఉండనని తెలిసిన తర్వాత వారు నా గర్ల్ ఫ్రెండును లొంగదీసుకుంటారేమోనని భయంగా ఉంది. ఈ ఆందోళన నుంచి ఎలా బయటపడాలో తెలియడంలేదు...

జవాబు :  మీది అర్థంలేని భయం. మీరు 6 నెలలు విదేశీ పర్యటనకు వెళుతున్నారు. మీలానే మీ గర్ల్ ఫ్రెండ్ కూడా అక్కడ మీరు ఎవరి ప్రేమలోనైనా పడుతారేమో అని భయపడుతుందా... అదేమీ లేదు కదా. జీవితంలో భాగస్వామిగా చేసుకోదలచిన వ్యక్తిపై నమ్మకం ఉండాలి. మరొక వ్యక్తితో సెక్సులో పాల్గొంటావేమోనన్న అనుమానాన్ని ఆమె వద్ద ప్రస్తావిస్తే దానికి ఓపికగా ఆమె సమాధానం చెప్పినందుకు మీరు సంతోషించాలి.

మరొకరెవరైనా అయితే చీవాట్లు తప్పకుండా పడేవి. పెళ్లికి ముందు సెక్స్ అనర్థాలకు దారి తీస్తుంది. అంతేకాదు ఇలాంటి అపోహలకు కూడా తావిస్తుంది. అందుకే పెళ్లికి ముందు ప్రేమికులు శారీరక సుఖాన్ని చవిచూడటం కంటే పెళ్లి చేసుకున్న తర్వాత ఆ పని చేసుకుంటే సంతోషంగా ఉంటారు.

52.రోజుకు 4 సార్లు సెక్స్ చేస్తా... అతిగా చేస్తే అంగం బలహీనమౌతుందా...?!!


ప్రశ్న :  దేవుడి దయ వల్ల నాకు అందమైన భార్య లభించింది. ఐతే ఆమెతో ఎక్కువసేపు దాంపత్య సుఖాన్ని పంచుకోవాలని ఉవ్విళ్లూరుతుంటాను. రోజుకు కనీసం 4 సార్లు సెక్స్ చేయనిదే ఉండలేను. ఇలా చేస్తున్నట్లు నా స్నేహితుడితో చెపితే... మరీ అన్నిసార్లు చేస్తే అంగం బలహీనపడిపోయి భవిష్యత్తులో సెక్స్ చేయలేకుండా అవుతావని అంటున్నాడు. దీనిపై నాకు ఆందోళనగా ఉంది. ఎక్కువసార్లు సెక్స్ చేయడం వల్ల అంగం పనికిరాకుండా పోతుందా...?
 
జవాబు :  మీ స్నేహితుడు చెప్పిన మాట అవాస్తవం.. అది అపోహ. అతిగా సెక్స్‌లో పాల్గొనడం వల్ల లైంగిక అంగం బలహీనపడిపోతుందని కొందరు మగవారు అనుకుంటారు. ఈ భయంతోనే సెక్స్‌కు దూరమవుతారు. నిజానికి ఏ అంగం కూడా వాడనందుకు పాడవుతుందేమో కానీ వాడినందుకు కాదు. కనుక ఎలాంటి భయం అక్కర్లేదు. సెక్స్ చేయగలిగినంత సేపు చేయవచ్చు. శరీరం అలసిపోతే సెక్సుకు దానంతట అదే సహకరించదు. అంతేతప్ప బలహీనమైపోవడం అంటూ ఉండదు.