Wednesday 7 January 2015

88. అంగ ప్రవేశం జరిపీ జరపగానే వీర్యం స్ఖలించేస్తారు. దీంతో నాకు తీవ్రమైన అసంతృప్తి .....





ప్రశ్న :   నా వయస్సు 25 యేళ్లు. నాలుగేళ్ళ క్రితం వివాహమైంది. నాకు, మావారికి సెక్స్ కోర్కెలు ఎక్కువ. దీంతో ప్రతి రోజూ సెక్స్‌లో పాల్గొనాలని పరితపించిపోతుంటాం. అయితే, మా వారికి అంగ స్తంభన సమస్యవుంది. దీంతో ఆయన కామసూత్రాలన్ని పాటించి రెచ్చగొడుతుంటారు. అలా చేస్తున్నంత సేపు నాకు బాగానే ఉంటుంది. తీరా అంగ ప్రవేశం జరిపీ జరపగానే వీర్యం స్ఖలించేస్తారు. దీంతో నాకు తీవ్రమైన అసంతృప్తి కలుగుతోంది. ఎన్ని మందులు వాడినా ఆయన సమస్య పరిష్కారం కావడం లేదు ఏం చేయాలి. సలహా ఇవ్వండి.

జవాబు :   ఇక్కడ మీ వారు ఎదుర్కొంటున్న సమస్య కామోద్రేకం. తీవ్రమైన ఉత్కంఠ, ఆత్రుతకు లోనుకావడం వల్లే ఈ సమస్య ఎదురవుతోంది. యోనిలో అంగ ప్రవేశం చేసిన తర్వాత ప్రతి మూడు నాలుగు స్ట్రోకులకు ఒకసారి కొన్ని క్షణాల పాటు ఆగమని చెప్పండి. అలా చేయడం వల్ల శీఘ్రస్ఖలనాన్ని నిలుపుదల చేయవచ్చు. అలా ఆగిఆగి చేయడం వల్ల ఎక్కువ సేపు సెక్స్‌లో పాల్గొనడమే కాకుండా, మీకు కూడా తృప్తి కలుగుతుంది. ఈ సమస్యకు ఇదే పరిష్కార మార్గం.

87. అంగం పెద్దగా అవడానికి ఏమైనా మందులు ఉన్నాయా?







 జవాబు:    నీ ఎత్తు, బరువు రెండూ ఎక్కువున్నాయి. అధిక బరువు వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. నీకేమన్నా థైరాయిడ్ సమస్య ఉందేమో చెక్ చేసుకో. రోజూ వ్యాయామం, వాకింగ్ చేస్తూ కొవ్వును పెంచే స్వీట్లు, బేకరీ పదార్థాలు తినటం తగ్గించు. ఇక స్తంభించినప్పటి నీ అంగం పొడవు సరిగానే ఉంది. దాని గురించి బెంగ అవసరం లేదు. నువు చాలా లావుగా ఉండటం వల్ల చిన్నగా అనిపిస్తుంది అంతే. ఇక హస్త ప్రయోగం వారానికి 4-5 సార్లు మాత్రమే మంచిది. అతి మంచిది కాదు. హస్త ప్రయోగం వల్ల అంగం సైజు చిన్నగా కాదు. 18 సంవత్సరాల తర్వాత అంగం సైజు పెరగడం ప్రతి ఒక్కరిలో ఆగిపోతుంది. స్తంభించిన తర్వాతి సైజే ముఖ్యం. అంగం పెద్దగా కావడానికి లోకంలో ఎక్కడా ఏ మందులు లేవు. మోసపోవద్దు.

అంగం పెద్దగా అవాల్సిన అవసరం లేదు. నువు ఒకసారి ప్రిమెరైటల్ కౌన్సెలింగ్ తీసుకుని తర్వాతే వివాహం చేసుకో. అయినా, చెబుతున్నాను నువు 100 శాతం వివాహానికి అర్హుడివి. కోరికలు బాగా ఉండటం, అంగం స్తంభించడం, వీర్య స్ఖలనం గావించడం, వీర్య కణాలు సమృద్ధిగా ఉండి మంచి కదలికలో ఉండటం- ఇవన్నీ వివాహ యోగ్య లక్షణాలు. కాబట్టి, నువ్వు బెంగ పడకుండా పెళ్లి చేసుకో.

86. పెళ్ళికి ముందు కొద్దిమందితో ఈయనకి శారీరక సంబంధాలూ ఉండేవట...



ప్రశ్న :   మా వివాహమై సంవత్సరమవుతోంది. మా వారు అందంగా ఉంటారు. పెళ్ళికి ముందు చాలామంది గర్ల్‌ఫ్రెండ్స్ ఉండేవారట. కొద్దిమందితో ఈయనకి శారీరక సంబంధాలూ ఉండేవట. నేను ఈయన్ను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాను. పెళ్లికి ముందు ఆయనకు హస్త ప్రయోగం అలవాటు కూడా ఉందట. ఆ అలవాటు వల్ల తన అంగం చిన్నగా అయ్యిందని, మధ్యన విరిగిందని, వీర్యం సరిగా బయటకు రావడం లేదనీ అంటున్నాడు. ఇంతవరకూ మేమిద్దరం శారీరకంగా ఏకం కాలేదు. నాకు తల్లిని కావాలని ఉంది. మా వారి అనుమానాలన్నీ నిజమేనా? మేం ఏం చేయాలో సలహా ఇవ్వగలరు. 

జవాబు :  ముందు మీరిద్దరు హెచ్‌ఐవి పరీక్ష చేయించుకోండి. బహుశా నీకు అతణ్ని ప్రేమించి పెళ్లి చేసుకునే ముందు అతని గతం తెలిసి ఉండదు. మీ ఆయన అందంగా ఉంటే గర్ల్‌ఫ్రెండ్స్ ఉంటానికి, వేశ్యలతో తిరగడానికి అభ్యంతరాలు ఉండకూడదా? ముందు నీ ఉద్దేశ్యం మార్చుకో. లేదంటే తను చేసింది అతనికి పెద్ద తప్పుగా అనిపించదు. పైగా ఇదే తప్పుడు ధోరణి కొనసాగుతుంది. అందం కంటే వ్యక్తిత్వం, విలువలు ముఖ్యం.

పెళ్లికి ముందు, తర్వాత అక్రమ సంబంధాలు నెరపే పురుషుడి ధక్పథంలో స్త్రీలు పురుషుడి శంగార వాంఛలు తీర్చే లైంగిక వస్తువులు మాత్రమే. ఇక మీ వారి సమస్యకు వద్దాం. అంగం విరగడం అంటూ ఉండదు. అంగస్తంభన సమయంలో ఫ్రెన్యులం అనే భాగం కట్ అయి వుంటుంది. బాగా కట్ అయితే ఆపరేషన్‌తో సరిచేసుకోవచ్చు. అంగస్తంభన బాగానే ఉంది, కాబట్టి దిగులు పడాల్సిన అవసరం లేదు. ఇక వీర్యం రావాల్సినంత స్థాయిలో ఎందుకు బయటకు రావడం లేదన్న దానికి పురుషాంగంలోని యెరెత్రా నిర్మాణంలో లోపాలు, వషణాల నుంచి వీర్యాన్ని మోసుకెళ్లే వీర్య వాహికలలో లోపాలు, అడ్డంకులు, వషణాల్లో ఏమైనా వ్యాధులు, టెస్టోస్టిరాన్ హార్లోన్ల స్థాయిలో లోపాలు బీపీ, షుగరు లాంటి వ్యాధులు, తీవ్రమైన మానసిక అవరోధాలు వంటివి ఏవైనా కారణాలు కావచ్చు. కాబట్టి మీ అతనిని సెక్సాలజిస్ట్ వద్దకు తీసుకెళ్ళండి. సమస్య పరిష్కారం అవుతుంది.