Wednesday 21 October 2015

190. నన్ను సెక్స్‌కు పనికి రానంటున్నారు....


ప్రశ్న :  నా వయస్సు 28 సంవత్సరాలు. మా ఫ్రెండ్స్ కొందరు నన్ను 30 సంవత్సరాలు దాటితే సెక్స్‌కు పనికి రానంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? ఇంకొకటి, అంగం గట్టి పడినప్పుడు 6 అంగుళాలు అవుతుంది. దీనివల్ల మా ఫ్రెండ్స్ నన్ను నా కంటే పొడవెక్కువున్న అమ్మాయినే పెళ్ళి చేస్కోమంటున్నారు. ఇది నిజమా?:



జవాబు :   నీ స్నేహితులది అంతా అశాస్త్రీయ జ్ఞానం, మూర్ఖత్వం. ఆరోగ్యవంతమైన సెక్స్ హార్మోన్లు ఉంటే 90 సంవత్సరాల వరకూ సెక్స్‌లో పాల్గొనవచ్చు. అయితే, 60 సంవత్సరాల తర్వాత సెక్స్‌లో పాల్గొనే ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. అంగం పొడవు (అంగస్తంభన తర్వాత) వల్ల నీకూ, నీ కాబోయే భార్యకూ ఏ విధమైన నష్టమూ కలగదు. ఆ అమ్మాయి పొడవు ఎక్కువున్నా, తక్కువున్నా, యోని పొడవు మాత్రం మూడున్నర అంగుళాలు మాత్రమే ఉంటుంది. అశాస్త్రీయమైన విషయాలు నమ్మవద్దు. సైన్స్ అన్నింటికీ సమాధానం ఇస్తుంది. సెక్సాలజిస్ట్ వద్దకు వెళ్ళి కౌన్సెలింగ్ తీసుకో. అలాగే, పెళ్ళి వయస్సుంది కాబట్టి వివాహం చేసుకో.

189.హస్త ప్రయోగం చేసుకుంటే అనారోగ్యం, ఇతర సుఖవ్యాధులు వస్తాయని చెపుతోంది. ఇది నిజమేనా...?






ప్రశ్న   :  మేమిద్దరం బాగా చదువుకున్నవాళ్లం. ఏడాది క్రితం పెళ్లయింది. మావారికి విదేశాల్లో మంచి ఉద్యోగం. నన్ను కూడా తీసుకెళ్దాం అనుకున్నారు. కానీ మా అమ్మకు సుస్తీ చేయడంతో ఆమెను చూసుకునేందుకు ఇక్కడే ఉండాల్సి వస్తోంది. 6 నెలలుగా ఒంటరిగా ఇంట్లోనే ఉంటున్నా. సెక్స్ కోర్కెలను అదుపు చేసుకోలేకపోతున్నా. అందుకని వివిధ రకాలుగా హస్త ప్రయోగం చేసుకుంటున్నాను. ఇటీవల నా స్నేహితురాలికి నాకు మధ్య దీనిపై చర్చ వచ్చింది. హస్త ప్రయోగం చేసుకుంటే అనారోగ్యం, ఇతర సుఖవ్యాధులు వస్తాయని చెపుతోంది. ఇది నిజమేనా...?

జవాబు  : ఇందులో ఎంతమాత్రం నిజంలేదు. హస్త ప్రయోగం అనేది స్త్రీపురుషుల్లో సహజమైనదే. సెక్స్ కోర్కెలను తాళలేని పరిస్థితి తలెత్తినపుడు ఈ మార్గాన్ని చాలామంది అనుసరిస్తుంటారు. వాస్తవం ఏంటంటే, సెక్స్ కోర్కెలతో రగిలిపోతున్నా, వాటిని అదిమిపట్టి ఆపివేసుకుని శరీరాన్ని ఇబ్బందిపెట్టేకన్నా హస్తప్రయోగంతో స్వయంతృప్తిని పొందడం వల్ల మనసుకు, శరీరానికి స్వాంతన చేకూరుతుంది. ఇటీవల చేసిన పరిశోధనల్లో హస్త ప్రయోగం చేసుకోవడం వల్ల కేన్సర్, మధుమేహం వంటి వ్యాధులు కూడా దరిచేరే అవకాశాలు చాలా తక్కువని తేలింది. అందువల్ల హస్తప్రయోగం అనేది ప్రమాదమేమీ కాదు.

188.నా గర్ల్ ఫ్రెండ్ సెక్స్ గురించి నీకు తెలుసా అని అడిగింది... అంటే...?



ప్రశ్న :  మేమిద్దరం గత ఐదేళ్లుగా క్లోజ్ ఫ్రెండ్సుగా ఉంటున్నాం. ఆ అమ్మాయి చాలా అందగత్తె. టెన్త్ క్లాసు నుంచి ఇద్దరం స్నేహితులుగా ఉన్నాం. డిగ్రీ అయిపోయి ఉద్యోగాల వేటలో ఉన్న మాలో ఆమెకు ఇటీవలే ఉద్యోగం దొరికింది. పార్టీ ఇస్తాను రమ్మని హోటలుకు తీసుకెళ్లింది. నా ఇష్టమైనవన్నీ కొనిపెట్టి తినిపించింది. ఆ తర్వాత మాటల్లో మాటగా సెక్స్ గురించి నీకు తెలుసా అని అడిగింది. నాకేం చెప్పాలో తెలియలేదు.
 
మళ్లీ తనే ఇపుడా గొడవెందుకులే.. అని ముగించేసింది. ఆ తర్వాత నుంచి ఆమెను చూస్తుంటే నాలో సెక్స్ కోర్కెలు కలుగుతున్నాయి. మునుపటిలా ఆమెతో ఉండటంలేదు. ఆమె సెక్సీ భాగాలను తెలియకుండానే తాకేందుకు ప్రయత్నిస్తున్నాను. నేనలా తాకుతున్నా ఆమె ఏమీ అనడంలేదు. అంటే, సెక్స్ చేయమనేగా దీనిర్థం అనుకుంటున్నాను...

జవాబు :  సెక్సీ సంభాషణలు, సెక్స్ గురించిన చర్చ యువతీయువకుల మధ్య... అదీ క్లోజ్ ఫ్రెండ్స్ వద్ద సహజంగానే చోటుచేసుకుంటుంది. అంతమాత్రాన ఆమె మీతో సెక్స్ కావాలని కోరుకుంటున్నట్లు అర్థం కాదు. ఇకపోతే మీరు ఆమెను సెక్స్ వాంఛతో చూస్తున్న సంగతి ఆమె కనిపెట్టిందో లేదో తెలియదు. మీరామెతో సెక్స్ సుఖాన్ని కోరుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. కనుక ఒకవేళ మీరు అదే కోరుకున్నట్లయితే ముందుగా ఆమెతో వివాహం గురించి ప్రపోజ్ చేయండి. ఆ తర్వాత పెద్దల అంగీకారం తీసుకుని పెళ్లి చేసుకున్న తర్వాత మీరు కోరుకున్నది అనుభవించవచ్చు.

187.ప్రేమికులుగా సెక్స్ చేద్దామన్నాడు.... ఇప్పుడు మాజీ భార్య వచ్చేసింది...





ప్రశ్న :   మా ఆఫీసులో కొలీగ్ తన భార్యతో విడాకులు తీసుకున్నాడు. ఇది జరిగి ఏడాది అయ్యింది. ఐతే అతడు ఎంతో మంచివాడు. నా పట్ల మొదట్నుంచీ ఎంతో ఆప్యాయంగా ఉండేవాడు. ఎలాగూ అతడికి భార్యతో విడాకులయ్యింది కనుక అతడిని పెళ్లాడాలనుకున్నాను. మనసులో ఉన్న ఆలోచనను ముందుగా మా తల్లిదండ్రులతో చెప్పేశాను. వాళ్లు ఓకే అన్నారు. పెళ్లి చేసుకోబోయే ముందు ప్రేమికులుగా ఓసారి సెక్స్ చేద్దామన్నాడు.
 
అతడి కోర్కె నాకు కూడా నచ్చింది. పెళ్లికి ముందు ఓసారి లవర్స్ గా సెక్సులో పాల్గొందామన్న అతడి అభ్యర్థనను అంగీకరించాను. ఆ రోజు ఎంతో తృప్తి కలిగింది. ఆ తర్వాత మరోసారి కలిశాం. త్వరలో పెళ్లాడుదామనుకుంటుంటే ఇంతలో అతడి మాజీ భార్య వచ్చేసింది. విడాకులు తీసుకుని తప్పు చేశాననీ, తనతో మళ్లీ కాపురం చేస్తానని అంటోంది. ఈ విషయం తెలిసి నేను షాక్ అయ్యాను. అతడు ఆమె పట్ల మళ్లీ ప్రేమాభిమానాలు చూపుతున్నాడు. పెళ్లి గురించి మాట్లాడితే తొందరేముంది... చూద్దాంలే అంటున్నాడు. నా పరిస్థితి ఏమిటో అర్థం కావడంలేదు...

జవాబు :  పెళ్లికి ముందు సెక్సులో పాల్గొనడం ఎవరికైనా చిక్కులు తెస్తాయి. విడాకులు తీసుకున్నాడు ఇక నాకు అడ్డంకులు ఏమీ ఉండవని మీరు అనుకున్నట్లున్నారు. అందువల్లనే ఈ పరిస్థితి తలెత్తింది. పెళ్లికి ముందు సెక్సులో పాల్గొన్నవారి విషయంలో చాలామందికి ఇలాంటి మోసం జరుగుతున్నట్లు మనం చూస్తూనే ఉంటాం. అలాంటి వాడిని పెళ్లాడాలా వద్దా అనేది ఇక మీ నిర్ణయమే.

186.యోని వదులైందని చికాకు... పురుషాంగాన్ని పట్టి ఉంచే శక్తి ఎలా వస్తుంది...?





ప్రశ్న   :  మాకు బాబు పుట్టి 7 నెలలయింది. ఆయనకు సెక్స్ తృప్తిగా ఉండటంలేదట. యోని చాలా వదులయిందని విసుక్కుంటున్నాడు. ఇదివరకూ బిడ్డ పుట్టకమునుపు ఉన్న బిగుతు ఇప్పుడు లేదంటున్నారు. పురుషాంగాన్ని ప్రవేశపెట్టినా వదులుగా ఉంటోందనీ, తనకు తృప్తిగా లేదంటున్నాడు. యోనిని బిగుతుగా చేసుకునేందుకు ఏవైనా పరిష్కార మార్గాలు ఉన్నాయా...?

జవాబు   :  యోని వదులుగా ఉండటం వల్ల పురుషునికే కాదు స్త్రీకి కూడా రతిలో పూర్తి తృప్తి కలుగదు. వీర్య స్ఖలనానికే కాకుండా సెక్స్ తృప్తికి యోని బిగుతు కీలకం. యోని వదులుగా ఉంటే సెక్స్ చేస్తున్నప్పటికీ స్త్రీ ఆ అనుభవాన్ని ఆస్వాదించలేదు. దీనికి అనేక కారణాలున్నాయి. పిల్లలు పుట్టడం వల్ల కానీ, వయసురీత్యా లేదంటే ఇతర ఆరోగ్య పరిస్థితుల వల్ల యోని వదులు కావడం జరుగుతుంది.

అలాంటి అనుభవం కలిగినప్పుడు యోనిని బిగుతుగా చేసేందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. యోని కండరాలు బిగుతుగా మార్చేందుకు ప్రత్యక వ్యాయామం కెజిల్ వ్యాయామం చేయాలి. అంతేకాకుండా మూత్రం పోసేటపుడు యోని కండరాలను బిగుతుగా పట్టి చూసుకోవాలి. అలా చేసినప్పుడు పెల్విక్ కండరాలు దారిలోకి వస్తాయి. అలా పెల్విక్ కండరాలను గట్టిగా బిగుతుగా పట్టి ఉంచుతూ వదిలేస్తూ ప్రాక్టీస్ చేయాలి. ఈ పద్ధతిని రోజుకు నాలుగైదుసార్లు చేస్తే ఫలితం ఉంటుంది. ఐతే చేయగానే మార్పు వచ్చేస్తుందని అనుకోరాదు. మెల్లగా సమస్య తగ్గిపోతుంది.

185.ఆమె నాతో కాకుండా పెళ్లయిన వాడితో సెక్స్ చేస్తోంది... ఎందుకని?




ప్రశ్న  :  నాకు పెళ్లి కాలేదు. నా స్నేహితుడికి పెళ్లయి ఏడాది దాటింది. ఇద్దరం ఒకే ఆఫీసులో పనిచేస్తున్నాం. ఇటీవల మా ఆఫీసులో అందమైన యువతి ఉద్యోగంలో చేరింది. ఆమెను చూడగానే తొలిచూపులోనే ప్రేమలో పడిపోయా. ఆమెతో స్నేహం చేస్తున్నాను. ఇటీవల ఆమె శరీరం నాకు తగిలించింది. ఆ స్పర్శను చవిచూసిన దగ్గర్నుంచి ఆమెతో సెక్స్ చేయాలనిపిస్తోంది.

ఆమెతో నా మనసులో ఉన్న మాటను చెప్పాను. దానిని సున్నితంగా తిరస్కరించడమే కాకుండా నాతో మాటలు తగ్గించింది. అదేసమయంలో నా వెంట ఉండే పెళ్లయిన స్నేహితునితో క్లోజ్ గా తిరుగుతోంది. ఈమధ్య ఆమె విషయాన్ని నా స్నేహితుడి వద్ద ప్రస్తావిస్తే... తామిద్దరూ సెక్సులో పాల్గొన్నట్లు చెప్పాడు. పైగా నీతో సెక్స్ చేయడం ఆమెకు ఇష్టంలేదట అని అన్నాడు. పెళ్లి కాని నన్ను వదిలేసి పెళ్లయిన వాడితో సెక్సులో ఎందుకు పాల్గొంది. పెళ్లయిన పురుషుడితో సెక్సులో పాల్గొనేందుకు ఆమె ఎందుకు ఇష్టం చూపుతోంది...

జవాబు :  పెళ్లయిన వారు, పెళ్లికాని వారు అనే తేడా ఏమీ ఉండదు. దీనికి కారణం మనస్తత్వాలు, ఆర్థిక స్థితిగతులతో పాటు ఎన్నో అంశాలు ఉంటాయి. సెక్స్ సుఖాన్ని పెళ్లయినవాడితోనే చవిచూడాలని స్త్రీ అనుకుంటుందని మీరు భావించడం కరెక్టు కాదు. మీ వ్యక్తిత్వమో లేదంటే మీకు సంబంధించి ఏదో ఒక విషయం ఆమెకు నచ్చి ఉండకపోవచ్చు. పైగా మీ స్నేహితుడు చెప్పింది నిజమని మీరు ఎలా అనుకుంటున్నారు. ఆమె అతడితో సెక్సులో పాల్గొంటుందనేది వాస్తవమని మీరు ఎలా నమ్మగలరు. అతడు చెప్పినదాన్నే మీరు నమ్ముతున్నారు. ఆమె నిజంగా అతడితో సెక్సులో పాల్గొన్నదో లేదో మీకు తెలియదు కదా.

184.ఫింగరింగ్, ఓరల్ సెక్సుతో భావప్రాప్తి చెందుతోంది... సెక్స్ చేస్తే స్పందించటం లేదు...





ప్రశ్న   :  నా భార్యకు 24 ఏళ్లు. నాకు 26 ఏళ్లు. ఈమధ్యనే పెళ్లయింది. ఆమెకు రతి కంటే ఫోర్ ప్లే పట్ల చాలా ఇష్టం చూపిస్తోంది. ఫింగరింగ్ చేస్తుంటే పరవశిస్తుంది. యోని చూషణ చేస్తుంటే విపరీతమైన తృప్తి చెంది కళ్ల వెంట నీళ్లు పెట్టుకుంటుంది. ఇవన్నీ ముగిశాక అంగ ప్రవేశం చేసి సెక్స్ చేస్తుంటే ఎలాంటి స్పందన లేకుండా ఉంటుంది. వీర్యాన్ని స్ఖలించేటపుడు నేను చెప్పలేనంత తృప్తి చెందుతుంటే ఆమె ఏదో ధ్యాసలో ఉంటుంది. అసలు ఆమెకు రతి కంటే మిగిలిన వాటిలో ఎందుకు అంత తృప్తి కలుగుతోంది. కారణం ఏమిటి...?

జవాబు  : సెక్స్ అనేది శారీరకమైనదే అయినప్పటికీ మనసుకు సంబంధినది కూడా. ఫోర్ ప్లేలో ఫింగరింగ్, ఓరల్ సెక్సులో యోని చూషణ సమయంలో కామవాంఛను ఉత్తేజింపచేసే నాడులకు ప్రేరణ కలుగుతోంది. అందువల్ల ఆమె బాగా తృప్తి చెందుతోంది. కానీ సెక్సు విషయానికి వచ్చేసరికి కేవలం అంగప్రవేశం చేసి వీర్యాన్ని స్ఖలిస్తే అయిపోదు. మధ్యలో ఆమెకు ఇష్టమైన పనులు ఏమిటో చేస్తూ ఉంటే తప్పక క్లైమాక్సుకు చేరేటపుడు మీరు అనుకునే భావప్రాప్తిని చూడవచ్చు. అంతేతప్ప అదేమీ సమస్య కాదు.

183.ఆమెకు సెక్స్ యావ ఎక్కువ... బయట తాళం వేసి వెళుతున్నా...


ప్రశ్న :  నా భార్య చాలా అందంగా ఉంటుంది. అందుకేనేమో ఆమెకు విపరీతంగా సెక్స్ కోర్కెలు ఉన్నట్లు నాకనిపిస్తుంది. పెళ్లయిన మొదట్లో ఆఫీసుకు శెలవు పెట్టి సెక్స్ చేశాను. ఇపుడు ఆఫీసు పనులుతో అలసిపోయి ఇంటికెళితే అర్థరాత్రి దాటినా నిద్రపోనివ్వదు. కనీసం రెండు గంటలపాటు సెక్స్ చేయందే పడుకోనివ్వదు. అందుకని ఈమధ్య ఆమె సెక్స్ కోర్కెలను తీర్చలేక డ్యూటీని పగలు నుంచి రాత్రికి మార్చుకున్నాను.
 
పగటిపూట ఆమె ఆఫీసుకు వెళ్లిపోతుంది. రాత్రి వేళ ఆమె వచ్చేటప్పటికి నేనెళ్లిపోతాను. కొంత ఉపశమనం కలిగించినా ఆమె ఎవరితోనైనా సెక్స్ సంబంధం పెట్టుకుంటుందేమోనని బయట ఇంటికి తాళం వేసి వెళుతున్నాను. ఉదయాన్నే నేనే వచ్చి ఆ తాళం తీస్తాను. కానీ ఇలా చేయడం వల్ల ఆమెలో ఏమయినా నెగటివ్ భావాలు వ్యక్తమవుతాయోమోనని డౌటుగా ఉంది...

జవాబు :   మీరు చేస్తున్న పనులన్నీ సరైనవి కావు. భార్యకు దాంపత్య సుఖాన్ని కలిగించాల్సిందిపోయి తప్పించుకోవడం తప్పు. అలాగే ఆమెను ఇంట్లో ఉంచి తాళం వేయడం మరీ తప్పు. అది ఆమెను మానసికంగా మీరు హింసిస్తున్నట్లే. ఆమె మీపై న్యాయపరమైన చర్య తీసుకుంటే మీ జీవితం నాశనమవుతుంది. ముందు ఇపుడు చేసిన పనులన్నిటికీ ఆమెకు క్షమాపణలు చెప్పండి. మీ డ్యూటీని పగటిపూటకు మార్చుకుని ఆమెకు దాంపత్య సుఖాన్ని అందించేందుకు ప్రయత్నించండి. ఆమె సెక్స్ కోర్కెలు ఎక్కువ అనేది కాదు... ఆమెకు ఎక్కువసేపు ఫోర్ ప్లే ద్వారా తృప్తిపరిచి దాంపత్యాన్ని సంతోషమయం చేసుకోండి.

182.నా వైఫ్ దొంగచాటుగా సెక్స్ వీడియోలు చూస్తోంది... నాకు భయం పట్టుకుంది...




ప్రశ్న :  మేమిద్దరం నెలకోసారి సెక్సులో పాల్గొంటాం. మొన్నీమధ్య నా సెల్ ఫోను చెడిపోతే నా భార్య ఫోనును తీసుకెళ్లా. ఆరోజు సాయంత్రం కాస్త ఖాళీ దొరకడంతో ఫోన్ అంతా తెరిచి చూశాను. అందులో ఇద్దరు మగవారితో ఓ స్త్రీ సెక్సులో పాల్గొనే మూడు పోర్న్ క్లిప్పింగులు కనబడ్డాయి.
 
సెక్సులో పాల్గొంటున్న ఆ జంటల తాలూకు వీడియోను ఆమె రహస్యంగా చూస్తోందన్నది నాకర్థమయింది. ఇదే విషయాన్ని ఆమె వద్ద ప్రస్తావిస్తే నవ్వుతూ తేలిగ్గా కొట్టిపారేసింది. పెళ్లి చేసుకున్న తర్వాత తొలిసారిగా ఆమెవద్ద ఇలాంటి క్లిప్పుంగులు చూశాను. ఆమె వ్యవహారం నాకేమీ అర్థంకావడంలేదు... అసలా క్లిప్పింగులు ఎవరిచ్చారు...? ఈ ప్రశ్నలతో బుర్ర వేడెక్కిపోతోంది..?

జవాబు :   మీరు చెప్పినదాన్ని బట్టి సెక్స్ గ్యాప్ ఎక్కువగా ఉంటోంది. కారణం విశదపరచలేదు కానీ అలా రతి సుఖానికి భారీ విరామం వచ్చినప్పుడు ఎవరయినా ఫాంటసీ సెక్సును ఆశ్రయిస్తారు. ఐతే ఆమెకు ఆ క్లిప్పింగులు ఎక్కడి నుంచి వచ్చాయన్నదే మీ ప్రశ్న. సెక్సుకు సంబంధించి వాంఛలు తీరనప్పుడు దానికి సంబంధించి మాటామంతి ఇరుగుపొరుగు లేదా స్నేహితురాళ్లతో ఆమె పంచుకునే అవకాశం ఉంది. అలాంటప్పుడు వారిలో ఎవరో ఒకరి వద్ద నుంచి ఆమె ఆ క్లిప్పింగులను పొందివుండవచ్చు. ఏదేమైనప్పటికీ దాంపత్య జీవితంలో రతికి సంబంధించి సుదీర్ఘ విరామాలు ఉండరాదని గమనించండి.

181.నాకు ఈ రోగం అంటించి ప్రేమించిన వాడు మాయమయ్యాడు.




ప్రశ్న :   నా వయస్సు 24 సంవత్సరాలు. ఇంకా పెళ్ళి కాలేదు. 19 సంవత్సరాల వయస్సులో ఓ అబ్బాయిని ప్రేమించాను. ఇద్దరం పెళ్ళి చేసుకోవాలని అనుకున్నాం. తన మీద ప్రేమ ఉంటే సెక్స్‌లో పాల్గొనమని ఒత్తిడి చేయడంతో ఒప్పుకున్నాను. మొదటిసారి కలిసినప్పుడు బ్లీడింగ్ అయ్యింది. నెల రోజుల తర్వాత నా యోనికి ఇరువైపుల నీటి కురుపుల్లాగా వచ్చాయి. అలా ప్రతి నెలా ఒకటి రెండు సార్లు వచ్చేవి. హెచ్‌ఐవి టెస్ట్ నెగెటివ్ అని వచ్చింది. లావుగా, ఆరోగ్యంగా ఉండే దాన్ని సన్నగా, నల్లగా అయిపోయాను. నీరసం, మతిమరుపు వచ్చాయి. ఎంతో ధైర్యంగా ఉండే నాకు ఆత్మహత్య చేసుకోవాలనే పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. నాకు ఈ రోగం అంటించి ప్రేమించిన వాడు మాయమయ్యాడు. పెళ్ళి చేసుకోవాలని లేదు. కానీ, ఈ రోగం తగ్గించుకుని ఆరోగ్యంగా ఉండాలని ఉంది...:


జవాబు :  నీకు బహుశ Herpes అనే సుఖవ్యాధి వచ్చి ఉంటుంది. సిగ్గు పడకుండా వెంటనే సెక్స్ విడిఆర్‌ఎల్ స్పెషలిస్ట్ వద్దకు వెళ్ళి చికిత్స తీసుకో. కనీసం గైనకాలజిస్ట్ వద్దకైనా వెళ్ళు. చాలామంది మగవాళ్ళు ప్రేమ ఉంటే సెక్స్‌లో పాల్గొనమని కాబోయే భార్యలను బలవంతం చేస్తుంటారు. వాళ్ళ స్వార్థానికి ఈ పరీక్ష ప్రయోగిస్తుంటారు. నీలాంటి అమ్మాయిలు వాళ్ళ ఎమోషనల్ బ్లాక్ మెయిల్‌కి లొంగిపోయి ఇలాంటి అనర్థాలను కొని తెచ్చుకుంటారు. నిజంగా ప్రేమించే వాళ్ళు కాబోయే భార్యమీద గౌరవం ఉన్న వాళ్ళు, విలువలు తెలిసిన వాళ్ళు ఇలా బ్లాక్‌మెయిల్ చేసి వారిని మానసిక ఆందోళనకు గురిచేయరు. అలా చేస్తే అది నిజమైన ప్రేమ కాదు. అలాంటి వాళ్ళు జీవిత భాగస్వామిగా భవిష్యత్తులో కూడా పనికి రారు.

కాబట్టి, అలాంటి వాళ్ళను వెంటనే తిరస్కరించాలి. జరిగిన దానికి బాధ పడకుండా కంగిపోకుండా డిప్రెషన్ నుంచి బయటపడు. ఆత్మహత్య ఆలోచన మంచిది కాదు. బీఎడ్ చేసిన నువు ఒక టీచరుగా సమాజానికి పనికి వచ్చే విలువైన సంపదవి. నీ పుట్టుకకు ఉన్న విలువ అది. ఆత్మ విశ్వాసంతో ఉండి మంచి చికిత్స తీసుకుంటే వ్యాధి తప్పకుండా తగ్గుతుంది. మంచి పౌష్టికాహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుని నీ విద్యను పదిమందికి పంచు.

Monday 19 October 2015

180.సెక్స్ పుస్తకాలు కనిపించకపోతే.... తనకు మూడ్ రావడం లేదని అంటున్నారు. ...


 ప్రశ్న :   నా భర్తది వింత ప్రవర్తనగా అనిపిస్తోంది. పెళ్లయిన కొత్తల్లో బెడ్రూంలో సెక్స్ పుస్తకాలను చదువుతూ, వాటిని నాకు చెపుతూ సెక్స్ ఎంజాయ్ చేసేవారు. కానీ ఈమధ్య ఆ సెక్స్ పుస్తకాలు కనిపించకుండా పోయాయి. దీంతో సెక్స్ చేయకుండా మిన్నకుండా ఉంటున్నారు. అదేమని అడిగితే తనకు మూడ్ రావడం లేదని అంటున్నారు. అతడిలో ఏమిటీ వింత ప్రవర్తన...?!!



జవాబు :  చాలామంది పురుషులు సెక్స్‌కు ఉపక్రమించే ముందుగా సెక్స్ పుస్తకాలను చదువుతుంటారు. ఈ అలవాటు స్త్రీలలో కూడా ఉంటుంది. పెళ్లయిన కొత్త దంపతులు సెక్స్‌పై పెద్దగా అవగాహన లేని జంటలు ఈ సెక్స్ పుస్తకాలు ఎక్కువగా చదువుతుంటారు. సెక్స్ సాహిత్యం, పోర్నోగ్రఫీ రెండఅంచుల కత్తితో సమానంగా చెప్పుకోవచ్చు. వీటివల్ల ఉపయోగాలు ఉంటాయా లేవా అనేది వారివారి మనస్తత్వ ఆలోచనలను బట్టి ఉంటాయి.

అయితే, కొంతమంది పురుషులు మాత్రం.. సెక్స్ పుస్తకాలు చదవడం వల్ల తమలో మరింతగా కామవాంఛను ప్రేరేపించి రతి క్రియను సమర్థవంతంగా నిర్వహించేలా చేస్తాయని భావిస్తుంటారు. సెక్స్ సాహిత్యం వల్ల లైంగిక విజ్ఞానం పెరిగి సెక్స్ సంబంధాల్లో మెరుగుదల కనిపిస్తుందనేది వాస్తవమే.

అయితే, ఇదే పనిగా సెక్స్ పుస్తకాలను చదవడం వల్ల, సెక్స్ సినిమాలు, బ్లూఫిల్మ్స్‌లు చూడటం వల్ల లైంగిక ఆసక్తిలో తేడాలు ఉండే అవకాశం ఉంటుందని నిపుణలు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో ఆయన ప్రవర్తనను మెల్లగా మార్చాల్సిన అవసరం ఉంది.

179.గ్రూప్ సెక్స్ చేద్దామని వత్తిడి చేస్తున్నాడు... మజాగా ఉంటుందా...?





ప్రశ్న  :  నా స్నేహితుడుతో నేను ఇటీవల సెక్స్ సంబంధ విషయాలను చర్చించడం మొదలుపెట్టాను. అతడు ఈమధ్య నాతో గ్రూప్ సెక్స్ గురించి చెప్పాడు. అది చాలా మజాగా ఉంటుందనీ, ఒక్కసారి రుచి చూడమని ఆఫర్ చేస్తున్నాడు. గ్రూప్ సెక్స్ సేఫ్ కాదని అంటారు. నా భార్యతో నేను సెక్సులో పాల్గొంటూ ఉంటాను. ఐతే నా స్నేహితుడు చెప్పే గ్రూప్ సెక్సులో పాల్గొంటే నిజంగా మజాగా ఉంటుందా...?

జవాబు   :  ఇలాంటి సాముహిక లైంగిక సుఖాలనేవి పోర్న్ చిత్రాల్లో కనబడుతుంటాయి. కానీ వాస్తవంలో ఇలాంటి రతి క్రియ ఆరోగ్యానికి క్షేమం కాదు. వీటివల్ల సెక్స్ సంబంధ వ్యాధులు సంక్రమిస్తాయి. మీ స్నేహితుడితో ఇకపై అలాంటి చర్చను తీసుకురావద్దని చెప్పేయండి.

178.ఆ ఛాటింగ్ అమ్మాయిని మర్చిపోకలేకపోతున్నా... భార్యతో తృప్తిగా ఉండటంలేదు...






ప్రశ్న  :  నాకు ఛాటింగులో ఓ అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఆ ఛాటింగ్ మా ఇద్దరినీ బాగా ముందుకు తీసుకెళ్లింది. కానీ మూడు నెలల తర్వాత విడిపోయాం. తప్పు నాదేననిపిస్తుంది. ఆమెను మరచిపోలేకుండా ఉన్నాను. మరో అమ్మాయి నా జీవితంలోకి వచ్చి నన్ను సెక్స్ పరంగా సుఖపెడుతున్నా ఆ అమ్మాయే గుర్తుకు వస్తోంది. ఆమె గుర్తుకు వస్తే చాలా బాధగా ఉంటోంది. ఇది నాకు వదలదా...?

జవాబు   :  మీ జీవితంలోకి వచ్చిన అమ్మాయిలో కూడా నీ పాత ప్రేయసిని వెతుక్కుంటూ కూర్చుంటే మీ బాధ వదలదు. మొదటి అమ్మాయిలో మంచి గుణాలు ఉండి ఉంటాయి. అందరిలోనూ అలాంటి గుణాలే ఉండాలంటే ఉండవు కదా. జీవితంలో సెటిలయి సుఖంగా ఉండాలనుకుంటున్నారా.. లేదంటే ఇలా ఆలోచిస్తూ ఆరోగ్యం చెడగొట్టుకోవాలనుకుంటున్నారా... కాబట్టి మీ మాజీ ప్రేయసి జ్ఞాపకాలను వదిలేసి కొత్తగా మీ జీవితంలో అడుగుపెట్టిన అమ్మాయితో హాయిగా కాపురం చేసుకోండి. భవిష్యత్ గురించి ఆలోచించండి.

177.నా మరదలు నా వల్ల గర్భవతి అయింది... రహస్యం బయటపడుతుందా...?






ప్రశ్న  :  నా భార్యకు, నా మరదలికి ఏడాది వయసు తేడా. నా పెళ్లి జరిగాక నా భార్యతోపాటు నా మరదలు కూడా వచ్చింది. తన అక్కతో ఉన్నప్పుడు ఆమె నన్ను ఆటలు పట్టించేది. ఆ తర్వాత ఓ ఏడాదికి పెళ్లయిపోయింది. ఆమెకు ఫారిన్ అబ్బాయి దొరికాడు. అతడు పెళ్లయిన 15 రోజులకే విదేశాలకు వెళ్లాడు. అతడు వెళ్లిన నాలుగు రోజులకు నా మరదలు మళ్లీ మా ఇంటికి వచ్చింది.

అప్పుడు ఆమె నాకు బాగా దగ్గరయింది. ఆమెతో చాలా సన్నిహితంగా మారడంతో ఒక్కసారి సెక్స్ కావాలని బతిమాలాను. ఆమె సరే అంది. ఆరోజు ఇద్దరం పూర్తిగా సెక్సు సుఖాన్ని చవిచూశాం. మరుసటి వారంలో ఆమె నెల తప్పింది. ఐతే ఇది నా మరదలి భర్త వల్లే అని అంతా అనుకుంటున్నారు. కానీ ఆమె నెల తప్పింది నా వల్లనే అని నా మరదలికి నాకు మాత్రమే తెలుసు. ఈ రహస్యం బయటపడుతుందా...?

జవాబు  :  తప్పు చేసిన తర్వాత రహస్యం బయటపడుతుందా అనేది మీ ఇద్దరిలో ఎవరో ఒకరు చెబితే తెలుస్తుంది. ఇకపోతే ఆమెకు పుట్టే బిడ్డకు అచ్చు మీ మొక్కట్లు వస్తే అనుమానం కలుగవచ్చు. దాని ద్వారా నిజం తెలియవచ్చు. అలాగే మీ మరదలి బిడ్డను మీ బిడ్డలా మీరు ఎక్కువగా ప్రేమాప్యాయతలు కురిపిస్తున్నా డౌటు కలుగవచ్చు. ఇలాంటి అక్రమ సంబంధాలు ఎప్పటికైనా సమస్యలకు మూలం కాగలవని గ్రహించండి

176.నా సెక్స్ సామర్థ్యంపై ఆమె ఎగతాళి చేస్తోందా...?





ప్రశ్న   :  పెళ్లయిన మొదట్లో నా భార్యకు నేనంటే ఎంతో గౌరవం ఉండేది. ఐతే ఆమెకు సెక్స్ గురించిన విజ్ఞానం లేదని కొన్ని సెక్స్ తాలూకు వీడియోలు చూపాను. వాటిని చూచిన దగ్గర్నుంచి ఆమెలో మార్పు కనబడుతోంది. నేను సెక్సులో పాల్గొన్నప్పుడు, సెక్స్ వీడియోల తాలూకు దృశ్యాల గురించి వర్ణిస్తూ నన్ను గేలి చేస్తున్నట్లు మాట్లాడుతోంది. ఒక్కోసారి కుళ్లు జోకులేస్తోంది. ఆ జోకులేశాక నవ్వుతోంది. ఆమె వైఖరి ఏమిటో నాకు అర్థం కావడంలేదు. నా సెక్స్ సామర్థ్యంపై ఆమె ఎగతాళి చేస్తోందా...?!!

జవాబు   :  ఆమెకు సెక్స్ విజ్ఞానం ఉంటే బావుంటుందని దాని తాలూకు చిత్రాలు చూపించారు. ఇపుడామె వాటి గురించి మాట్లాడుతుంటే మీ సామర్థ్యం గురించి ఆమె మాట్లాడుతుందని ఎందుకు అనుకుంటున్నారు. సెక్స్ గురించిన విజ్ఞానం తెలిపిన మీరు ఆమె మాటలను స్పోర్టివ్‌గా తీసుకుని దాంపత్య క్రియను మరింత ఆనందంగా పంచుకోండి. ఆమె మిమ్మల్ని ఎగాతాళి చేస్తుందని ఎందుకనుకుంటున్నారు. సెక్స్ గురించి మీరు తెలిపిన విజ్ఞానం ఆమెకు బాగా అర్థమయ్యిందని అనుకోండి. ఒకవేళ మీకలా అనిపిస్తే ఆమెను ఈ విషయమై రతిక్రియ ముగిశాక ప్రశ్నించండి. సమాధానం దొరుకుతుంది.

175.నా ఫ్రెండ్స్ ప్రియులే నచ్చుతున్నారు... మరో మగాడు నచ్చడంలేదు... ఎందుకని?





ప్రశ్న   నా వయసు 25 ఏళ్లు. ప్రభుత్వోద్యోగం వచ్చింది. నచ్చినవాడిని నువ్వే సెలక్ట్ చేసుకుని మాకు చూపిస్తే పెళ్లి చేస్తామని మా పేరెంట్స్ నాకు స్వేచ్చనిచ్చేశారు. ఇక అప్పట్నుంచి నాకు నచ్చేవాడి కోసం వెతుకుతున్నాను. నాకు ఎవరైనా నచ్చారా అనుకుంటే వారంతా నా స్నేహితురాండ్ర ప్రియులే అవుతున్నారు. అంతేకానీ... వేరే మగాడు ఎవ్వరూ నాకు నచ్చడం లేదు. ఎవరైనా తారసపడినా వాళ్లతో కొద్దిసేపు మాట్లాడగానే కంపరం పుడుతోంది. ఇలాగైతే నాకు నచ్చినవాడు దొరికేదెప్పుడు నేను పెళ్లి చేసుకునేదెప్పుడు...?

జవాబు   :  నచ్చినవాడు... మీ స్నేహితురాళ్లు మీతో చాలా చనువుగా ఉంటారు. వారి ప్రియుల గురించి చాలా మంచిగానే చెపుతుంటారు. ఇంకా తమతమ లవర్స్ లో ఏవైనా నెగటివ్ షేడ్స్ ఉన్నా కప్పేసి చెప్పడం చాలామంది చేస్తుంటారు. ఇది మగవారు కూడా చేస్తూనే ఉంటారు. మరీ రచ్చకెక్కినప్పుడు మాత్రమే తేడాలు బయటకు వస్తాయి. అంతేతప్ప ముందుగా అందరూ మంచివారిగానే కనబడుతుంటారు. అలాగే మీ స్నేహితురాళ్ల ప్రియులు విషయమూ అంతే. అలాగని చెడ్డ లక్షణాలుంటాయని కాదు.

ఇకపోతే... మీకు తారసపడుతున్న పురుషులతో మీరు మాట్లాడేది, చర్చించేది చాలా తక్కువే ఉంటుంది. ఎవరో చెబితే తప్ప మీకు మీరుగా ఫలానా వ్యక్తి మంచివాడని తెలుసుకోలేరు. నచ్చినవాడిని మీరు ఎంపిక చేసుకోలేనట్లయితే తల్లిదండ్రులకే ఆ పని అప్పజెప్పండి. తప్పకుండా మంచివాడిని తెచ్చి పెళ్లి చేస్తారు.

Sunday 4 October 2015

174.ఈయన చెడు అలవాట్లను మాన్పించేదెలా...?





ప్రశ్న  :  మా ఇద్దరికీ పెళ్లయి బిడ్డ పుట్టేవరకూ దాంపత్యం సంతోషంగా ఉంది. ఇప్పుడు నా భర్త వింత ప్రవర్తనతో నాకు పిచ్చెక్కేట్లు ఉంది. రోజుకో భంగిమలో సెక్సు చేయాలనడమే కాకుండా ఈమధ్య అంగాన్ని చూషించాలంటూ ఒత్తిడి చేశారు. ఇంత చెడ్డ పని ఎందుకు చేయమంటున్నాడో నాకు తెలియడంలేదు. యోని చూషణ చేస్తానని కూడా ఒకరోజు గందరగోళం చేశాడు. దానిక్కూడా నేను ససేమిరా అన్నాను. చివరికి పోర్న్ ఫిలిమ్ చూపించి, అందులో వారలా చేసుకుంటున్నప్పుడు మనం చేసుకోవడంలో తప్పేమిటి అంటున్నారు. ఈయన చెడు అలవాట్లను మాన్పించేదెలా...?

జవాబు   :  రతిలో మంచి, చెడు అనేవి ఉండవని గమనించండి. భార్యాభర్తలకు ఇష్టమైతే ఇరువురూ సంతోషంగా వివిధ భంగిమల్లో సెక్సును ఆస్వాదించవచ్చు. ఓరల్ సెక్స్ అనేది కొందరికి విపరీతంగా ఇష్టం ఉంటుంది. మరికొందరికి అస్సలు ఇష్టం ఉండదు. ఐతే భాగస్వామి కోరిక మేరకు నెరవేర్చక తప్పని స్థితి కూడా ఉంటుంది. కాబట్టి అతడి కోర్కెలను చెడు అలవాట్లు అనుకోవాల్సిన పనిలేదు. ఒకసారి ఆయన కోర్కెను సమ్మతిస్తే పదేపదే తిరిగి ఇలాంటి కోర్కెలను ప్రస్తావించకపోవచ్చు. దాంపత్యంలో పరస్పరం అర్థం చేసుకుని ముందుకు వెళ్లాలి.

173. అలాంటి భంగిమల్లో సెక్స్ కావాలని అడుగుతోంది... ఆమెపై అనుమానంగా ఉంది...







ప్రశ్న  :  ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ప్రేమించే సమయంలోనే ఆమె గురించి నాకు బాగా తెలుసు. ఆమె చాలా ఫాస్ట్. మోడ్రన్ కల్చర్ అంటే చాలా ఇష్టం. ఆమె భావాలు నాకు నచ్చి పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడామె ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తోంది. శోభనం రోజున మాటల మధ్యలో ఓ ప్యాకెట్ బయటకు తీసింది. అందులో ఉన్న పుస్తకాన్ని తీసి నా చేతిలో పెట్టింది. ఆ పుస్తకంలో ఉన్న భంగిమలను చూస్తూ చాలా ఎక్జయిట్ అయ్యింది. అలాంటి భంగిమల్లో సెక్స్ కావాలని అడుగుతోంది. ప్రతి రోజూ కొత్త భంగిమలో చేయమని అడుగుతోంది. ఇలా ఎందుకు కోరుతుందో అర్థం కావడం లేదు. ఆమెకు సెక్స్‌లో అనుభవం ఉందా అనే సందేహం కలగడమే కాకుండా, నేను ఆమెను సంతృప్తిపరచలేక పోతున్నానేమోనని అనుమానం కూడా వస్తోంది. నా అనుమానం ఎంతవరకు నిజమో తెలియడంలేదు...

జవాబు   :  మీవి అర్థంలేని అనుమానాలు. మీరు సంతృప్తిపరచకుంటే ఆమె మిమ్మల్ని ప్రతిరోజూ ఓ కొత్త భంగిమలో సెక్స్ చేయమని కోరదు. రోజుకో కొత్త భంగిమలో సెక్స్ చేసుకోలనుకోవడంలో తప్పేమీ లేదు. ఇప్పటి అమ్మాయిలు సెక్స్ పరిజ్ఞానాన్ని అబ్బాయిలతో సమంగానే తెలుసుకునే అవకాశం వచ్చింది. కాబట్టి ఆమె అడుగుతుందంటే ముందే అనుభవం ఉందని అనుమానం పెంచుకోవడం మంచిది కాదు. ఇకపోతే కామసూత్రలో కొన్ని భంగిమలు క్లిష్టతరంతో కూడుకున్నవి. వాటిని వేయాలంటే కొంత సాధన అవసరం.

172.ఆమె వక్షోజాలు లావయ్యే మార్గం ఏమిటి...?





ప్రశ్న   :  ఆమె చాలా అందగత్తె. దానికితోడు ఆమె ఎద సంపద కూడా చాలా పుష్కలంగా ఉండటాన్ని చూసి మా పేరెంట్స్ ను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాను. కానీ తొలిరాత్రి నాడు అసలు సంగతి బోధపడింది. సెక్స్ చేసేముందు ఆమె వక్షోజాల సైజులు చూసి షాక్ తిన్నాను. చాలా చిన్నవిగా ఉన్నాయి. అదేమిటని అడిగితే... ఆమె తన వక్షోజాలను పెద్దవిగా అందంగా ఉంచేందుకు బ్లౌజు లోపల ప్యాడ్స్ ధరించి అలా కనిపించిందట. అందులో తప్పేముంది... అందంగా కనిపించేందుకు ఈరోజుల్లో ఎన్నో మార్గాలు అవలంభించడం మామూలే కదా అని అంటోంది.

కానీ ఆమె చిన్న సైజు వక్షోజాలు చూసిన తర్వాత ఆమెతో సెక్స్ చేయాలనే కోర్కె సన్నగిల్లుతోంది. పైగా నన్ను అలా మోసం చేసిందని బాధేస్తోంది. కనీసం ఆమె వక్షోజాల సైజులను పెంచే మార్గం ఏదయినా ఉంటే... వాటి ఆకృతులను పెద్దవి చేసి నేను కోరుకున్న రీతిలో వస్తే ఆనందించాలని కాంక్ష ఉన్నది. అలాంటి మార్గం ఉంటే... అలా చేయించుకునేందుకు తను కూడా సిద్ధమే అంటోంది...


జవాబు   :  వక్షోజాల పరిమాణం వారివారి శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది. కొందరు సన్నగా ఉన్నప్పటికీ వక్షోజాల ఆకృతులు చాలా లావుగా ఉంటాయి. మరికొందరు బొద్దుగా ఉన్నప్పటికీ వక్షోజాల సైజులు ఎంతమాత్రం పెద్దవిగా కనిపించక చిన్నవిగా ఉంటాయి. ఇలాంటివారు తమ శరీరానికి తగినట్లు ఎద సంపద లేదని ప్యాడ్స్ ఉపయోగిస్తుంటారు. ఇందులో తప్పేమీ లేదు. కాకపోతే వక్షోజాల ఆకృతులను పెంచుకునేందుకు శస్త్ర చికిత్సలు ఉన్నప్పటికీ వాటివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయి. అందువల్ల వక్షోజాల కింద ఉండే కండరాలకి బలాన్నిచ్చే వ్యాయామాలు చేయాలి. అలా చేస్తే కొంతవరకూ వాటి సైజుల్లో తేడా వస్తుంది. మరీ వక్షోజాల ఆకృతులు పెద్దవిగా ఉండాల్సిందే అనుకుంటే కాస్మొటిక్ సర్జన్ ను కలిసి తగు సలహాలు తీసుకుని వారు చెప్పినట్లు పాటించవచ్చు.

171.కోర్కె తీర్చమని ఒత్తిడి చేస్తోంది.. ఏం చేయాలి?





ప్రశ్న  :  నా వయస్సు 24 యేళ్లు. నా చిన్నపుడే తల్లిదండ్రులు పోయారు. దీంతో మామయ్య అత్తమ్మ వాళ్లింట్లోనే పెరిగాను. ఒక రోజున ఉన్నట్టుండి ఎవరూ లేని సమయంలో గట్టిగా కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంది. ఉన్నట్టుండి ఇలా చేయడంతో నేను షాక్‌కు గురయ్యాను. మరో రెండు రోజుల తర్వాత సెక్స్ చేయమని ఒత్తిడి చేస్తోంది.

నేను కూడా యుక్త వయస్సులో ఉండటంతో కోర్కెలు గుర్రాలై పరుగెడుతున్నాయి. కానీ, నా మనస్సు మాత్రం తప్పు చేస్తున్నామనే ఫీలింగ్ ఉంది. ఏం చేయాలి. ఆ ఇంటి నుంచి బయటకు వెళితే నాకు మరో దిక్కు లేదు. కానీ, మా అత్త చేసే పనులు నాకేమాత్రం నచ్చడం లేదు ఏం చేయాలి.?

జవాబు   :  క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. పైగా మీ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఆమె అలా ప్రవర్తించడానికి కారణంగా భర్త ద్వారా తగిన తృప్తి లభించక పోవడమే. పైగా... ఇంట్లోనే ఉండటం వల్ల ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండానే తన కోర్కెలను తీర్చుకోవచ్చన్న కారణంతోనే ఆ విధంగా ప్రవర్తిస్తోంది. ఇలాంటి ఆటలు చాలా ప్రమాదంతో కూడుకున్నవి. ఆమె చేస్తున్నది తప్పు అని తెలుసుకాబట్టి.. మీకై మీరే కాస్తంత దూరంగా ఉండండి. అవసరమైతే ఏదో ఒక ఉద్యోగం చూసుకుని సొంత కాళ్ళపై నిలబడేందుకు ప్రయత్నించండి. ఎంత ఒత్తిడి చేసినా.. సున్నితంగానే తిరస్కరించి దూరంగా ఉండటమే ఉత్తమైన మార్గం.

170.ఫోర్ ప్లేనేగా... వేరే పెళ్లి చేస్కో అంటున్నాడు... ఏం చేయాలి?





ప్రశ్న   :  మేమిద్దరం గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. కానీ శారీరకంగా ఏకం కాలేదు. కానీ ఈమధ్య ఓసారి సినిమాకెళ్లినప్పుడు నా బాయ్ ఫ్రెండ్ ఏదేదో చేశాడు. లైంగికంగా ఉద్రిక్త చెందేట్లు ఫోర్ ప్లే చేశాడు. అప్పట్నుంచి అతడు చేసినవే గుర్తుకొస్తున్నాయి. సెక్స్ కోర్కెలు కలిగినా పెళ్లికి ముందు అలాంటి వాటికి దూరంగా ఉండాలని అతడిని దూరం పెట్టేశాను. ఏడాది నుంచి ఒకరికొకరు దూరంగా ఉన్నాం. నాకు ఇంట్లో వేరే సంబంధాలు చూస్తున్నారు. తనకి కూడా వస్తున్నాయట.

మేమిద్దరం మా పేరెంట్స్‌కి మా ప్రేమ విషయం చెప్పలేదు. ఇప్పుడు చెప్పినా వారు ఒప్పుకోరు. ఎందుకంటే... నన్ను చేస్కోబోయే అబ్బాయి మంచి ధనవంతుల ఫ్యామిలీ. అతడి కుటుంబం పేద కుటుంబం. ప్రేమ వ్యవహారాన్ని చెప్పేద్దామని అంటే అతడు ఒప్పుకోవడంలేదు. మరి మనమధ్య జరిగిన ఫోర్ ప్లే అని అడిగితే... ఫోర్ ప్లేనే కదా... అదో పీడకలలా మర్చిపో. నువ్వు సంతోషంగా పెళ్లి చేసుకుని ఆనందంగా ఉండు అంటున్నాడు. ఏం చేయాలో తెలియడంలేదు...




జవాబు   :  ఇరువురు పరస్పరం ప్రేమలో పడిన తర్వాత, ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడినప్పుడు ఆ విషయాన్ని తల్లిదండ్రులకు వెంటనే చెప్పేస్తే మీ పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదు. ఇప్పుడు చేయిదాటి పోయింది. తల్లిదండ్రులు మీ విషయం తెలియక వేరే సంబంధాలను చూస్తున్నారు. ప్రేమించినవాడు కూడా మీకు వస్తున్న సంబంధాలతో పోల్చుకుని తనను అల్లుడిగా మీ తల్లిదండ్రులు ఒప్పుకోరని అనుకుంటున్నాడు. కనుక ఇప్పటికిప్పుడు మీ తల్లిదండ్రులకు మీరు చెబితే దాని పర్యవసానం ఎలా ఉంటుందో తెలియదు. ఒకవేళ ఎంతో శ్రమపడి మీరు ఒప్పించినా మీ బాయ్ ఫ్రెండ్ పెళ్లి చేసుకుంటాడో లేదో అదీ తెలియదు. కనుక పాత జ్ఞాపకాలను వదిలేసి కొత్త జీవితాన్ని ప్రారంభించండి.

169.అంగాన్ని చూసేందుకు.. చేత్తో తాకేందుకు సిగ్గుపడుతోంది.. ఏం చేయాలి?






ప్రశ్న   :  వివాహమై నెల రోజులు మాత్రమే అయింది. పెద్దలు కుదిర్చిన వివాహం. ఫక్తు సంప్రదాయ కుటుంబానికి చెందిన అమ్మాయి. దీంతో పడక గదిలో కూడా అదే సంప్రదాయ బద్ధంగా నడుచుకుంటోంది. శోభనం రోజున అనేక కష్టాలు పడి తూతూ మంత్రంగా ఆ కార్యం ఒక్కసారి మాత్రమే పూర్తి చేశాను. ఆ తర్వాత మూడు రోజుల పాటు దగ్గరకు రానివ్వలేదు. హానీమూన్‌కు వెళ్లాక.. అక్కడ అన్ని విపులీకరించిన తర్వాత కొంతమేరకు బిడియం తగ్గించుకుని సహకరించింది. అయితే, నగ్నంగా మారేందుకు ఒప్పుకోలేదు. అలాగే నా అంగాన్ని చూసేందుకు, పట్టుకునేందుకు సమ్మతించలేదు. ఏం చేయాలి. ఆమెను ఎలా దారికి తెచ్చుకోవాలి. సలహా ఇవ్వండి.

 జవాబు సాధారణంగా పెళ్లయిన కొత్తలో రతిలో పాల్గొనే యువతులకు బిడియం ఉండటం సహజమే. పైపెచ్చు శోభనం రోజునే భర్త కోరుకున్నట్టుగా ఏ యువతి కూడా ఉండలేదు. ఇది చాలా మంది భర్తలకు తీవ్రమైన అసంతృప్తిని కలిగిస్తుంది. దీంతో వారు పూర్తి నిరాశతో రాత్రుళ్లు వెళ్లదీయాల్సి వస్తుంది.

ఇలాంటి వారు సెక్స్ నిపుణులను సంప్రదించి సెక్స్ పట్ల తమలో ఉన్న బిడియాన్ని, అపోహలను నివృత్తి చేసుకోవాలని సలహా ఇస్తున్నారు. ప్రధానంగా సెక్స్‌లో పాల్గొనే స్త్రీపురుషులు సమానమన్న అభిప్రాయం వారిలో ఉండాలి.

పెపెచ్చు.. సంసార జీవితంలో మగాడిదే పైచేయి అనే రోటీన్‌ అభిప్రాయం కారణంగా, పలువురు స్త్రీలు భర్త మాటే చెల్లుబాటు అయ్యేలా కిమ్మనకుండా ఉండిపోతారు. ఈ కారణంగా తమలో దాగివున్న మనోభావాలను వారు స్వేచ్ఛగా వెల్లడించలేక పోతారు. ఇలాంటి వారు మొదటి చేయాల్సిన పని.. తమలోని సంకోచాన్ని విడనాడాలని వారు సలహా ఇస్తున్నారు.

రతిలోపాల్గొనే స్త్రీపురుషులు.. ఇరువురి ఇష్టాయిష్టాలను తెలుసుకుని ఆ విధంగా పడక గదిలో నడుచుకోవాలని కోరుతున్నారు. భార్యకు మౌఖిక రతి పట్ల ఆసక్తి ఉంటే దాన్ని చేసేందుకు భర్త అడ్డు చెప్పకూడదు. అలాగే, భర్తకు ఇష్టమైన రీతిలో నడుచుకునేందుకు భార్య కూడా సమ్మతం తెలిపితే సంసార జీవితం సుఖంగా సాగుతుందని చెపుతున్నారు.

రతి చేసే సమయంలో త్వరగా వీర్య స్కలనం అవుతుంటే.. లైంగిక ప్రేరణల ద్వారా స్కలనాన్ని తొలుత విసర్జించమని చెప్పాలి. స్కలన సంకేతం వెలువడనంతసేపు రతిలో వాంఛను, ప్రేరణను కొనసాగిస్తూ రతి చేయవచ్చు. స్కలన సమయమైపోతుందన్న సేపు రతి చేయవచ్చు. అలాగే ఆయన హస్త మైధునం చేసుకునే సమయంలో కూడా ఈ టెక్నిక్‌ అనుసరించవచ్చని వైద్యులు సలహా ఇస్తున్నారు.

168.సెక్స్ సమయంలో పురుషాంగం ఎంతవరకు లోపలికి వెళ్లగలుగుతుంది..?





ప్రశ్న   :  మాకు ఈమధ్యనే పెళ్లయింది. ఇద్దరం దాంపత్యంలో బాగానే పాల్గొంటాం. కానీ నాకో సందేహం కలుగుతోంది. సెక్స్ సమయంలో నా పురుషాంగం ఒక్కోసారి పొడవు ఎక్కువవుతుంది. అలాంటి సమయాల్లో సైతం నా భార్య బాధగా ఉన్నట్లు చెప్పదు. కొన్ని సమయాల్లో మామూలుగా ఉంటుంది. అప్పుడు కూడా ఎంజాయ్ చేస్తూనే ఉంటుంది. అంత పొడవైనప్పుడు అలాగే ఉండే ఆమెకు కొన్నిమార్లు ఇలాగైతే అసంతృప్తి కలుగదా... అసలు సెక్స్ సమయంలో పురుషాంగం ఎంతవరకు లోపలికి వెళ్లగలుగుతుంది..?



జవాబు   :  ఇలాంటి అర్థపర్థం లేని సందేహాలతో చాలామంది పురుషులు తమ దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేయడం మాని ఆలోచనలతో పాడుచేసుకుంటుంటారు. పురుషాంగం సెక్స్ సమయంలో స్తంభించిన తర్వాత ఇక దాని పొడవుతో సంబంధం లేదు. స్త్రీ యోనిలో కామనాడులు 2 నుంచి 4 అంగుళాల లోతు వరకూ ఉంటాయి. ఆ తర్వాత ఎంత లోతుకు వెళ్లినా కలిగే ఫలితం అలాగే ఉంటుంది. కాబట్టి పురుషాంగం ఎంత లోనికి వెళ్లాలన్న సందేహం అక్కరలేదు.

167.సెక్స్ కోర్కెలను నిగ్రహించుకోలేకపోతున్నాను. ....అందుకు ఆమె పనికిరాదా...?





ప్రశ్న  :  నా భార్య అంటే నాకు ప్రాణం. ఆమె గత ఏడాదిన్నరగా నాతో సెక్సులో పాల్గొనడంలేదు. ఐతే ఇది కేవలం ఆమెకు అదంటే ఉత్సాహం లేకపోవడమే అని నేను కనుక్కున్నాను. నేను ఒత్తిడి చేసి సెక్స్ చేసేందుకు ప్రయత్నిస్తే ఏడుస్తోంది. దండం పెడుతోంది. ఆమెను అలాంటి స్థితిలో నేను చూడలేను. వెంటనే నా ప్రయత్నాన్ని ఆపి మళ్లీ చేయనని బతిమాలి బుజ్జగిస్తున్నాను. కానీ అపుడపుడు సెక్స్ కోర్కెలను నిగ్రహించుకోలేకపోతున్నాను. ఆమెకు ఏమైనా అనారోగ్యమా... లేదంటే అందుకు ఆమె పనికిరాదా...? అసలెందుకు ఇలా ప్రవర్తిస్తోంది...?

జవాబు  :  పెళ్లయిన కొత్తలో చాలామంది యువతులకు సెక్స్ అంటే భయం ఉంటుంది. కుటుంబ పరిస్థితులను బట్టి కొందరిలో సెక్స్ అంటేనే విముఖతను పెంచుకుంటారు. దీంతో వారిలో ఫ్రిజిడిటీ చోటుచేసుకుంటుంది. అటువంటి పరిస్థితి ఏర్పడినపుడు సెక్స్ విషయంలో మనసు స్పందించదు. అలా స్పందించనప్పుడు భర్త పట్ల కూడా అయిష్టత ఏర్పడుతుంది.

భర్త ఈ పరిస్థితిని గమనించి కొంతకాలం సెక్స్‌కు దూరంగా ఉంటూ ఆమెను సెక్స్‌కు సమాయత్తపరిచేందుకు అవసరమైన పద్ధతులను అవలంభించాలి. ప్రేమ సంభాషణలు చేస్తూ అప్పుడప్పుడు కామోద్రేకాన్ని రేపే శరీర భాగాలపై సున్నితంగా, ప్రేమగా నిమురుతూ మాటలతోనే దారికి తీసుక వచ్చేందుకు కృషి చేయాలి.

ఆమెకు సంతోషం కలిగించే పనులు ఏమిటో తెలుసుకుని వాటికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ఇలా చేస్తూ పోతే ఏదో ఒకనాడు ఆమె సెక్స్‌‍కు ఆహ్వానం పలుకుతుంది. అప్పటిదాకా ఓర్పు తప్పనిసరి. ఓర్పు లేకపోతే తీయని అనుభూతులను పంచాల్సిన సెక్స్ సుఖం చేదు అనుభవాలను మిగులుస్తుంది.

166.ఆమె ఎలాంటి భంగిమలంటే ఇష్టపడుతుందో...?






ప్రశ్న  :  మాకు పెళ్లయింది కానీ ఇప్పటివరకూ సెక్స్ పరంగా కలుసుకోలేదు. త్వరలో ఇద్దరం కలుసుకోబోతున్నాం. ఐతే ఎలాంటి భంగిమలను స్త్రీ అమితంగా ఇష్టపడుతుందో నాకు తెలియదు. స్త్రీని సెక్సులో బాగా తృప్తి పరిచే భంగిమలు ఏవో తెలుసుకోవాలని ఉంది...

జవాబు  :  దాంపత్య జీవితంలో మహిళలు రోజుకో విధంగా రతి భంగిమను ఇష్టపడుతారని చెపుతారు సెక్సాలజిస్టులు. ఎందుకంటే సెక్స్‌లో బోర్ కొట్టకుండా ఉండేందుకు వారు ఈ తరహా విధానాన్ని పాటించేందుకు ఇష్టపడుతారట. పురుషుడు తన ఇష్టాన్నే కాక తన భాగస్వామి ఇష్టాన్ని సైతం తెలుసుకుని సెక్స్ జరిపితే మరింత ఆనందం పొందగలరు. సాధారణంగా మూడు రకాల సెక్స్ పద్ధతులను మహిళలు అమితంగా ఇష్టపడతారని సెక్సాలజిస్టులు చెపుతున్నారు. రోజుకో భంగిమలో జరిపినా ఈ మూడు రకాల సెక్స్ భంగిమలను ఉపయోగిస్తూ భాగస్వామిని పూర్తిగా సంతృప్తిపరచడం సాధ్యపడగలదని చెపుతున్నారు.

రోజంతా ఆఫీసు పనులతో అలసిపోయే స్త్రీలు తన భాగస్వామి తనపై నుండి జరిపే సెక్స్ పద్ధతిని కోరుకుంటారు. సెక్స్ కోర్కెలు అధికంగా కలిగిన వారైతే తామే పురుషునిపైన కూర్చుని సెక్స్ జరుపేందుకు ఆసక్తి చూపుతారు. ఇది రెండో సెక్స్ భంగిమ. అలాగే తాను వంగి వెనుక వైపు నుంచి పురుషుడు సెక్స్ చేయడం మూడోది. ఈ మూడింటిలోనూ పురుషుడు పైన ఉంటూ సెక్స్ చేయడం ద్వారా ఒకరి ముఖాల్లోని భావాలను మరొకరు చూసుకుంటూ ఆనందం పొందగలరని అధిక శాతం స్త్రీలు అభిప్రాయపడుతారని సెక్సాలజిస్టులు వెల్లడిస్తున్నారు.