Friday 29 April 2016

202. సెక్స్ మీద విపరీతమైన కోరికైతే ఉందికానీ అంగమే స్తంభించడంలేదు. .....



ప్రశ్న   :  నా వయసు 55 ఏళ్లు. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. నా భార్యకు 45 ఏళ్లు వచ్చాయి. సెక్సులో బాగా కోఆపరేట్ చేస్తుంది. కాని నేను వారానికి ఒక్కసారే సెక్సులో పాల్గొనగలను. సెక్స్ మీద విపరీతమైన కోరికైతే ఉందికానీ అంగమే స్తంభించడంలేదు. ఇది ఇప్పటి సమస్య కాదు. పెళ్లయినప్పటి నుంచి ఇలాగే ఉంది. రోజూ 2 పెగ్గులు మందు తాగి, 2 సిగరెట్ ప్యాకెట్లు కాల్చందే నిద్రపట్టదు. అందువల్లనే అది స్తంభించడం లేదా...? 

జవాబు  :  సెక్స్ కోర్కెలు ఉన్నప్పటికీ కొందరిలో అంగం స్తంభించడం అనేది ప్రతిరోజూ కావాలన్నా కుదరదు. ఇది సహజ లక్షణంగా అనుకోవచ్చు. మరికొందరిలో ఆరోగ్య కారణాల వల్ల సెక్స్ సామర్థ్యం తగినంతగా ఉండదు. దీనికితోడు సెక్స్ కోర్కె తీర్చలేకపోతున్నావని భార్య నుంచి ఛీత్కారాలతో తనకు ఎక్కువసార్లు సెక్స్ చేసే పరిస్థితి ఎందుకు కలగడం లేదన్న ఆవేదనతో మరింత డీలా పడిపోతారు. ఆ కారణంగా అంగం స్తంభించడంలో సమస్య తలెత్తుతుంది.

కాబట్టి ఆవేదన చెందకుండా, అనవసరమైన ఆలోచనలు మానేసి, నా సామర్థ్యం ఇంతేనని ప్రశాంతంగా మనసు ఉంచుకోవాలి. సిగరెట్లు, మందు సెక్స్ కోర్కెలకు, అంగ స్తంభనకు అవరోధం కలిగిస్తాయి. అవి మానేయండి. అప్పుడు అంగస్తంభన విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి.

No comments:

Post a Comment