Friday 29 April 2016

198. భవిష్యత్తులో మళ్లీ ఆమె పాత స్నేహితుడు ఎంటరవ్వడా . ....



ప్రశ్న   :  మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ఈమధ్య హనీమూన్ వెళ్లాం. అక్కడ ఒకరి సంగతులు ఒకరు చెప్పుకున్నాం. హనీమూన్ మధురానుభూతిని పొందే క్షణంలో నా భార్య చెప్పిన మాట విని తల తిరిగిపోయింది. ఆమెతో సెక్స్ చేయబోయే ముందు నాకో విషయం చెప్పింది. అదేమిటంటే... ఆమె డిగ్రీ చదివే రోజుల్లో ఓ బాయ్‌ఫ్రెండ్ ఆమెను మాయచేసి అనుభవించాడట. ఆ తర్వాత అతడు మళ్లీ కనబడకుండా ఫారిన్ వెళ్లిపోయాడట. ఈ విషయంలో తన తప్పేమీ లేదని, ఇది చెప్పకపోతే తను నిత్యం చస్తూ బతుకుతున్నట్లనిపిస్తుందని కాళ్లపై పడి బోరున ఏడ్చేసింది. 

ప్రేమించే సమయంలో ఎందుకు చెప్పలేదు అని అడిగితే... సమాధానం చెప్పటం లేదు. బోరుమని ఏడుస్తోంది. ఐతే ఆమె నా ప్రాణం. కానీ ఆమె నిజంగా మాయలో పడి అలా మోసపోయిందా.... లేదంటే ఇష్టపూర్వకంగా అతడితో సెక్సులో పాల్గొందా...? ఇప్పుడు నేను ఆమె తప్పును క్షమించి వదిలేసినా భవిష్యత్తులో మళ్లీ ఆమె పాత స్నేహితుడు ఎంటరవ్వడా .  మా పెద్దలను సైతం ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ అమ్మాయి చరిత్ర ఇదీ అని తెలిస్తే నా పేరెంట్స్ ఏమంటారోనని ఆందోళనగా ఉంది. ఈ విషయం తెలిసిన దగ్గర్నుంచి ఆమెతో నేను క్లోజ్‌గా ఉండలేకపోతున్నాను. ఆమె కూడా తన గదికే పరిమితమైపోయింది. ఇంటి పని చేసేసి గదిలో కూర్చుని ఏడుస్తూ ఉంటోంది. ఈ సమస్యకు పరిష్కారమేమిటో అర్థం కావడం లేదు.....

జవాబు   :  ఇది చాలా బాధాకరం. ప్రేమించేటపుడు కొందరు ఇలా మాయచేసి లైంగికంగా అనుభవించి మోసం చేసే వార్తలను మనం పత్రికల్లోనూ చూస్తుంటాం. కానీ ఆమె ఈ విషయంలో అమాయకురాలని తెలుస్తుంది. తన కాలేజీ రోజుల్లో అతడిని అమాయకంగా నమ్మడంతో అతడి చేతిలో మోసపోయింది. ఇప్పుడు కూడా అసలు నిజాన్ని చెప్పడంతో ఆమె తన మనసులో ఏదీ దాచుకోదని అర్థమవుతుంది. ఆమె మనసులో ఎలాంటి కల్మషము లేదని తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడామె మీ అర్థాంగి. కాబట్టి ఆమెను ఆ చేదు జ్ఞాపకాల నుంచి బయట వేసి కొత్త జీవితాన్ని అందించాల్సింది మీరే. అది ఎలాంటి జీవితం అనేది మీ చేతుల్లోనే ఉంది.


No comments:

Post a Comment