Thursday, 23 April 2015

126. అంగం స్తంభించడం లేదు... ఏం చేయాలి?





 ప్రశ్న :  మాది హైదరాబాద్. మూడు నెలల క్రితం వివాహమైంది. ఒకే కుమార్తె కావడంతో ఇల్లరికానికి వెళ్లా. డబుల్ బెడ్రూం ఫ్లాట్. ఇల్లు, పరిసరాలు బాగానే ఉన్నాయి. భార్య కూడా పడక గదిలో బాగానే సహకరిస్తోంది. అయితే, మా బెడ్రూం పక్కనే అత్తమామల బెడ్రూం కూడా ఉంది. దీంతో నాలో అంగ స్తంభనలు సక్రంగా కలగడం లేదు. ఏం చేయాలి. హానీమూన్ సమయంలో ఎలాంటి సమస్య లేకుండా వారం రోజులు పాటు బాగానే ఎంజాయ్ చేశాం. కానీ, అత్తారింటికి వెళ్లాకే ఈ సమస్యను ఎదుర్కొంటున్నా.. ఏం చేయాలి. సలహా ఇవ్వండి?

జవాబు  :  ఇలాంటి సమస్యను చాలా మంది నవ దంపతులు ఎదుర్కొంటారు. దీనికి కారణం పుట్టింటివారు తమ సమీపంలోనే ఉండటంతో వారు మనస్సు విప్పి మాట్లాడుకోలేరు. పెద్దలు కొత్త దంపతుల పక్కపక్కనే ఉండటం నవ దంపతుల శృంగార జీవితానికి ఇది ఒక సమస్యగా ఉంటుంది. ఈ సమస్య కొందరిలో మానసికంగానూ వేధిస్తుంది. మరికొందరికీ బెడ్రూంపరంగా ఉత్పన్నమవుతుంది. కొన్ని ఇళ్ళలో పక్కపక్కనే బెడ్రూమ్‌లు ఉంటుంటాయి.

ఒక గదిలో కొత్తగా పెళ్లయిన జంట ఉంటే.. మరోగదిలో తల్లిదండ్రులు/అత్తామామలు ఉంటారు. ఇలావుండటం వల్ల భార్యతో మనస్సు విప్పి మాట్లాడుకోవాలన్నా.. సెక్స్‌లో పాల్గొనాలన్నా బిడియంతో తలదించుకుంటారు. ఇలాంటి వారికి మానసిక నిపుణులను సంప్రదిస్తే వారు కొన్ని సలహాలు ఇస్తున్నారు.

ఇలాంటి సమస్యను సైకోజెనిక్ ఎరెక్ట్రల్ డిస్‌ఫంక్షన్ అని అంటారు. దీన్ని సిట్యుయేషనల్ ఈ.డి. అని కూడా పిలుస్తారని చెపుతారు. పరిస్థితులు, వాతావరణ ప్రభావం వల్ల కలిగే అంగస్థంభన లోపం, పక్కనే తల్లిదండ్రులు ఉండటం వల్ల కలిగే సిగ్గు, పశ్చాత్తాప భావనలు దీన్ని కలుగజేస్తాయని చెపుతున్నారు.

తన మనస్సు వాళ్ల ఉనికికి కండిషన్ అయిపోయి అంగస్థంభన మీద ప్రభావం చూపిస్తుందని, దీన్ని నయం చేసుకుంటే రతి క్రీడలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాబోవని చెపుతున్నారు. అలాగే, ఇండిపెండెంట్ హౌస్ లేదా బెడ్రూమ్ ఉండేలా చూసుకుంటే ఇలాంటి సమస్యలకు చెక్క పెట్టవచ్చని వారు సూచన చేస్తున్నారు.

No comments:

Post a Comment