ప్రశ్న : వివాహమై నాలుగేళ్లు అవుతున్నా నా భర్త నుంచి ఒక్క రోజు కూడా పరిపూర్ణమైన దాంపత్య సుఖం, తృప్తి పొందలేదు. నేను ఎంతగా ప్రోత్సహిస్తున్నప్పటికీ.. ఆయన మాత్రం పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో కోర్కెలతో నా శరీరం కాలిపోతోంది. ఏం చేయాలో తోచడం లేదు. పరాయి పురుషుల సంబంధాలు పెట్టుకోవాలని నా శరీరం ఆశగా ఎదురుచూస్తోంది. ఏం చేయాలి. పైగా, సెక్స్‌ను నేను బానిసనయ్యానా అనే ఫీలింగ్ నాలో కలుగుతోంది. ఏం చేయాలి. ఈ సమస్యను అధిగమించేదెలా?
జవాబు : ప్రతిదానికీ ఓ కారణం లేకపోలేదు. పడక గదిలో ఎదురయ్యే ఇబ్బందుల వల్లే మీలో కోర్కెలు తారా స్థాయికి చేరుతున్నాయి. ఈ సమస్య నుంచి బయటపడేందుకు మరో సమస్యను కొనితెచ్చుకోవద్దు. పరాయి పురుషులతో సంబంధం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. మీ భర్త ద్వారా దొరకని ప్రేమ, ఆదరణ, తృప్తి పరాయి పురుషుల నుంచి పొందాలని ఆశపడటం భంగపాటే అవుతుంది. ఇలాంటి స్నేహాల వల్ల ప్రేమ లేని సెక్స్ అనుభూతి లభించవచ్చు. అంతేకానీ, భర్త ప్రేమ, సాన్నిహిత్యం, ఆదరణ మాత్రం లభించదు. మీ భర్తకే కౌన్సెలింగ్ ఇప్పించి దారికి తెచ్చుకునేందుకు ప్రయత్నించండి.

No comments:
Post a Comment