ప్రశ్న : నాదొక వింత సమస్య. నాకు 20 సంవత్సరాల వయసు వచ్చే వరకు అసలు సెక్స్ గురించి తెలియదు. నేను నా స్నేహితుడితో హోమోసెక్స్‌కు గురయ్యాను. అట్లా స్నేహితుల వల్ల మోసపోయాను. కానీ, నాకు హెచ్‌ఐవి ఉందేమోనని భయంతో హెచ్‌ఐవి టెస్ట్ చేయించుకున్నాను. టెస్ట్‌లో హెచ్‌ఐవి లేదని తేలింది. కానీ, నా శరీరంలో చాతి భాగం స్త్రీలా వక్షోజాలలాగ వుంది. వాకింగ్ లాంటి ఎక్సర్‌సైజులు చేశాను. అయినా, తగ్గలేదు. నా బీజాలు చిన్నగా వుంటాయి. అంగం ముందు భాగం ముడుచుకొని వుంటుంది. నిద్రలో వీర్యం పడుతుంది. అప్పుడప్పుడు హస్త ప్రయోగం చేసుకుంటాను. నాకు ఇప్పుడు 28 సంవత్సరాలు. ఇంకా వివాహం కాలేదు. సంవత్సర కాలం నుండి గుట్కా అలవాటైంది. అందరు నన్ను కొజ్జా, హిజ్రా, చెక్క అని మెంటల్‌గా టార్చర్ చేస్తున్నారు. అసలు బయట తిరగాలంటేనే భయంగా వుంది. దయచేసి మీరే మంచి సలహా ఇచ్చి నా జీవితాన్ని నిలబెట్టండి.
జవాబు : ముందు నువ్వు హోమో సెక్సువాలిటీ చికిత్స తీసుకోవాలి. మంచి సెక్సాలజిస్ట్‌ని, సైకోథెరపిస్ట్‌ను కలువు. నీలో బలహీనత లేనిదే నీ స్నేహితుడు నిన్ను మోసం చెయ్యలేడు. చాలామందికి హోమోసెక్స్ వాళ్ళ హాస్టల్‌లో ఉంటున్నప్పుడు వాళ్ళ సీనియర్స్ ద్వారా అలవాటవుతుంది. వాళ్ళు బెదిరించి లొంగ దీసుకుంటారు. తర్వాత అది కొందరిలో కొనసాగుతుంది. సగానికి పైగా బాధితులు పెళ్ళి చేసుకొని మర్చిపోతారు. మర్చిపోలేని వారు తమ జెండర్ ఐడెంటిటీతో ఘర్షణ పడుతూ మానసిక ఒత్తిడికి, డిప్రెషన్‌కు లోనవుతారు. నీకు తప్పక ఈ అసహజ లైంగిక ధోరణి అలవాటు సైకో సెక్సువల్ థెరపీ ద్వారా తగ్గుతుంది. అలాగే, నిద్రలో వీర్యం పోవడం రోగం కాదు. సహజమే.
ప్రమాదమేమీ లేదు. బీర్జాలు మరీ చిన్నగా బఠానీ కాయంత ఉండి, కోరిక తగ్గి, అంగస్తంభన సమస్య ఉంటే ఆలోచించాలి. నీకవేవీ లేవు కదా? నీకు ఆడవారిలా వక్షోజాలున్నట్లున్నాయి. దీన్ని గైనకోమాస్టియా అంటారు. దీనికి నువ్వు ఆండ్రాలజిస్ట్‌ని సంప్రదించాలి. నిన్ను నువ్వు పూర్తి స్థాయి పురుషుడిలా అనుభూతి చెందడానికి నీలో మానసికంగా చాలా పాసిటివ్ మార్పు రావాలి. అందుకు సైకోథెరపీ ఉపయోగ పడుతుంది. నిన్ను నీచమైన పదజాలంతో తిట్టే కుసంస్కారుల్ని నువ్వు పట్టించుకోనవసరం లేదు. వాళ్ళ కంటే వెయ్యి రెట్లు ఆత్మ విశ్వాసంతో నువ్వు ఎదగాలి.
నీ జీవితంలోకి తాత్కాలికంగా వచ్చి చేరిన అసహజ లైంగిక ప్రవృత్తి నుంచి నువు తప్పక బయటపడతావు. నీలోని ఒత్తిడిని తగ్గించుకోవడానికి గుట్కా, ఆల్కహాల్ వంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే కేన్సర్, గుండె జబ్బు లాంటి అనారోగ్యాలు కమ్ముకోవడమే కాదు, వాటివల్ల అంగస్తంభన లోపం కలిగి వీర్యకణాల ఉత్పత్తి తగ్గిపోతుంది. సమస్యకు కృంగిపోతూ, సమాజానికి భయపడుతూ జీవితాన్ని నరకం చేసుకోకుండా మంచి చికిత్స తీసుకొని వివాహం చేసుకో.

No comments:
Post a Comment