ప్రశ్న : నా ప్రేయసిని త్వరలో వివాహమాడబోతున్నాను. ఇప్పటివరకూ ఇద్దరం సెక్సులో పాల్గొనలేదు. కానీ ఇటీవల ఓ విషయాన్ని గ్రహించాను. అప్పట్నుంచి నాకు ఆందోళనగా ఉంది. అదేమిటంటే, నా ప్రేయసి ఊహలు కానీ, ఆమె వస్తున్నప్పుడు చూస్తే నా అంగం బాగా స్తంభిస్తుంది. తీరా ఆమె వచ్చాక నన్ను కౌగలించుకుని, ముద్దు పెడుతూ ఆమె వక్షోజాలు నాకు తగిలించగానే అంగం మెత్తబడిపోతోంది.
ఆమె నాతో ఉన్నంతసేపూ అదే పరిస్థితి నెలకొని ఉంటోంది. ఇటీవల ఆమె కండోమ్ ధరించి సెక్సులో పాల్గొందామని అడిగితే పెళ్లి తర్వాత చేద్దాం అని తప్పించుకున్నా. ఇలా చెప్పడానికి నాకు తలవంపులుగా ఉంది. ఎందుకంటే తీరా సెక్స్ దగ్గరకి వెళితే అంగం అలాగే మెత్తబడిపోయి ఉంటే ఆమె వద్ద నా పరువు ఏమైపోతుందోనన్న ఆందోళనగా ఉంది. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది...?
జవాబు : యువకుల్లో చాలామందికి తాము ఇష్టపడే అమ్మాయిలను చూడగానే అంగం స్తంభించడం, ఆ తర్వాత కొద్దిసేపటికి వీర్యం ఔటవ్వడం జరుగుతుంటుంది. మరికొంతమంది యువకులకు తీరా యోనిలో అంగప్రవేశం చేసేముందు పడిపోతుంది. ఇంకొందరికి గట్టిగా హత్తుకుని, ముద్దు పెట్టుకుంటేనే వీర్య స్ఖలనమైపోతుంది. దీంతో పెళ్లి చేసుకుంటే తాము సెక్స్‌కు పనికిరామనే సందేహం వారిలో ఉత్పన్నమవుతుంది.
సాధారణంగా తొలిసారి సెక్స్‌లో పాల్గొన్నా... పెళ్లికి ముందు ఆదుర్దాగా... భయంతో ఎవరైనా చూస్తారేమో అన్న ఆందోళనతో స్ట్రెస్ లేక టెన్షన్‌తో శృంగారంలో పాల్గొనే ప్రయత్నం చేసినపుడు రక్తప్రసరణలోపం ఏర్పడి అంగస్తంభనం జరగదు. ఒకవేళ జరిగినా వీర్యం వెంటనే పడిపోతుంది.
శృంగారంలో పాల్గొనేటపుడు ఎలాంటి ఒత్తిడి, డిప్రెషన్ లేకుండా ఉండేలా చూసుకోవాలి. ఇదే కౌగలింతకు కూడా వర్తిస్తుంది. అలాగే సెక్సులో పాల్గొనాలన్న ఉత్సాహం కట్టలు తెంచుకున్నప్పుడు కూడా ఇలాగే వీర్యస్ఖలనమయిపోతుంది. మరో విషయం ఏమంటే, ఆమెను చూసినా, ఆమెను ఊహల్లో తలచుకున్నా అంగం స్తంభిస్తుంది కనుక అంగ స్తంభనల గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదు. నిరభ్యంతరంగా పెళ్లి చేసుకోవచ్చు.

No comments:
Post a Comment