ప్రశ్న : నా గర్ల్ ఫ్రెండుతో సెక్సు కావాలని ఎంతగానో బతిమాలితే అందుకు ఒప్పుకుంది. కానీ వీర్య స్ఖలనం చేయవద్దని కండిషన్ పెట్టింది. నేను సరే అని యోనిలో అంగ ప్రవేశం చేశాను. 5 నిమిషాలపాటు అలానే ఉంచాను. అంతలోనే ఆమె నన్ను పక్కకు తోసేసి వీర్యాన్ని స్ఖలించావంటూ గొడవ చేసింది. తనకు ప్రెగ్నెంట్ వస్తుందేమోనని రోజూ ఫోన్ చేసి భయపెడుతోంది. నాకు నిద్రపట్టడంలేదు. ఆమె కూడా నిద్రపోడంలేదు. నేను స్ఖలించకపోయినా ఆమె స్ఖలించానంటోంది. నాకు తెలియకుండానే స్ఖలనం జరిగిపోయే అవకాశం ఉందా...?
జవాబు : పెళ్లికి ముందు సెక్స్ సంబంధం చిక్కులు తెస్తాయని తెలిసి కూడా ఇలాంటి ఇబ్బందుల్లో ఇరుక్కుంటుంటారు కొంతమంది. సురక్షితం కాని సెక్సు కారణంగా ఖచ్చితంగా గర్భం వచ్చే అవకాశం ఉంటుందని తెలిసి కూడా పాల్గొనడం వల్ల ఇలా సతమతమైపోతున్నారు. కండోమ్ లేకుండా అంగప్రవేశం చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ రాదు అనే గ్యారెంటీ ఏమీ ఉండదు.
వచ్చే అవకాశాలు ఎక్కువే. ఇకపోతే పురుషాంగాన్ని 5 నిమిషాలపాటు అలాగే యోనిలో ఉంచినప్పటికీ కొందరిలో అంగంతో స్ట్రోక్స్ ఇవ్వకపోయినా లైంగికంగా ఉద్రిక్తం చెందడంతో వీర్యస్ఖలనమవుతుంది. స్ఖలించేటపుడు తెలుస్తుంది. ఐతే తెలియకుండా జరిగే అవకాశం బహు అరుదు. ఏదేమైనప్పటికీ వైద్యునితో పరీక్ష చేయించుకోవడం మంచిది.

No comments:
Post a Comment