ప్రశ్న : వివాహమై ఆర్నెల్లు అయింది. హైదరాబాద్‌లోని ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా. నా భార్య ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తోంది. దాంపత్య జీవితంలో బాగానే ఎంజాయ్ చేస్తున్నాం. అయితే, రోజూ ఒకే భంగిమలో సెక్స్ చేసుకుంటున్నాం. దీంతో నా భార్య... రోజూ ఒకే పద్దతిలే సెక్స్‌లో పాల్గొంటే సుఖప్రాప్తి పొందలేక పోతున్నట్టు చెపుతోంది. నా భార్యను సంతృప్తి పరిచేది ఎలా. ఏ భంగిమలో చేస్తే ఆమెను సంతృప్తి పరచవచ్చు. సలహా ఇవ్వరూ.
జవాబు : సాధారణంగా దంపతులకు ఒక వయస్సు వచ్చిన తర్వాత తాము అప్పటివరకు సంపూర్ణమైన ఆనందాన్ని అనుభవిస్తున్న సెక్స్ పద్ధతులలో మార్పు కావాలని కోరుకోవడం సహజం. అంటే కొత్త పద్ధతులు, భంగిమల్లో దాంపత్య జీవితాన్ని అనుభవించాలని ఆశపడుతారు. వయస్సు పైబడిన కాలంలో కొత్త భంగిమలు, కొత్త కొత్త పద్ధతులను అవలంభించడం సాధ్యం కాకపోవచ్చు. అయితే, యువ దంపతులు మాత్రం కొత్తకొత్త భంగిమల్లో సెక్స్ చేసుకుంటూ దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేయవచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు.
సాధారణంగా అంగచూషణ, వెనుక నుంచి రతి చేయటం, స్త్రీ పైన - పురుషుడు కింద ఉండి చేసే శృంగారం… ఇలాంటివి కావాలని స్త్రీలు వాంఛిస్తారు. వారిలో హఠాత్తుగా వచ్చే ఇలాంటి మార్పు వల్ల భర్తలలో కొత్త అనుమానం రావచ్చు. కానీ స్త్రీలలో ఇలాంటి మానసిక ధోరణి సాధారణం అని గ్రహించి, అందుకు అనుగుణంగా పురుషులు ప్రవర్తించాలని సలహా ఇస్తున్నారు.
అంతేకాకుండా... స్త్రీ పురుషులిద్దరూ ఆరోగ్యకరంగా ఉంటే అంగచూషణ వల్ల ఎలాంటి సమస్యా ఉండదనీ, వ్యాధులు రావని చెపుతున్నారు. పైపెచ్చు... సెక్స్‌లో మరింత ఆనందాన్ని పొందుతారట. అదేవిధంగా స్త్రీతో వెనుక నుంచి సెక్స్ చేయటం కూడా. ఇది కూడా స్త్రీ పురుషులిద్దరికీ కొత్త ఆనందాన్నిస్తుంది. కొత్త అనుభూతిని కలుగజేస్తుందని ఇలాంటి భంగిమ వల్ల ఎలాంటి వ్యాధులు రావని చెపుతున్నారు.
స్త్రీ పురుషుని మాదిరిగా ప్రవర్తిస్తూ చేసే రతిని ఉపరతి అని అంటారు. పురుషుడు స్త్రీ శరీరావయవాలను స్పర్శిస్తూ, ఏ విధంగా ఆనందం పొందుతాడో స్త్రీ పురుషుడితో ఆ విధంగా ప్రవర్తించటమే ఈ పధ్ధతి. కొన్నాళ్ళ తర్వాత రొటీన్‌గా తయారయ్యే సెక్స్ ఇలాంటి మార్పుల వల్ల కొత్తదనంతో నిండుతుంది. భార్యాభర్తలిద్దరూ తమ కలయిక కోసం ఎదురుచూసేలా చేస్తాయని సెక్స్ వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, భార్యాభర్తలకు అనువైన భంగిమను ఎంచుకుని శృంగారంలో పాల్గొనవచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు.

No comments:
Post a Comment