Thursday, 19 March 2015

103 . నాతో సెక్స్ జీవితం థ్రిల్‌గా లేదని నా భార్య మరొకరితో తిరుగుతోంది.. ఏం చేయాలి?


ప్రశ్న :  నాకు వివాహమై 15 యేళ్లు అయింది. ఇద్దరు పిల్లలు పుట్టారు. ఒక రోజున నా భార్య హఠాత్తుగా మీతో జీవనం బోర్‌గా ఉంది.. థ్రిల్‌లేని ఈ దాంపత్య జీవితం నాకు వద్దు. నేను వెళ్లిపోతున్నా అంటూ ఓ ఉత్తరం రాసి పెట్టి మాయమైంది. ఇపుడు మరో వ్యక్తితో తిరుగుతున్నట్టు తెలిసింది. ఆమెను మార్చి తిరిగి నా దారికి తెచ్చుకునే మార్గమేంటి. నా పిల్లల భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని ఈ ఆలోచనకు వచ్చాను. ఏం చేయమంటారు. ఆమె ఎలాంటి దాంపత్య జీవితాన్ని నా నుంచి ఎదురు చూస్తుంది. సలహా ఇవ్వండి?

జవాబు :  ఇలాంటి పరిస్థితి ఎదురు కావడం ఏ ఒక్క పురుషుడు కూడా జీర్ణించుకోలేరు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత దాంపత్య జీవితం మరింత పటిష్టంగా మారిన సమయంలో ఇలా అర్థాంతరంగా వెళ్లిపోవడం చాలా బాధాకరం. దాంపత్య జీవితంలో లభించని సుఖాన్ని ఆమె ముందుగా మీతో చర్చించివుంటే చాలా బాగుండేది. అయితే, అలాకాకుండా, హఠాత్తుగా వెళ్లిపోవడం వెనుక ఆమె మనస్సులోని ఆలోచనలు మరోలా ఉన్నాయని తెలుస్తోంది. పైపెచ్చు.. మరో వ్యక్తితో ఉంటుందని చెపుతున్నారు.
 
అందువల్ల ఆమె గురించి ఆలోచించడం అనవసరం. మీ పిల్లలను మీరే పోషించుకోండి. వారి భవిష్యత్‌ మీ నిర్ణయంపై ఆధారపడివుంటుంది. మీ జీవితంతో పాటు.. మీ పిల్లల జీవితాన్ని సరైన గాడిలో పెట్టుకోవాల్సిన బాధ్యత మీపై ఉందని గ్రహించండి. కాలమే అనేక సమస్యలకు పరిష్కార మార్గం చూపుతుంది. మీ జీవితంలో పిల్లలు ముఖ్యం. వారిని మంచి స్థానంలోకి తీసుకొచ్చేందుకు పాత జ్ఞాపకాలను మరచిపోవడం ఉత్తమం.

No comments:

Post a Comment