జవాబు : ఆధునిక యుగంలో ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కడపడితే అక్కడ లభ్యమవుతున్నాయి. దీంతో కాలంతో పాటు పడుగెతున్న ప్రజలు నోటికి రుచికరంగా ఉండే ఈ ఫాస్ట్‌ఫుడ్స్‌ను కడపునిండా ఆరగిస్తున్నారు. ఫలితంగా.. శరీరంలో కొవ్వు విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో దీన్ని కరిగించుకోవడానికి గంటల కొద్దీ జిమ్‌లలో కుస్తీ పడుతుంటారు. అయితే, సైక్స్ వైద్య నిపుణులు మాత్రం కొవ్వును సులభంగా కరిగించుకునేందుకు ఓ సలహా ఇస్తున్నారు. అదేంటంటే...
గంటల కొద్దీ జిమ్‌లో గడపకుండా హాయిగా మత్తుగా బెడ్ మీదనే భార్యామణితో గడపడమేనట. భార్యామణి లేదా ప్రియురాలు ఇచ్చే ముద్దుల మత్తులో గడపండి అని సలహా ఇస్తున్నారు. కెర్రీ మెక్ క్టోస్కే అల్టిమేట్ సెక్స్ డైట్ అనే పుస్తకాన్ని రాశారు. ఇందులో అర్థగంట సేపు ముద్దుల్లో మునిగితేలితే ఏకంగా 150 నుంచి 250 కేలరీల శక్తి ఖర్చువుతుందట. ఇంకా మీరు కిందామీద పడేదాన్ని బట్టి 350 కేలరీలు కూడా కరిగే అవకాశం ఉందట.
చెమటలు కక్కేలా జిమ్‌లో బస్కీలు తీస్తూ కుస్తీ పడటం కంటే... భార్యతో పడక గదిలో సంతోషంగా గడపడం మేలని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఇది స్త్రీలకైనా పురుషులకైనా కొవ్వు కరిగించుకోవడానికి ఇదే ఉత్తమమైన మార్గమని ఈ పుస్తకం రాసిన డాక్టరు అంటున్నాడు. ఇకెందుకు ఆలస్యం... పడక గదిలో ట్రై చేయండి.... అవునో కాదో తేలిపోతుంది.

No comments:
Post a Comment