Thursday, 19 March 2015

101 .అంతటి వికృత వ్యక్తితో సంసారం అవసరమా?


ప్రశ్న :   నాకు 36 సంవత్సరాలు. ఇద్దరు పిల్లలు. మా వారి వయస్సు 45 సంవత్సరాలు. ఆయన బీ.పీ., షుగర్లకు మందులు వాడుతున్నారు. ఆయనకు బయటి స్త్రీలతో సంబంధాలున్నాయి. వాళ్ళను ఇంటికి తీసుకు వచ్చి నాతో సేవలు చేయిస్తారు. చేయకపోతే కొట్టేంత పనిచేస్తారు. సెక్స్ సామర్థ్యం కోసం ఏవేవో ఇంగ్లీష్ మందులు వాడుతుంటారు. నాకు అంగస్తంభన సమస్య ఉందని ఎవడితో పోతున్నావు? అని పిల్లల ముందే అసభ్యంగా మాట్లాడుతుంటారు. ఆయనకున్న అంగస్తంభన సమస్య నా దగ్గరే వస్తుందని వేరే స్త్రీల దగ్గర బాగానే ఉంటుందనీ అతని సమస్యకు నేనే కారణమనీ నిందిస్తుంటారు. సంవత్సర కాలంగా ఇద్దరం వేర్వేరు గదుల్లోనే పడుకుంటున్నాం. వాళ్ళ అమ్మతో కూడా ఈ విషయాలు చెబుతూ, కొడుకూ అమ్మా కలిసి నన్నే తిడుతుంటారు. నాకు పుట్టిల్లున్నా లేనట్లే. నాకు జీవితం నరకంగా ఉంది. నా పిల్లల కోసం భరిస్తున్నాను. ఈ సమస్యనెలా పరిష్కరించుకోవాలో మీరే చెప్పండి...

 జవాబు :   ఇంత సంస్కారహీనంగా మీతో వ్యవహరిస్తున్న మీ భర్తతో మీరు ఇంకా ఉండాలనుకోవడం మీ పిల్లల భవిష్యత్తు కోసమేనని ఒప్పుకుంటాను. కానీ, విచ్చలవిడి లైంగిక జీవితం నెరపే అతనితో మీకు చాలా ప్రమాదం ఉంది. అది హెచ్‌ఐవి, ఇతర సుఖవ్యాధులు అతని నుంచి మీకు సోకే అవకాశం. హెచ్‌ఐవి అంటితే ఏ పిల్లల కోసమైతే అతని నైచ్యాన్ని భరిస్తున్నారో అది నిలుస్తుందా? ఆలోచించండి. సరే ముందు మీరు, మీ భర్త కూడా హెచ్‌ఐవి పరీక్షలు చేయించుకోండి.

ఎప్పటి లాగే ఆయనకి దూరంగానే ఉండండి. ఇద్దరికి లైంగిక వ్యాధులున్నట్లు బయటపడితే ఇద్దరూ సెక్స్ థెరపిస్ట్ దగ్గర చికిత్స తీసుకోండి. అతను పరీక్షలు చేయించుకోవడానికి నిరాకరిస్తే వీలు కాదు చేయించుకోవాల్సిందేనని ఖచ్చితంగా చెప్పండి. మీకు లైంగిక వ్యాధులు అంటించి మీ ఆరోగ్యాన్ని పాడు చేసి, మీ ఆయుష్షుని అర్థాంతరంగా ముగించే అధికారం అతనికి లేదు. అయినా, అతనితోనే నిర్ణయించుకోవాలి అనుకుంటే మాత్రం కొన్ని ఖచ్చితమైన పనులు చేయాలి. అతనితో సెక్స్‌లో అసలు పాల్గొనక పోవడం. నేను పైన చెప్పిన సుఖవ్యాధులకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవడం.

అతణ్ని ఏదో రకంగా సెక్స్ థెరపిస్ట్ దగ్గరికి తీస్కెళ్ళి పరీక్షలు చేయించి చికిత్స తీసుకునేలా చేయడం, హెచ్‌ఐవి రాకుండా పిల్లల కోసం అతనూ బతకాలిగా మరి. ఇక, అతని అంగస్తంభన సమస్య తగ్గే విధంగా అతన్ని డయాబెటాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి మందులు దాని డోసు (షుగరు, బీపీ, రెంటికీ) తగ్గించుతారేమో అడగడం. తర్వాత అతణ్ని సెక్సాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళడం. అలాగే చాలా ముఖ్యమైంది స్త్రీగా మీ ఆత్మగౌరవానికి సంబంధించింది మీ భర్తలో కన్పిస్తున్న వికతమైన లైంగిక పోకడల్ని మీరు భరించి తీరాలా? తనలో అంగస్తంభన లోపం ఉంచుకుని అది మీ దగ్గరే వస్తుందని భ్రమపడుతూ, ఇతర స్త్రీల వద్దకు వెళ్తూ తన లైంగిక సామర్థ్యాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేయడం మంచిది కాదు.

పరాయి స్త్రీల దగ్గరకూడా ఇంగ్లీషు మందులు వాడుతున్నాడు కదా మరి? వెళ్ళిన ప్రతీ స్త్రీ దగ్గరా వైఫల్యం చెందుతూ తీవ్రమైన నిరాశ, నిస్పహలకు లోనవుతూ భరిస్తుంది కదా అని భార్య అయిన మీ మీద చూపిస్తున్నారు. ఈ పైశాచిక ధోరణిని ఖచ్చితంగా ఎదిరించాలి. మీరు స్త్రీలను ఇంటికి తీసుకు వస్తూ వాళ్ళకు మీతో చాకిరీ చేయించే మీ భర్తమీద, మీ మీద భౌతిక హింసను ప్రయోగిస్తున్నందుకు అతని మీద మీరు గహహింస కేసు పెట్టవచ్చు. అతనితో మీకు ఎప్పటికైనా హెచ్‌ఐవి ప్రమాదం పొంచి ఉంటుంది. ఇలాంటి వ్యక్తితో పిల్లల కోసమైనా మీరు ఉండాల్సిన అవసరం లేదు. అతనితో ఉండటం వల్ల మీకు అనారోగ్య భయం, హింస, అవమానాలు మాత్రమే ఉంటాయి.

అతన్నించి విడిపోతే మీకు ఇవన్నీ తప్పి, ఆత్మగౌరవంతో కూడిన జీవితం మిగులుతుంది. ఎప్పుడు కోరతాడో ఏ క్షణంలో హెచ్‌ఐవి అంటిస్తాడో అని నిత్యం భయం, అభద్రతల మధ్య బతికే బదులు విడిపోయి మీకున్న డిగ్రీతో ఏ టీచరు ఉద్యోగమో చేస్తూ బతకవచ్చు. మీ పిల్లలకు ఇలాంటి బాధ్యత లేని తండ్రి అవసరమా ఆలోచించండి. లేదూ అంటే అదే ఇంట్లో ఉంటూ అతని మీద గహహింస కేసు పెడితే కౌన్సెలింగ్‌తోనన్నా కొద్దిగా సమాజ భయం ఏర్పడి ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉంటాడేమో ప్రయత్నించండి. ఒక మంచి మహిళా సంఘంలో కూడా కంైప్లెంట్ ఇవ్వండి. అలాగే, అతనితో ఉంటున్నప్పటికీ ఉద్యోగం చేయడం వల్ల మీకు ఆర్థిక స్వాతంత్య్రం కలిగి ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. ఆలోచించండి. మీ పిల్లలు మీ నుంచి నేర్చుకోవల్సింది ఇదే!

No comments:

Post a Comment