ప్రశ్న : మేమిద్దరం గత ఐదేళ్లుగా క్లోజ్ ఫ్రెండ్సుగా ఉంటున్నాం. ఆ అమ్మాయి చాలా అందగత్తె. టెన్త్ క్లాసు నుంచి ఇద్దరం స్నేహితులుగా ఉన్నాం. డిగ్రీ అయిపోయి ఉద్యోగాల వేటలో ఉన్న మాలో ఆమెకు ఇటీవలే ఉద్యోగం దొరికింది. పార్టీ ఇస్తాను రమ్మని హోటలుకు తీసుకెళ్లింది. నా ఇష్టమైనవన్నీ కొనిపెట్టి తినిపించింది. ఆ తర్వాత మాటల్లో మాటగా సెక్స్ గురించి నీకు తెలుసా అని అడిగింది. నాకేం చెప్పాలో తెలియలేదు.
మళ్లీ తనే ఇపుడా గొడవెందుకులే.. అని ముగించేసింది. ఆ తర్వాత నుంచి ఆమెను చూస్తుంటే నాలో సెక్స్ కోర్కెలు కలుగుతున్నాయి. మునుపటిలా ఆమెతో ఉండటంలేదు. ఆమె సెక్సీ భాగాలను తెలియకుండానే తాకేందుకు ప్రయత్నిస్తున్నాను. నేనలా తాకుతున్నా ఆమె ఏమీ అనడంలేదు. అంటే, సెక్స్ చేయమనేగా దీనిర్థం అనుకుంటున్నాను...
జవాబు : సెక్సీ సంభాషణలు, సెక్స్ గురించిన చర్చ యువతీయువకుల మధ్య... అదీ క్లోజ్ ఫ్రెండ్స్ వద్ద సహజంగానే చోటుచేసుకుంటుంది. అంతమాత్రాన ఆమె మీతో సెక్స్ కావాలని కోరుకుంటున్నట్లు అర్థం కాదు. ఇకపోతే మీరు ఆమెను సెక్స్ వాంఛతో చూస్తున్న సంగతి ఆమె కనిపెట్టిందో లేదో తెలియదు. మీరామెతో సెక్స్ సుఖాన్ని కోరుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. కనుక ఒకవేళ మీరు అదే కోరుకున్నట్లయితే ముందుగా ఆమెతో వివాహం గురించి ప్రపోజ్ చేయండి. ఆ తర్వాత పెద్దల అంగీకారం తీసుకుని పెళ్లి చేసుకున్న తర్వాత మీరు కోరుకున్నది అనుభవించవచ్చు.

No comments:
Post a Comment