Monday, 19 October 2015

178.ఆ ఛాటింగ్ అమ్మాయిని మర్చిపోకలేకపోతున్నా... భార్యతో తృప్తిగా ఉండటంలేదు...






ప్రశ్న  :  నాకు ఛాటింగులో ఓ అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఆ ఛాటింగ్ మా ఇద్దరినీ బాగా ముందుకు తీసుకెళ్లింది. కానీ మూడు నెలల తర్వాత విడిపోయాం. తప్పు నాదేననిపిస్తుంది. ఆమెను మరచిపోలేకుండా ఉన్నాను. మరో అమ్మాయి నా జీవితంలోకి వచ్చి నన్ను సెక్స్ పరంగా సుఖపెడుతున్నా ఆ అమ్మాయే గుర్తుకు వస్తోంది. ఆమె గుర్తుకు వస్తే చాలా బాధగా ఉంటోంది. ఇది నాకు వదలదా...?

జవాబు   :  మీ జీవితంలోకి వచ్చిన అమ్మాయిలో కూడా నీ పాత ప్రేయసిని వెతుక్కుంటూ కూర్చుంటే మీ బాధ వదలదు. మొదటి అమ్మాయిలో మంచి గుణాలు ఉండి ఉంటాయి. అందరిలోనూ అలాంటి గుణాలే ఉండాలంటే ఉండవు కదా. జీవితంలో సెటిలయి సుఖంగా ఉండాలనుకుంటున్నారా.. లేదంటే ఇలా ఆలోచిస్తూ ఆరోగ్యం చెడగొట్టుకోవాలనుకుంటున్నారా... కాబట్టి మీ మాజీ ప్రేయసి జ్ఞాపకాలను వదిలేసి కొత్తగా మీ జీవితంలో అడుగుపెట్టిన అమ్మాయితో హాయిగా కాపురం చేసుకోండి. భవిష్యత్ గురించి ఆలోచించండి.

No comments:

Post a Comment