Wednesday, 21 October 2015

181.నాకు ఈ రోగం అంటించి ప్రేమించిన వాడు మాయమయ్యాడు.




ప్రశ్న :   నా వయస్సు 24 సంవత్సరాలు. ఇంకా పెళ్ళి కాలేదు. 19 సంవత్సరాల వయస్సులో ఓ అబ్బాయిని ప్రేమించాను. ఇద్దరం పెళ్ళి చేసుకోవాలని అనుకున్నాం. తన మీద ప్రేమ ఉంటే సెక్స్‌లో పాల్గొనమని ఒత్తిడి చేయడంతో ఒప్పుకున్నాను. మొదటిసారి కలిసినప్పుడు బ్లీడింగ్ అయ్యింది. నెల రోజుల తర్వాత నా యోనికి ఇరువైపుల నీటి కురుపుల్లాగా వచ్చాయి. అలా ప్రతి నెలా ఒకటి రెండు సార్లు వచ్చేవి. హెచ్‌ఐవి టెస్ట్ నెగెటివ్ అని వచ్చింది. లావుగా, ఆరోగ్యంగా ఉండే దాన్ని సన్నగా, నల్లగా అయిపోయాను. నీరసం, మతిమరుపు వచ్చాయి. ఎంతో ధైర్యంగా ఉండే నాకు ఆత్మహత్య చేసుకోవాలనే పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. నాకు ఈ రోగం అంటించి ప్రేమించిన వాడు మాయమయ్యాడు. పెళ్ళి చేసుకోవాలని లేదు. కానీ, ఈ రోగం తగ్గించుకుని ఆరోగ్యంగా ఉండాలని ఉంది...:


జవాబు :  నీకు బహుశ Herpes అనే సుఖవ్యాధి వచ్చి ఉంటుంది. సిగ్గు పడకుండా వెంటనే సెక్స్ విడిఆర్‌ఎల్ స్పెషలిస్ట్ వద్దకు వెళ్ళి చికిత్స తీసుకో. కనీసం గైనకాలజిస్ట్ వద్దకైనా వెళ్ళు. చాలామంది మగవాళ్ళు ప్రేమ ఉంటే సెక్స్‌లో పాల్గొనమని కాబోయే భార్యలను బలవంతం చేస్తుంటారు. వాళ్ళ స్వార్థానికి ఈ పరీక్ష ప్రయోగిస్తుంటారు. నీలాంటి అమ్మాయిలు వాళ్ళ ఎమోషనల్ బ్లాక్ మెయిల్‌కి లొంగిపోయి ఇలాంటి అనర్థాలను కొని తెచ్చుకుంటారు. నిజంగా ప్రేమించే వాళ్ళు కాబోయే భార్యమీద గౌరవం ఉన్న వాళ్ళు, విలువలు తెలిసిన వాళ్ళు ఇలా బ్లాక్‌మెయిల్ చేసి వారిని మానసిక ఆందోళనకు గురిచేయరు. అలా చేస్తే అది నిజమైన ప్రేమ కాదు. అలాంటి వాళ్ళు జీవిత భాగస్వామిగా భవిష్యత్తులో కూడా పనికి రారు.

కాబట్టి, అలాంటి వాళ్ళను వెంటనే తిరస్కరించాలి. జరిగిన దానికి బాధ పడకుండా కంగిపోకుండా డిప్రెషన్ నుంచి బయటపడు. ఆత్మహత్య ఆలోచన మంచిది కాదు. బీఎడ్ చేసిన నువు ఒక టీచరుగా సమాజానికి పనికి వచ్చే విలువైన సంపదవి. నీ పుట్టుకకు ఉన్న విలువ అది. ఆత్మ విశ్వాసంతో ఉండి మంచి చికిత్స తీసుకుంటే వ్యాధి తప్పకుండా తగ్గుతుంది. మంచి పౌష్టికాహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుని నీ విద్యను పదిమందికి పంచు.

No comments:

Post a Comment