ప్రశ్న : మాది విజయవాడ. ప్రస్తుతం పాండిచ్చేరి యానాంలో నివశిస్తున్నా. ఇద్దరం ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నాం. మా వారి స్నేహితుడు ఒకరు తరచుగా మా ఇంటికి వస్తూపోతుండేవారు. నా భర్తపై ఎపుడైనా కోపం వచ్చినా.. పడక గదిలో పోట్లాడుకున్నా.. అతనితో చనువుగా ఉండేదాన్ని. ఓసారి మావారు లేని సమయంలో అతను మా ఇంటికి వచ్చాడు. ఇద్దరం టీ తాగుతూ మాట్లాడుతున్నపుడు ఉన్నట్టుండి నా చేయి పట్టుకున్నాడు. వెంటనే నేను వంటింట్లోకి వెళ్లాను. అక్కడికి వచ్చి నన్ను వాటే సుకుని ముద్దులు పెట్టుకునేసరికి అతనికి లొంగిపోయాను. అప్పటి నుంచి మేమిద్దరం తరచుగా కలుస్తున్నా. తీరా అతని గురించి ఆరా తీయగా.. అతనికి భార్య లేదని తెలిసింది. దీంతో నాకు మరింత జాలేసి అతని కోరిక తీరుస్తున్నా. అయితే, మా వారికి ద్రోహం చేస్తున్నానన్న బాధ మాత్రం నన్ను వెంటాడుతోంది. ఏం చేయాలి సలహా ఇవ్వండి.
జవాబు : ఇది నిజంగానే మీ భర్తకు మీరు చేసే ద్రోహం. అందువల్ల ముందు అతనికి దూరంగా ఉండండి. ముఖ్యంగా మీవారు లేనిసమయంలో అతనిని ఇంటికి రావొద్దని చెప్పండి. యుక్త వయస్సు లేదా పెళ్లీడు సమయంలో తప్పులు చేయడం సహజం. కానీ, మీరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఓ గృహిణిగా ఉంటూ ఇలాంటి తప్పు చేయడం మంచిది కాదు. మీరు పూర్తిగా అతని మాయలో పడిపోయారు. అంటే మీ అమాయకత్వాన్ని అతను క్యాచ్ చేసి మీతో పడక సుఖం పొందుతున్నాడు. ఇలా చేయడం తప్పు అని తెలిసి కూడా అతనికి భార్య పోయిందన్న జాలితో ఆ సంబంధాన్ని కొనసాగిస్తుండటం అర్థంలేనిది. ఈ విషయం మీ భర్తకు తెలిస్తే.. మీపై జాలి చూపేందుకు ఒక్కరు కూడా ఉండరనే విషయం గుర్తు పెట్టుకోండి.

No comments:
Post a Comment