Wednesday, 12 August 2015

159.అప్పట్నుంచి సెక్సులో పాల్గొనదే ఉండలేకపోతున్నాం ?






ప్రశ్న  :  మేమిద్దరం ప్రేమికులం. ఇద్దరం పీజీ కోర్సులు చేస్తున్నాం. మేమిద్దరం పెళ్లాడుతామని మా పేరెంట్స్ కి చెబితే వాళ్లు ఒప్పుకున్నారు కూడా. ఐతే పీజీ ముగిశాక ఉద్యోగంలో సెటిల్ అయ్యి పెళ్లి చేసుకోమన్నారు. తనకి క్యాంపస్ సెలక్షన్ కూడా అయిపోయింది. ఇక నాకు రావాల్సి ఉంది. కాకపోతే దానికి మరో రెండేళ్లు పట్టవచ్చు.

అంతవరకూ వేచిఉండాలన్నారు మా పేరెంట్స్. ఐతే అనుకోకుండా ఒకరోజు ఇద్దరం సెక్సులో పాల్గొన్నాం. ఇక అప్పట్నుంచి సెక్సులో పాల్గొనదే ఉండలేకపోతున్నాం. ఈ ఒక్కసారి సెక్స్ చేసుకుని పెళ్లయ్యే వరకూ వద్దనుకుంటాం. కానీ మరుసటి రోజు మళ్లీ నేను ఆమెను బ్రతిమలాడుతాను. ఇలా జరిగిపోతూ ఉంది. కానీ ఎలాగైనా మానుకోవాలని గట్టిగా అనుకున్నాను. మార్గం ఏదైనా ఉందా...?


జవాబు   :  ముఖ్యంగా నిగ్రహం అవసరం. సెక్సులో పాల్గొనే సమయం కోసం వేచి చూడాల్సిన పరిస్థితి కలుగకుండా ఆ సమయాన్ని మొత్తం కెరీర్ పైనే దృష్టి సారించండి. ఇంకా కొన్నాళ్లు కాస్త దూరంగా ఉండి చదువు సాగించేందుకు ప్రయత్నించండి. అనుకుంటే సాధించలేనిదీ ఏదీలేదు. మానుకోలేకపోవడం అనేది అసంభవం. పెళ్లికి ముందు సెక్స్ అనేది ఇద్దరికీ సమస్యలను తెచ్చి పెడుతుంది. నియంత్రణ అవసరం.

No comments:

Post a Comment