జవాబు: నీ ఎత్తు, బరువు రెండూ ఎక్కువున్నాయి. అధిక బరువు వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. నీకేమన్నా థైరాయిడ్ సమస్య ఉందేమో చెక్ చేసుకో. రోజూ వ్యాయామం, వాకింగ్ చేస్తూ కొవ్వును పెంచే స్వీట్లు, బేకరీ పదార్థాలు తినటం తగ్గించు. ఇక స్తంభించినప్పటి నీ అంగం పొడవు సరిగానే ఉంది. దాని గురించి బెంగ అవసరం లేదు. నువు చాలా లావుగా ఉండటం వల్ల చిన్నగా అనిపిస్తుంది అంతే. ఇక హస్త ప్రయోగం వారానికి 4-5 సార్లు మాత్రమే మంచిది. అతి మంచిది కాదు. హస్త ప్రయోగం వల్ల అంగం సైజు చిన్నగా కాదు. 18 సంవత్సరాల తర్వాత అంగం సైజు పెరగడం ప్రతి ఒక్కరిలో ఆగిపోతుంది. స్తంభించిన తర్వాతి సైజే ముఖ్యం. అంగం పెద్దగా కావడానికి లోకంలో ఎక్కడా ఏ మందులు లేవు. మోసపోవద్దు.
అంగం పెద్దగా అవాల్సిన అవసరం లేదు. నువు ఒకసారి ప్రిమెరైటల్ కౌన్సెలింగ్ తీసుకుని తర్వాతే వివాహం చేసుకో. అయినా, చెబుతున్నాను నువు 100 శాతం వివాహానికి అర్హుడివి. కోరికలు బాగా ఉండటం, అంగం స్తంభించడం, వీర్య స్ఖలనం గావించడం, వీర్య కణాలు సమృద్ధిగా ఉండి మంచి కదలికలో ఉండటం- ఇవన్నీ వివాహ యోగ్య లక్షణాలు. కాబట్టి, నువ్వు బెంగ పడకుండా పెళ్లి చేసుకో.

No comments:
Post a Comment