Wednesday, 7 January 2015

86. పెళ్ళికి ముందు కొద్దిమందితో ఈయనకి శారీరక సంబంధాలూ ఉండేవట...



ప్రశ్న :   మా వివాహమై సంవత్సరమవుతోంది. మా వారు అందంగా ఉంటారు. పెళ్ళికి ముందు చాలామంది గర్ల్‌ఫ్రెండ్స్ ఉండేవారట. కొద్దిమందితో ఈయనకి శారీరక సంబంధాలూ ఉండేవట. నేను ఈయన్ను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాను. పెళ్లికి ముందు ఆయనకు హస్త ప్రయోగం అలవాటు కూడా ఉందట. ఆ అలవాటు వల్ల తన అంగం చిన్నగా అయ్యిందని, మధ్యన విరిగిందని, వీర్యం సరిగా బయటకు రావడం లేదనీ అంటున్నాడు. ఇంతవరకూ మేమిద్దరం శారీరకంగా ఏకం కాలేదు. నాకు తల్లిని కావాలని ఉంది. మా వారి అనుమానాలన్నీ నిజమేనా? మేం ఏం చేయాలో సలహా ఇవ్వగలరు. 

జవాబు :  ముందు మీరిద్దరు హెచ్‌ఐవి పరీక్ష చేయించుకోండి. బహుశా నీకు అతణ్ని ప్రేమించి పెళ్లి చేసుకునే ముందు అతని గతం తెలిసి ఉండదు. మీ ఆయన అందంగా ఉంటే గర్ల్‌ఫ్రెండ్స్ ఉంటానికి, వేశ్యలతో తిరగడానికి అభ్యంతరాలు ఉండకూడదా? ముందు నీ ఉద్దేశ్యం మార్చుకో. లేదంటే తను చేసింది అతనికి పెద్ద తప్పుగా అనిపించదు. పైగా ఇదే తప్పుడు ధోరణి కొనసాగుతుంది. అందం కంటే వ్యక్తిత్వం, విలువలు ముఖ్యం.

పెళ్లికి ముందు, తర్వాత అక్రమ సంబంధాలు నెరపే పురుషుడి ధక్పథంలో స్త్రీలు పురుషుడి శంగార వాంఛలు తీర్చే లైంగిక వస్తువులు మాత్రమే. ఇక మీ వారి సమస్యకు వద్దాం. అంగం విరగడం అంటూ ఉండదు. అంగస్తంభన సమయంలో ఫ్రెన్యులం అనే భాగం కట్ అయి వుంటుంది. బాగా కట్ అయితే ఆపరేషన్‌తో సరిచేసుకోవచ్చు. అంగస్తంభన బాగానే ఉంది, కాబట్టి దిగులు పడాల్సిన అవసరం లేదు. ఇక వీర్యం రావాల్సినంత స్థాయిలో ఎందుకు బయటకు రావడం లేదన్న దానికి పురుషాంగంలోని యెరెత్రా నిర్మాణంలో లోపాలు, వషణాల నుంచి వీర్యాన్ని మోసుకెళ్లే వీర్య వాహికలలో లోపాలు, అడ్డంకులు, వషణాల్లో ఏమైనా వ్యాధులు, టెస్టోస్టిరాన్ హార్లోన్ల స్థాయిలో లోపాలు బీపీ, షుగరు లాంటి వ్యాధులు, తీవ్రమైన మానసిక అవరోధాలు వంటివి ఏవైనా కారణాలు కావచ్చు. కాబట్టి మీ అతనిని సెక్సాలజిస్ట్ వద్దకు తీసుకెళ్ళండి. సమస్య పరిష్కారం అవుతుంది.

No comments:

Post a Comment